ఫోర్డ్ సంస్థ చెన్నై ప్లాంట్ వద్ద ఒక మిలియన్ మైల్‌స్టోన్ ని చేరుకుంది

నవంబర్ 10, 2015 03:53 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఫోర్డ్ ఇండియా యొక్క చెన్నై ప్లాంట్ ఆ సంస్థ యొక్క మిలియన్ కారుని మరియు మిలియన్ ఇంజిన్ ని ఉత్పత్తి చేసింది. తయారీసంస్థ 1999 లో ప్రారంభించబడినప్పట్టి నుండి 16 సంవత్సరాల్లో ఈ మైలురాయిని సాధించింది. ఆ అదృష్టం ఈకోస్పోర్ట్ కి దక్కింది.  

350 ఎకరాలు వ్యాప్తి చెంది ప్రస్తుతం ఈ ప్లాంట్ ఈకోస్పోర్ట్, ఫియస్టా మరియు ఎండీవర్ వంటి మూడు కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ అసెంబ్లీ యూనిట్ 2008 లో ప్రారంభించబడింది. ఈ అసెంబ్లీ లైన్ ఏకకాలంలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు ఉత్పత్తి చేస్తుంది. సంవత్సరానికి 2 లక్షల వాహనాలు మరియు 3.4 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి చేస్తూ ఈ సంస్థ అమెరికన్ పవర్ హౌస్ గా నిలిచింది. 

ఫోర్డ్ చెన్నై వాహనం అసెంబ్లీ & ఇంజిన్ ప్లాంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మిస్టర్ బాల సుందరం రాదాకృష్ణన్ మాట్లాడుతూ " మేము భారతదేశంలో చన్నై నుండి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఫోర్డ్ కోసం ఒక ప్రపంచ తయారీ కేంద్రంగా ఉండడం మాత్రమే కాకుండా, ఈ కర్మాగారం గణనీయంగా  కార్బన్ ఎమిజన్స్ తగ్గించి నాణ్యత నిర్ధారించే ప్రక్రియలో ఉంది. ఈ మిలియన్ వాహనం మరియు మిలియన్ ఇంజిన్ ఉత్పత్తి సంస్థకి వాహానాల ఉత్పత్తి పైన ఉన్న అభిరుచిని మరియు చెన్నైలో 6,000 లకు పైగా పురుషులు మరియు మహిళలు యొక్క కృషిని తెలుపుతుంది.            

చెన్నై యూనిట్ కాకుండా, ఫోర్డ్ సంస్థ సనంద్ గుజరాత్ వద్ద దాని తాజా తయారీ ప్లాంట్ ని ప్రారంభించింది. అది ప్రధానంగా ఇంజిన్లపైన దృష్టి పెడుతుంది. ఫిగో మరియు ఆస్పైర్ కూడా అక్కడే ఉత్పత్తి చేయబడ్డాయి. 

ఈ రెండు ప్లాంట్స్ వలన ఫోర్డ్ సంస్థ  యూరోప్, మిడిల్ ఈస్ట్, ఏసియన్ దేశాలు మరియు ఆఫ్రికా తో కలిపి మొత్తం 40 దేశాల కంటే ఎక్కువ దేశాలకు వాహనాలు మరియు ఇంజిన్లు పెద్ద సంఖ్యలో ఎగుమతి చేయబడుతున్నాయి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience