ఫోర్డ్ ఇండియా వారి జెన్యూన్ భాగాల రీటెయిల్ పంపిణీ ని గోవా మరియూ మహరాష్ట్రా కి విస్తరించారు
అక్టోబర్ 19, 2015 04:39 pm manish ద్వారా ప్రచురించబడింది
- 18 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
కస్టమర్ సర్వీసుని మరింతగ మెరుగు పరిచేందుకు జెన్యూన్ సర్వీసు భాగాలను గోవా మరియూ మహరాష్ట్రా లో అందుబాటులోకి తెచ్హారు. ఆటోజీ ఫోర్డ్ పార్ట్స్ వారిని ప్రత్యేక పంపిణీదారిగా నియమించారు. ఫోర్డ్ కస్టమర్ సర్వీసు ఆపరేషన్స్ కి వైస్ ప్రెసిడెంట్ అయిన మిస్టర్. ప్రభు గారు ఈ సదుపాయాన్ని 17/8, డీ1 బ్లాక్, ఎంఐడీసీ చించ్వద్,పూణే లో ఆరంభించారు. ఈ సదుపాయం 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
"మేము కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ మరియూ ఎక్కువ కస్టమర్లు చేరుతున్న కొద్దీ వారికి సర్వీసుని కూడా మెరుగు పరచాల్సి ఉంటుంది. నెట్వర్క్ ని విస్తరిస్తూ మా సర్వీసుని మెరుగు పరుచుకుంటున్నాము," అని అన్నారు.
తరువాత రాజస్థాన్, తూర్పు భారతదేశం మరియూ గుజరాత్ లకు కూడా విస్తరిస్తాము. స్థానిక సప్లయర్స్ తో పనిచేస్తూ ధరలు మరియూ నాణ్యత పెంచాలని అనుకుంటున్నారు.
ఫోర్డ్ ఆస్పైర్ కి 850 సబ్-అసెంబ్లీ భాగాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం యూనిట్ కాకుండా సబ్-అస్సెంబ్లీ భాగాలు మార్చులోగలిగే అవకాశం అందిస్తున్నారు. దీని వలన కస్టమర్ సర్వీసు సులభతరం అవుతుంది.
ఫోర్డ్ వారు వారి కారు కస్తమైజ్ చేసుకునే వీలు కల్పించి ఆటోమొబైల్ మార్కెట్ లో ఇటువంటి అవకాశం అందించిన మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. ఈ అవకాశం ప్రస్తుతం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కి అందిస్తు కేవలం ఉన్నత స్రేణి వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. "హ్యాపీ పాకెట్ సర్వీసు" పేరిట రూ. 2,199 కి నాణ్యత కలిగిన సర్వీసుని అందిస్తున్నారు.