• English
  • Login / Register

కొత్త అలాయ్ؚ వీల్స్‌తో, టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఫస్ట్ లుక్

టాటా సఫారి కోసం shreyash ద్వారా అక్టోబర్ 09, 2023 05:34 pm ప్రచురించబడింది

  • 228 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇప్పటి వరకు విడుదల అయిన అన్ని టీజర్‌లను చూస్తే, 2023 టాటా సఫారీ పూర్తి లుక్‌ గురుంచి అవగాహనకు రావొచ్చు

2023 Tata Safari

  • 2023 టాటా సఫారీ బుకింగ్ؚలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి.

  • సరికొత్త డిజైన్ గల అలాయ్ వీల్స్ మరియు సవరించిన హెడ్ؚలైట్ హౌసింగ్ؚలతో వస్తుంది. 

  • ఇంటీరియర్ నవీకరణలలో కొత్త బ్యాక్ؚలిట్ స్టీరింగ్ వీల్, భారీ టచ్ؚస్క్రీన్ మరియు డ్రైవర్ డిస్ప్లే ఉండవచ్చు.  

  • ప్రస్తుతం ఉన్న 2-లీటర్‌ల డీజిల్ ఇంజన్ కొనసాగించవచ్చు, అయితే కొత్త 1.5-లీటర్ (T-Gdi) టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా పొందవచ్చు. 

  • ధర రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావొచ్చు.

టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ విడుదల తేదీ సమీపిస్తుండగా, కారు తయారీదారు క్రమం తప్పకుండా, దాదాపు ప్రతి రోజూ కొత్త టీజర్‌ను విడుదల చేస్తూ, 3-వరుసల ఈ SUV డిజైన్ వివరాలను వెల్లడిస్తున్నారు, సరికొత్త టీజర్ؚలో, 2023 సఫారీ సైడ్ ప్రొఫైల్ మరియు కొత్త అలాయ్ వీల్స్ؚను చూడవచ్చు. ఈ రోజు నుండి, టాటా నవీకరించిన SUV ఆర్డర్‌లను కూడా అంగీకరిస్తుంది. 

టీజర్ؚలో కొత్తగా కనిపించింది ఏమిటి? 

ఈ టీజర్‌లో ముఖ్యమైన అంశం 2023 సఫారీలో ఉన్న కొత్తగా డిజైన్ చేసిన అలాయ్ వీల్స్, ప్రస్తుత టాటా సఫారీలో ఉన్న 18-అంగుళాల అలాయ్ వీల్స్ؚతో పోలిస్తే కొంత పెద్దవిగా అంటే 19 అంగుళాలు ఉండవచ్చు. అంతేకాకుండా, ఈ టిజర్‌లో SUV ప్రొఫైల్‌ను కూడా చూడవచ్చు, ఇది చాలా వరకు ప్రస్తుత వర్షన్ؚను పోలి ఉంది.

Here's Your First Glimpse At The Tata Safari Facelift's Side Profile, Sporting New Alloys

ఈ వీడియోలో చూసినట్లు, టాటా సఫారి ఫేస్ؚలిఫ్ట్‌లో ప్రస్తుతం నిలువుగా అమర్చిన హెడ్ؚలైట్ హౌసింగ్ కనిపిస్తుంది, దీన్ని 2023 టాటా నెక్సాన్ మరియు టాటా నెక్సాన్ EVలలో కూడా చూశాము. సరికొత్త డైనమిక్ లైటింగ్ؚతో, కొత్త కనెక్టెడ్ LED DRLలు మరియు LED టెయిల్‌ల్యాంప్ؚలను ఇప్పటికే చూశాము. 

ఇది కూడా చూడండి: 2023 టాటా హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ ఇంటీరియర్ టిజర్ విడుదల, నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ నుండి పొందిన కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే

ఇంటీరియర్ నవీకరణలు

Tata Safari cabin

 2023 టాటా సఫారీ ఇంటీరియర్ వివరాలు ప్రస్తుతానికి తెలియదు, 2023 టాటా హ్యారియర్ టిజర్‌లో చూపించిన ఫీచర్‌లను ఇందులో కొనగిస్తారు అని అంచనా. ఇందులో మెరిసే టాటా లోగోతో కొత్త స్టీరింగ్ వీల్, భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యాష్ؚబోర్డ్ పై ఆంబియంట్ లైటింగ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ మరియు రేర్ సీట్లు ఉన్నాయి.

భద్రత విషయానికి వస్తే, నవీకరించిన టాటా సఫారీలో ఆరు ఎయిర్‌బ్యాగ్ؚలు ప్రామాణికంగా ఉండవచ్చు, మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా మరియు ISOFIX యాంకర్ పాయింట్లు వంటి ఫీచర్‌లు కూడా కొనసాగవచ్చు. సఫారీ ప్రస్తుత వర్షన్ ఇప్పటికే అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ؚతో (ADAS) వస్తుంది, అయితే ఈ నవీకరణలో డ్రైవర్ అసిస్టెన్స్ కిట్ؚలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంటుంది.  

ఇది కూడా చూడండి: సెప్టెంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 15 కార్‌ల వివరాలు

బోనెట్ؚలో ఏం ఉండవచ్చు?

Tata Safari facelift teased

టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ 170PS పవర్ మరియు 350Nm టార్క్‌ను అందించే ప్రస్తుత 2-లీటర్ డీజిల్ ఇంజన్ؚను నిలుపుకుంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలతో జోడించబడుతుంది. 170PS పవర్ మరియు 280Nm టార్క్‌ను విడుదల చేసే కొత్త 1.5-లీటర్ T-Gdi (టర్బో) పెట్రోల్ ఇంజన్ؚను కూడా టాటా తీసుకురావచ్చు. ఈ ఇంజన్ మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికలు రెండిటితో వస్తుంది. 

అంచనా ధర & పోటీదారులు

2023 టాటా సఫారీ విక్రయాలు రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో నవంబర్ 2023 నుండి ప్రారంభం అవుతాయని అంచనా. విడుదల అయిన తరువాత, ఇది మహీంద్రా XUV700, MG హెక్టార్ ప్లస్ మరియు హ్యుందాయ్ ఆల్కజార్ؚతో పోటీ పడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata సఫారి

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience