2016 వ సంవత్సరంలో యూకె వద్ద ఈకోస్పోర్ట్ ను ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్న ఫోర్

ప్రచురించబడుట పైన Nov 23, 2015 01:49 PM ద్వారా Sumit for ఫోర్డ్ ఎకోస్పోర్ట్

  • 2 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Ford EcoSport

కొన్ని నివేదికల ప్రకారం, ఫోర్డ్ సంస్థ 2016 వ సంవత్సరంలో యూకె వద్ద 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజిన్ తో ఈకోస్పోర్ట్ ను ప్రారంభించబోతుంది. ఈ కార్లను, చెన్నై ప్లాంట్ వద్ద నిర్మిస్తారు మరియు ఎగుమతి అవుతాయి. అంతేకాకుండా ఈ వాహనాలు ఇంగ్లీష్ దేశానికి ఎగుమతి అయ్యేటప్పుడు నమ్రత మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఈ బ్రిటిష్ ఈకోస్పొర్ట్ లో, మంచి నియంత్రణ మరియు ఉన్నతమైన అంతర్గత నాణ్యతను ఇవ్వడం కోసం సవరించిన స్టీరింగ్ వ్యవస్థ ను అందించడం జరిగింది. అంతేకాకుండా కంపెనీ, మరింత ధ్వనిను ఈ కారుకు జోడించవచ్చు అని పేర్కొంది. మరోవైపు, ఈ వాహనానికి సవరించబడిన సస్పెన్షన్ వ్యవస్థ మరియు కొత్త డ్యాంపర్లు అందించబడతాయి. స్ప్రింగ్ రేటు మార్చబడింది మరియు సస్పెన్షన్ 10 మిల్లీ మీటర్లు తగ్గించబడింది. 

Ford EcoSport

కొనుగోలుదారులు, ఈ అమెరికన్ కంపెనీ వాహనంలో, ఒక వెనుక వీక్షణ కెమెరా తో పాటు నవీకరించబడిన సోనీ స్టీరియో కు మద్దతిచ్చే బ్లూటూత్ ను అందించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే ఈ ఇంగ్లిష్ వెర్షన్ లో, ఒక స్పేర్ వీల్ అందించబడదు కానీ, ప్రతీ ఒక్కరి వినియోగదారుడి దృష్టిని ఆకర్షించడం కోసం ఒక నలుపు ప్యాక్ ను అందించడం జరిగింది. ఈ నలుపు ప్యాక్ లో, అధిక వివరణ కలిగిన నలుపు అల్లాయ్ లు, డోర్ మిర్రర్లు మరియు ఆటోమొబైల్స్ కు రూఫ్ మిర్రర్ లు అందించబడతాయి. ఈ వాహనానికి స్పొర్ట్స్ లుక్ ను ఇవ్వడం కోసం, రూఫ్ రైల్స్ ను తీసివేయడం జరిగింది. యాంత్రిక పరంగా చెప్పాలంటే, భారతీయ వాహనంలో మరియు బ్రిటిష్ వెర్షన్ రెండిటిలో కూడా ఒకే 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ అందించబడుతుంది. కానీ, బ్రిటిష్ వెర్షన్ 15 బిహెచ్పి పవర్ ను అధికంగా విడుదల చేస్తుంది. అంటే ఈ వాహనం అత్యధికంగా, 138 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు త్వరణం విషయానికి వస్తే, ఈ బ్రిటిష్ వెర్షన్, 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి, భారతీయ వాహనం కంటే ఒక సెకన్ తక్కువ సమయం పడుతుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి అధికంగా 17.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

యూకె వెర్షన్ యొక్క ధర సుమారు £ 17,500 (భారతీయ రూపాయలలో 17.68 లక్షలు) అని ఊహించడమైనది మరియు ఈ వాహనం జూన్ నుండి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి

మరింత చదవండి 

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?