MG కామెట్ EV లోపలి భాగం ఏ విధంగా ఉంటుందో ఈ చిత్రాలలో చూద్దాం
ఎంజి కామెట్ ఈవి కోసం tarun ద్వారా ఏప్రిల్ 24, 2023 11:30 am ప్రచురించబడింది
- 47 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కామెట్ EV రెండు-డోర్‌ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్, ఇందులో నలుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు
ధరను వెల్లడించడానికి ముందుగా MG కామెట్ EV లుక్ మరియు ఫీచర్‌లను పూర్తిగా వెల్లడించింది. ఈ రెండు-డోర్‌ల అల్ట్రా-కాంపాక్ట్ EV, లీక్ అయిన రిపోర్ట్ؚల ప్రకారం, 230 కిలోమీటర్‌ల మైలేజ్‌ను అందించే 17.3kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది. ఇటీవల కామెట్ EV ఎక్స్ؚటీరియర్ చిత్రాలను మరొక కధనంలో అందించాము, ఇప్పుడు ఈ చిత్రాలలో దీని ఇంటీరియర్ؚను పరిశీలిద్దాం.
కామెట్ EV లేత రంగు డ్యూయల్-టోన్ ఇంటీరియర్, A-పిల్లర్ మరియు డ్యాష్ؚబోర్డ్ వంటి అనేక చదునైన ఉపరితలాలపై వైట్ మరియు గ్రే థీమ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.
కామెట్ EV ఫీచర్‌లలో లెదర్ؚతో చుట్టబడిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ؚకు అమర్చిన ఆడియో, ఫోన్ మరియు వాయిస్ అసిస్ట్ కంట్రోల్ؚలను కలిగి ఉంది. స్టీరింగ్ వీల్‌పై ఉన్న రెండు బటన్ؚలు ఉపయోగంలో లేనట్లు కనిపిస్తున్నాయి, ఇవి అంతర్జాతీయ-స్పెసిఫికేషన్ మోడల్ నుండి కొన్ని ఫీచర్‌లను మినహాయించారని వెల్లడిస్తున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో MG డ్యూయల్ 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను అందిస్తుంది. ఎడమ వైపున కారు స్టేటస్, డ్రైవ్ మోడ్ؚలు, బ్యాటరీ రీజనరేషన్ మోడ్ؚలు మరియు ఛార్జింగ్‌ను చూడవచ్చు. సెంట్రల్ యానిమేషన్ కామెట్ వెనుక వైపు సుదూర వీక్షణను చూపిస్తుంది మరియు తెరచి ఉన్న డోర్ؚలు మరియు హెడ్‌ల్యాంప్ؚలు ఆన్ చేసి ఉన్నాయా లేదా అనే సమాచారాన్ని అందిస్తుంది. కుడి వైపు బ్యాటరీ ఛార్జ్, పరిధి, ఓడోమీటర్, స్పీడోమీటర్ మరియు డ్రైవ్ ఎంగేజెడ్ వంటి స్థిర సమాచారాన్ని అందిస్తుంది.
డ్యూయల్ డిస్ప్లే సెట్అప్ మరొక భాగం ఈ 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఈ పొడువైన స్క్రీన్ యూనిట్ వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే, కనెక్టెడ్ కార్ సాంకేతికతకు మద్దతు ఇస్తుంది. AC వెంట్ؚల క్రింద రోటరీ డయల్స్ మరియు డ్రైవ్-మోడ్ స్విచ్ؚలతో క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ؚను చూడవచ్చు.
ఫ్యాబ్రిక్ సీట్ؚలు తెల్లని చారలతో గ్రే రంగు ఫినిష్ؚను కలిగి ఉన్నాయి. గేర్ నాబ్ మరియు మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ కోసం రోటరీ డయల్ؚను కూడా చూడవచ్చు.
విండో కంట్రోల్ؚలు డ్రైవ్ సెలెక్ట్ రోటరీ డయల్ؚకు వెనుక ఉంటాయి. డయల్ؚకు – ఛార్జ్, రివర్స్, న్యూట్రల్ మరియు డ్రైవ్ అనే ప్రతి మోడ్ కోసం స్వతంత్ర LED ఇల్యూమినేషన్ ఉంటుంది.
ప్రతి ఒక్కరూ ఆతృతగా చూడాలనుకునేది MG కామెట్ EV వెనుక సీటు. బెంచ్ లేఅవుట్ؚతో ఇది రెండు సీట్ؚలను పొందింది. వెనుక ప్రయాణీకులు ఇద్దరి కోసం స్థిరమైన హెడ్‌రెస్ట్ؚలు మరియు మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు ఉంటాయి. సీట్ దిగువ భాగం వైపు రెండు నల్లని చుక్కలు, ISOFIX యాంకరేజ్ؚలు ఉన్నట్లు సూచిస్తున్నాయి. వెనుక ప్రయాణీకుల కోసం, MG ఏరోప్లేన్ స్టైల్ విండో సెక్షన్ؚలను చేర్చింది.
కామెట్ EV టాప్ స్పెక్ వేరియెంట్ ధర సుమారు రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు, దీని వలన ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3లకు సరైన పోటీదారు అవుతుంది.