హోండా బిఆర్-వి మొదటి లుక్

హోండా బిఆర్-వి కోసం cardekho ద్వారా నవంబర్ 17, 2015 06:15 pm ప్రచురించబడింది

జైపూర్:

Honda BR-V Front

బిఆర్-వి భారతదేశం లో హోండా కార్ల యొక్క చాలా ముఖ్యమైన ఉత్పత్తి. ఈ విభాగంలో మొట్టమొదటి ఉత్పత్తి మొబిలియో. ఇది నెలవారీ అమ్మకాల పరంగా అంతగా రాణించలేదు. హోండా సంస్థ కి రూ. 8-12 విభాగంలో ఒక విజయవంతమైన 7-సీటర్ వాహనం అవసరం వచ్చింది మరియు బీఆర్-వి వాహనం మొబిలియో విఫలాన్ని భర్తీ చేయవచ్చు.

Honda BR-V Front

బిఆర్-వి వాహనం బ్రియో, అమేజ్ మరియు మొబిలియో మాదిరిగానే అదే ప్లాట్‌ఫార్మ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది మొబిలియో స్థానంలో వచ్చినప్పటికీ సౌందర్య పరంగా విభిన్నంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని నిటారు మరియు ఎత్తైన వైఖరి దీనికి మస్క్యులర్ లుక్ ని ఇస్తుంది మరియు హోండా తయరీదారులు దీనిని ఒక ఎస్యువి లా కాకుండా క్రాసోవర్ వంటి లుక్ వచ్చేలా తయారుచేశారు. ఉదాహరణకు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200mm కి పైగా ఉంది. అన్ని వైపులా మాట్ నల్లటి క్లాడింగ్ మరియు వెండి స్కిడ్ ప్లేట్లు అన్నీ కూడా ఉద్దేశ్యపూర్వక వైఖరి ఇవ్వాలని చేసినట్టుగా ఉంది. దీని ముందరి భాగం హెడ్లైట్ మరియు క్రోమ్ గ్రిల్ డిజైన్ పరంగా సిటీ కి దగ్గరగా పోలి ఉంది. దీని బంపర్ డిజైన్ హోండా ప్రమాణాల ప్రాతిపదికగా ఉంది మరియు క్రోం ఫాగ్ ల్యాంప్ రింగ్స్ తో అమర్చబడి ఉంది.

Honda BR-V Side

బిఆర్-వి యొక్క ప్రక్క ప్రొఫైల్  పెద్ద విండోస్ తో సహా మొబిలియో ని గుర్తుకు తెస్తుంది. ఈ పెద్ద విండోస్ ఎయిరీ క్యాబిన్ కి చాలా ముఖ్యమైనవి. అలాయ్ వీల్స్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి, బిఆర్-వి వెనుక నుండి చూడడానికి సమానంగా బాగుంది. దీని పదునైన టెయిల్ ల్యాంప్స్ మధ్య స్థానములో ఉన్నాయి మరియు ఏకైక సమాంతర టెయిల్-పీస్ గ్లాస్ , టెయిల్ గేట్ అంతటా ఉండి ఫాన్సీ లుక్ ని ఇస్తుంది. బిఆర్-వి వెనుక అంతర్నిర్మిత స్పాయిలర్ తో పాటూ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ని కలిగి అద్భుతంగా ఉంటుంది.  

Honda BR-V

10 వ తరం హోండా సివిక్ కొత్త 1.0 లీటర్ టర్బో విటెక్ ఇంజిన్ ని పొందబోతుంది

కొలతల పరంగా, బిఆర్-వి వాహనం మొబిలియో కంటే 57mm మరియు క్రెటా కంటే 185mm పొడవైనది. ఇది 1735mm వెడల్పు ని కలిగి ఉంది. దీని వెడల్పు మొబిలియో కంటే 52mm ఎక్కువ కానీ క్రెటా కంటే 45mm తక్కువ. అయినపట్టికీ బిఆర్-వి వాహనం మొబిలియో కంటే 47mm మరియు క్రెటా కంటే 20mm ఎత్తు కలిగి ఉండి ఆధిక్యతలో ఉంది. బిఆర్-వి వాహనం చూడడానికి చాలా గొప్పగా కనిపిస్తుంది మరియు రూ.8 నుండి 12 లక్షల పరిధిలో 7-సీటర్ ఎంపికలలో అద్భుతమైన వాహనం.

Honda BR-V Interior

లోపల ఒక అడుగు వేస్తే, అంతర్భాగాలు చూస్తే జాజ్ మరియు సిటీ యొక్క మిశ్రమాలు కనిపిస్తాయి. బిఆర్-వి, మొబిలియో లో ఉన్నటువంటి అదే క్యాబిన్ డిజైన్ ని పొందకుండా మార్పు చేయబడింది. కారు యొక్క చిత్రాలు చూసినట్లయితే ఇది ప్రీ-ప్రొడక్షన్ ప్రోటోటైప్, కానీ ఇప్పటికి మొత్తం ఫినిషింగ్ చాలా బాగుంది. దీనిలో త్రీ పాడ్ స్పీడోమీటర్ కన్సోల్ చాలా బాగుంది మరియు ఇంధన సామర్ధ్యం డిస్ప్లే, బయట ఉష్ణోగ్రత మరియు ఓడోమీటార్ మొదలైనవి కలిగి ఉంటుంది.    

Honda BR-V Interior   

దీనిలో సీట్లు ఇతర హోండా సమర్పణల వలే చూడడానికి స్లిం గా ఉంటాయి. కానీ దూరపు ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటాయి. ప్రయోగాత్మకంగా, బిఆర్-వి చబ్బీ హోల్స్ మరియు మరింత దృష్టి సామర్ధ్యం పెంచేందుకు పెద్ద విండోస్ తో ఉన్నతంగా ఉంది. దీనిలో అగ్ర శ్రేణి వేరియంట్లు వాతావరణ నియంత్రణ వ్యవస్థ తో పాటు ఒక టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థతో వస్తాయి. దీని బటన్లు చాలా బాగా పనిచేస్తాయి మరియు కొద్దిగా సిల్వర్ ఫ్రేం ని కలిగి ఉంటాయి. ఈ ప్రోటోటైప్  స్టీరింగ్ వీల్ పైన బ్లూటూత్ టెలిఫోనీ నియంత్రణలను కలిగి లేదు. కానీ ప్రొడక్షన్ వెర్షన్ వేరే సెటప్ ని కలిగి ఉంటుందని అంచనా.        

Honda BR-V      

దీని రెండవ వరుస సీట్లు గొప్ప లెగ్‌రూం ని కలిగి ఉంటాయి. కానీ హెడ్ రూం మరియు  షోల్డర్ స్పేస్ మాత్రం పెద్దలకు అంత సౌకర్యవంతంగా ఉండదు. దీనిలో సీట్లు 60:40 స్ప్లిట్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి, దీని వలన వెనుక ఎక్కువ సామాను పెట్టుకునేందుకు సులభంగా ఉంటుంది. చివరి వరుసలో స్థలం మరీ అంత చెడ్డగా ఉండదు. కొంచెం ఎత్తు తక్కువ ఉన్నవారికి మాత్రం సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికులు దీనిలో కప్ హోల్డర్ సదుపాయాన్ని కలిగి ఉంటారు. మూడు వరుసలు స్థలం కలిగి ఉండి కూడా బిఆర్-వి సూట్ కేసులు పెట్టుకొనేందుకు తగిన స్థలాన్ని కలిగి ఉంటుంది.

Honda BR-V

డ్రైవింగ్ పార్ట్ కి వస్తే, జపాన్ లో హోండా యొక్క ఆర్ & డి ఫెసిలిటీ వద్ద బిఆర్-వి పరీక్ష చేయబడింది. దీనిలో పెట్రోల్ లో మాత్రమే సివిటి మోడల్ అందించడం జరిగింది. బిఆర్-వి భారతదేశం లో విడుదల చేసినప్పుడు, ఒక 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో కూడా వస్తుంది. ఇదే ఇంజిన్ అమేజ్, మొబిలియో మరియు సిటీ లో కూడా ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది మరియు అదే శక్తి మరియు టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏఆర్ఏఐ పరీక్షల ప్రకారం సుమారు 25Kmpl మైలేజ్  అందిస్తుందని భావిస్తున్నారు.  హోండా తక్కువ ఎన్విహెచ్ స్థాయిలు ఉంచడం కొరకు చాలా కృషి చేస్తుంది.     

Honda BR-V Side  

దీనిలో పెట్రోల్ ఇంజన్ 120ps శక్తిని అందిస్తుంది మరియు  ఒక కొత్త 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో, అలానే సివిటి ట్రాన్స్మిషన్ తో కూడా జతచేయబడి ఉంటుంది. దీనిలో స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ 7-సీటర్ కి తగినట్టుగా ఉంటుంది.దీనిలో సస్పెన్షన్ వ్యవస్థ భారతీయ రోడ్డు ప్రమాణాలకు అనుగుణంగా బలోపేతనం చేయడం జరిగింది. ఈ వాహనం 16 అంగుళాల వీల్స్ ని కలిగి ఉంటుంది. మొబిలియో వాహనం 15 అంగుళాల వీల్స్ ని కలిగి ఉంటుంది. బిఆర్-వి వాహనం గ్రామీణ ప్రాంతాలలో సులభంగా నడపబడగలదు. మొబిలియో తో పోలిస్తే ఇది చాలా అద్భుతమైన వాహనం. బిఆర్-వి పెట్రోల్ 12Kmpl మైలేజ్ ని అందిస్తుందని భావిస్తున్నారు. కానీ ఈ ఇంజన్ అగ్ర శ్రేణి లో మాత్రమే ఉంది మరియు బీఅర్-వి వాహనం సులభంగా ఇతర ఏడు సీట్ల వాహనాలను ఢీకొనగలదు.   

Honda BR-V Boot View

బిఆర్-వి వాహనం పెట్రోల్ కొరకు రూ.7.3 లక్షల ప్రారంభ ధరతో మరియు డీజిల్ కొరకు రూ. 8.7 లక్షల ప్రారంభ ధరతో ఎక్స్-షోరూమ్ ఢిల్లీ వద్ద వచ్చే ఏడాది అమ్మకాలకు వెళ్ళనున్నది. హోండా సంస్థ బిఆర్-వి వాహనాన్ని  ఇ, ఎస్ మరియు వి అను మూడు వేరియంట్స్ లో అందించవచ్చని ఊహిస్తున్నాము. దీనిలో టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ మరియు జిపిఎస్ నావిగేషన్ అను మూడు లక్షణాలు ఆప్ష్నల్ గా అందించబడవచ్చు. బిఆర్-వి కి మారుతి ఎస్-క్రాస్, రెనాల్ట్ డస్టర్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి ఇతర క్రాస్ ఓవర్ మరియు కాంపాక్ట్ ఎస్యువి తో పోలిస్తే తప్ప నిజంగా ప్రత్యక్ష పోటీ లేదు.   

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హోండా బిఆర్-వి

Read Full News
Used Cars Big Savings Banner

found ఏ కారు యు want నుండి buy?

Save upto 40% on Used Cars
  • quality వాడిన కార్లు
  • affordable prices
  • trusted sellers

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience