ఫోర్డ్ ఎండీవర్ టాప్ ఎండ్ మోడల్ రహస్యంగా పట్టుబడింది ( వివరణాత్మక చిత్రాలు లోపల )
ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం manish ద్వారా డిసెంబర్ 17, 2015 11:40 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్ :ఫోర్డ్ ఎండీవర్ యొక్క రాబోయే తరం మోడల్ రహస్యంగా పట్టుబడింది . ఈ కారు 3.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. దీనిలో మొట్టమొదటి సారిగా 5 సిలిండర్ యూనిట్ మరియు 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ సిస్టంతో వస్తుంది .ఫోర్డ్ వారు ఎండెవర్ గురించి గోప్యంగా ఉంచారు కానీ ఈ SUV తమిళనాడు రెజిస్ట్రేషన్ ప్లేటు తో కనపడింది. బహుశా వాహనం చివరి పరీక్షలను ఎదుర్కొంటొంది.
ఫోర్డ్ ఎండీవర్ 2 ఇంజిన్ ఆప్షన్లతో రాబోతోంది. ఈ రెండు ఇంజిన్లు కుడా వేరు వేరు టర్బో ఛార్జర్స్ ని కలిగి ఉండి,రెండు మరియు నాలుగు చక్రాల డ్రైవ్ కాన్ఫిగరెషన్స్ తో అందుబాటులో ఉంటాయి. పవర్ ప్లాంట్స్ కుడా రెండూ ఒక మాన్యువల్ లేదా ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తాయి . తదుపరి తరం ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఒక సర్వీసు స్టేషన్ లోపల రహస్యంగా పట్టుబడింది. ఈ ఎకోస్పోర్ట్ ప్రీమియం యొక్క SUV అన్ని చక్రాల యొక్క డ్రైవ్ కాన్ఫిగరెషన్స్ తో రాబోతోంది. ఇది ఒక ఉన్నత శ్రేణి నమూనా అని అంచనా వేస్తున్నారు.
కారు బాహ్య భాగాలని చూసినట్లయితే సన్ రూఫ్, రూఫ్ రేయిల్స్ ,అల్లాయ్ ఇచక్రాలు, ORVM మరియు ఇంటిగ్రేటెడ్ సూచికల వంటి ఫీచర్స్ ని కలిగి ఉంటుంది . లోపలి భాగాలని పరిశీలిస్తే ఒక టచ్ స్క్రీన్ టీవీ వ్యవస్థ కలిగి, బహుళ స్టీరింగ్ వీల్ కలిగి ఉంటుంది మరియు దీని డ్యూయల్ టోన్ డాష్బోర్డ్, బ్రషెడ్ అల్యూమినియం ఇన్సర్ట్స్ తో , లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ కలిగి ఉంటుంది . దేనితో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లివర్ ని కుడా గుర్తించ వచ్చు. ఇది రోటరీ కంట్రోల్ నాబ్ ని కలిగి ఉండి డ్రైవర్ki చాల సౌకర్యవంతంగా ఉంటుంది .
ఫోర్డ్ ఎండీవర్ యొక్క పవర్ ప్లాంట్స్ ఒక 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 158bhp శక్తిని , 385Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది . ( రహస్యంగా పట్టుబడిన కారు) 3.2లీటర్ 5 సిలిండర్ డీజిల్ ని కలిగి ఉండి, TDCI వేరియంట్ తో 197bhp శక్తిని , 470Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది . దీని 2.2 లీటర్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు AT అనే ఆప్షన్ తో వస్తుంది. ఈ ప్రీమియం SUV ప్రారంభం అయిన తర్వాత హ్యుందాయ్ శాంటా ఫే http://telugu.cardekho.com/new-car/hyundai/santa-fe, మిత్సుబిషి పజెరో స్పోర్ట్ మరియు స్సాంగ్యాంగ్ Rexton లతో పోటీ పడవచ్చును.
ఇది కుడా చదవండి: