200,000 అమ్మకాల మైలురాయిని సాధించిన ఫోర్డ్ ఇండియా ఎకోస్పోర్ట్

ఎకోస్పోర్ట్ 2015-2021 కోసం manish ద్వారా ఆగష్టు 06, 2015 11:54 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: పరిచయం అయిన రెండు సంవత్సరాలలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్  దేశీయ మరియు ఎగుమతులలో 200,000 అమ్మకాల  మైలురాయి సాధించింది. ప్రస్తుతం, భారత రోడ్లపై 112,000 లక్షల కంటే ఎక్కువ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లు ఉన్నాయి. దాని పరిచయం ఒక సంవత్సరం లోపల భారతదేశం యొక్క అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్యువి గా 30 అవార్డులను కంటే ఎక్కువ సంపాదించుకుంది. తదుపరి ఇది ఎస్యువి విభాగంలో జెడి పవర్ యొక్క ప్రారంభ క్వాలిటీ స్టడీ (ఐ క్యు ఎస్ ) 2014 లో అగ్రస్థానంలో  నిలిచింది. 

ఎకోస్పోర్ట్ ప్రయాణం భారతీయ వినియోగదారుల నుండి  చాలా సానుకూల స్పందనను అందుకుంది. కారు పరిచయం అయిన 30 రోజుల్లో  60,000 బుకింగ్ రికార్డులను సాధించింది. చెన్నై నిర్మిత ఎస్యువి  దాని బలమైన డ్రైవ్ డైనమిక్స్, శ్రేష్టమైన ప్రదర్శన, స్మార్ట్ టెక్నాలజీ మరియు విలువ ప్రతిపాదనతో ప్రంచవ్యాప్తంగా వినియోగదారులను సంపాదించుకుంటుంది. 

ఫోర్డ్ ఇండియా  సేల్స్ & సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ డైరెక్టర్ అయిన అనురాగ్ మెహ్రోత్రా  ఈ విధంగా మట్లాడారు. " ఎకోస్పోర్ట్ ప్రారంభమయిన దగ్గర నుండి దాని సమగ్ర విలువ ప్రతిపాదనతో  ప్రశంసలు పొందింది. ఈ సందర్భంగా మేము మా వినియోగదారులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. "ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో సంపాదించుకున్న పేరు కారణంగా మార్కెట్ ఆధిపత్యాన్ని పెంపొందించుకుంది. ఇది  200,000 అమ్మకాలను సాధించడం ద్వారా బెంచ్మార్క్ ని సృష్టించింది".  అని పేర్కొన్నారు.  

ఎకోస్పోర్ట్ ఇంటీరియర్స్, శక్తి మరియు ఆకట్టుకునే ఇంధన సామర్థ్యం దాని పూర్తి విలువ ప్యాకేజీ కోసం, గొప్ప శైలి అందించడం వంటి లక్షణాలతో వినియోగదారుల హృదయాలను దోచుకుంటుంది. 

ఎకో స్పోర్ట్ టెక్నాలజీ ప్రతిపాదనలతో ఫోర్డ్ యాప్ లింక్ తో సమకాలీకరించడానికి ఫిబ్రవరి లో ఈ యాప్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సహజమైన -కారు టెక్నాలజీని వినియోగదారులకు వారికి ఇష్టమైన స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ల తో సాధారణ వాయిస్ ఆదేశాల ద్వారా నియంత్రించుకోవచ్చు. అది ఒక రెస్టారెంట్ గురించిన విషయమైనా లేదా క్రికెట్ స్కోర్ ల వివరాలైనా సరే తమ యొక్క స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ల ద్వారా ఫోర్డ్ యాప్ లింక్ సహాయంతో తెలుసుకోవచ్చు.


సౌత్ ఆఫ్రికా, అనేక యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా తైవాన్ వంటి కొన్ని దేశాలకు అంతర్జాతీయ ఖ్యాతిని పెంపొందించుకోవడానికి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ తమ ఉత్పత్తులను  ఎగుమతి చేస్తుంది మరియు ఇది ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగాలని ఫోర్డ్ ఇండియా కి మనం కూడా మద్దతును అందజేద్దాము.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎకోస్పోర్ట్ 2015-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience