Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

బాలెనో ని ప్రవేశపెట్టడం వలన స్విఫ్ట్ మరియు డిజైర్ విలువను మారుతి వారు తగ్గించుకున్నారా?

మారుతి బాలెనో 2015-2022 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 28, 2015 11:52 am ప్రచురించబడింది

జైపూర్:

గత నెల, మారుతి స్విఫ్ట్ మొత్తం 18.278 యూనిట్లు అమ్మకాలు చేసింది, దీనివలన ఎంతగా ఈ కారుని ఇష్టపడుతున్నారో అర్ధమవుతుంది. భారత ఆటోమొబైల్ పరిశ్రమలో మార్పు అవసరం అనుకున్నపుడు దేశం యొక్క ఈ మొదటి ప్రీమియం హ్యాచ్బ్యాక్ పరిచయం చేయబడినది. ఆ వాహనం దాని పాత్రను సమర్ధవంతంగా పోషించి ఈనాటికీ అమ్మకాల సంఖ్యలో ప్రతిబింబిస్తుంది. ఈ వాహనం పరిశ్రమకు కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసే మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి హ్యుందాయ్ ఎలీట్ ఐ 20 ని అనుసరించింది. నేడు మనకి మూడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్లు హ్యుందాయ్ ఎలీట్ ఐ 20, హోండా జాజ్ మరియు రూ. 4.99 లక్షల ఒక సంభ్రమాశ్చర్య ధర ట్యాగ్ వద్ద కొత్తగా ప్రారంభించబడిన బాలెనో ఉన్నాయి.

కానీ ఇప్పుడు మారుతి దాని పోటీదారులైన ఎలీట్ ఐ20 మరియు హోండా జాజ్ లను తలదన్నే విధంగా బాలెనో యొక్క ధరను స్విఫ్ట్ హ్యాచ్ మరియు డిజైర్ కి దరిదాపులలో ఉంచింది. ఇది ఒక మంచి తరలింపా లేదా చెడ్డదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఆ ధర వ్యత్యాసం స్విఫ్ట్ కొనుగోలుదారులను బాలెనో వైపు తీసురాగలదా లేదా అనేది చూద్దాము.

మేము స్విఫ్ట్ / డిజైర్ విఎక్స్ఐ (మధ్య శ్రేణి వేరియంట్) ధర రూ. 5.4 లక్షలు/5.9 లక్షలు తో, బాలెనో డెల్టా(బేస్ వేరియంట్ కి పైనది) ధర రూ. 5.7 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ని పోల్చి చూస్తున్నాము. 30K అధనపు సొమ్ముకి బాలెనో ఎన్ని అధనపు లక్షణాలు కలిగి ఉంటుందో చూద్దాము.

భద్రత:

30K అధనపు సొమ్ముతో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు ఏబిఎస్, ఇబిడి వంటి భద్రతా అంశాలతో సురక్షితమైన బాలెనో కారు ని పొందవచ్చు. అయితే స్విఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ లో ఇటువంటివి ఏవీ అందించడం లేదు. బాలెనో చాసిస్ కూడా దృఢంగా ఉండి మరింత సమర్థవంతంగా క్రాష్ తట్టుకునే విధంగా ఉంటుంది.

కొత్త ప్లాట్‌ఫార్మ్:

బాలెనో వాహనం సుజికి యొక్క తేలికైన ప్లాట్‌ఫార్మ్ మీద ఆధారపడి ఉంది, ఇది చిన్న స్విఫ్ట్ కంటే 100కిలోలు తేలికైనదిగా ఉంది. ఈ వాహనం తేలికగా ఉన్న కారణం చేత మైలేజ్ లో మెరుగుపడింది మరియు లీటరుకు మరికొన్ని కిలోమీటర్లు తీసుకోగలదు.

అంతర్భాగాలు:

అత్యుత్తమ బాహ్య కొలతలతో, బాలెనో లో చాలా విశాలమైన అంతర్గత స్థలం అందుబాటులో ఉంది. ఈ బాలెనో వాహనం ఇరుకైన సీట్లు కలిగిన స్విఫ్ట్ తో పోలిస్తే చాలా ఉత్తమంగా ఉంది. ఇంకా దీనిలో కొత్త అంతర్గత సెటప్ తో చాలా ప్రీమియం లుక్ ని ఇస్తుంది. డెల్టా వేరియంట్ కూడా బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వెనుక ఛార్జింగ్ పోర్ట్ తో మ్యూజిక్ సిస్టమ్ వంటి వాటిని కలిగి ఉంది. ఇవన్నీ కూడా స్విఫ్ట్ మరియు డిజైర్ రెండిటిలోని లోపించాయి.

మరిన్ని బాలెనో డెల్టా లక్షణాలు

  • 339 లీటర్ల బూట్స్ స్పేస్ సామర్థ్యం
  • ప్రీ టెన్షనర్ మరియు లోడ్ లిమిటర్స్ తో ముందరి సీటు బెల్ట్స్
  • వెనుక పార్కింగ్ సెన్సార్స్
  • వెనుక వాషర్ మరియు వైపర్ తో వెనుక విండో డీఫాగర్

ఈ లక్షణాలు అన్నీ స్విఫ్ట్ మరియు డిజైర్ రెండిటిలోని లోపించాయి.

బాలెనో ముఖ్యంగా ధర పరంగా కొనుగోలు చేయడానికి ఒక గొప్ప ప్రతిపాదనతో ఉంది. మీరు స్విఫ్ట్ లేదా డిజైర్ కొనుగోలు చేయాలనుకుంటే, మీరు బాలెనో కూడా పరిగణలోనికి తీసుకోవాలి అనుకోవచ్చు.

ద్వారా ప్రచురించబడినది

అభిజీత్

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర