మొదటిసారిగా అందించిన చిత్రాలలో భారీ పరిమాణాన్ని సూచిస్తున్న సరికొత్త రెనాల్ట్ డస్టర్
రెనాల ్ట్ డస్టర్ 2025 కోసం rohit ద్వారా ఏప్రిల్ 12, 2023 06:37 pm ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సరికొత్త డస్టర్, యూరోప్ؚలో విక్రయిస్తున్న రెండవ-జనరేషన్ SUV ముఖ్యమైన డిజైన్ సారూప్యతలను నిలుపుకుందని చిత్రాలు చూపుతున్నాయి
-
రెనాల్ట్ మరియు డాసియా బ్రాండ్ల పేరుతో ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్ధమవుతున్న మూడవ-జనరేషన్ డస్టర్ SUV.
-
రెండవ-జనరేషన్ వాహనాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టని రెనాల్ట్; మూడవ-జనరేషన్ SUV 2025కు రావచ్చని అంచనా.
-
ఈ SUV రహస్య చిత్రాలలో దృఢమైన లుక్స్ మరియు వెనుక డోర్ హ్యాండిల్స్ؚపై C-పిల్లర్ అమర్చి ఉన్నట్లు చూడవచ్చు.
-
LED లైటింగ్ؚ మరియు సెకండ్-జనరేషన్ డస్టర్ వంటి స్వరూప అలాయ్ వీల్ డిజైన్ؚను కలిగి ఉన్నట్లు ఈ చిత్రాలు చూపిస్తున్నాయి.
-
బహుళ పవర్ؚట్రెయిన్ ఎంపికలలో, స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ؚతో దీన్ని అందించవచ్చు.
-
ఇండియా-స్పెక్ మూడవ-జనరేషన్ డస్టర్ ప్రారంభ ధర రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్ؚలో, డస్టర్ SUVని రెనాల్ట్ తమ గ్లోబల్ సహ-బ్రాండ్ అయిన డాసియా ద్వారా విక్రయిస్తోంది. రెనాల్ట్ గ్రూప్ ఈ SUV మూడవ-జనరేషన్ అవతార్‌ను సిద్ధం చేస్తోంది, ఇది 2025 నాటికి భారతదేశంలో ప్రవేశపెట్టవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కొన్నిసార్లు దీన్ని రహస్య చిత్రాలు బయటకు వచ్చాయి, ప్రస్తుతం ఈ వాహన తాజా రహస్య చిత్రాలు ఆన్లైన్లో మళ్ళీ కనిపించాయి.
చూడటానికి ఇది బాగుందా?
“డస్టర్” పేరుగల వాహనాలు ఎల్లపుడూ బాక్సీ లుక్‌ను కలిగి ఉన్నాయి, ఈ మూడవ-జనరేషన్ కూడా దీనినే అనుసరించింది. ఈ రహస్య చిత్రాలు దృఢమైన క్లాడింగ్, రూఫ్ రెయిల్స్, మృధువైన వీల్ ఆర్చెస్ మరియు ఫ్రంట్ బంపర్ؚలో దృఢమైన ఎయిర్ డ్యామ్ؚతో నాజూకైన గ్రిల్ వంటి విశిష్ట లక్షణాలను నిలుపుకుంది అని చూపుతున్నాయి. DRLలతో నాజూకైన LED హెడ్లైట్లు, ఫ్రంట్ బంపర్ؚలో చిన్నగా ఉన్న సైడ్ ఎయిర్ ఇన్ؚటేక్స్ؚను కూడా చూడవచ్చు.
ప్రస్తుత మోడల్లో ఉన్నట్లుగా, ఈ SUVలో కూడా సారూప్య మూడు-గ్లాస్ ప్యానెల్స్ లేఅవుట్ؚతో ఉన్నట్లు ఈ ఫోటోలోని వాహనం ప్రొఫైల్ తెలియచేస్తుంది. ఆలాయ్ వీల్స్ డిజైన్ కూడా ప్రస్తుత మోడల్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది, అలాగే రెండవ వరుస డోర్ హ్యాండిల్ؚలు C-పిల్లర్‌తో ఇంటిగ్రేట్ చేసినట్లు కనిపిస్తోంది. వెనుక భాగంలో, “డాసియా” బ్రాండింగ్ మరియు Y-ఆకారపు LED టెయిల్‌లైట్ సెట్అప్ను గమనించవచ్చు, భారీ రేర్ బంపర్, రేర్ స్కిడ్ ప్లేట్‌తో ఇంటిగ్రేట్ చేయబడింది. ఇందులోని కొన్ని డిజైన్లు బిగ్ؚస్టర్ కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందాయి.
ఇది కూడా చదవండి: మార్చి 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన 10 కార్ల వివరాలు
ప్లాట్ؚఫామ్ మరియు పవర్ؚట్రెయిన్ వివరాలు
ఇండియా-స్పెక్ రెనాల్ట్ డస్టర్ (ఇప్పుడు నిలిపివేయబడింది)
రెండవ-జనరేషన్ యూరోప్-స్పెక్ వాహనంలో ఉన్నట్లు గానే, మూడవ-జనరేషన్ డస్టర్‌ను కొత్త CMF-B ప్లాట్ఫార్మ్పై రెనాల్ట్ అందిస్తుంది – ఇది ఇంటర్నల్ కంబూషన్ ఇంజన్లు (ICE) మరియు EV పవర్ؚట్రెయిన్ؚలు రెండిటికీ అనుకూలమైనది. గ్లోబల్-స్పెక్ మోడల్ కోసం స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ పవర్ؚట్రెయిన్ కోసం దాదాపుగా ఖరారు అయ్యింది, ఇది భారతదేశంలో కూడా ప్రవేశపెట్టవచ్చు. ఈ SUV పూర్తి-ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వస్తుందని అంచనా, అయితే డీజిల్ వెర్షన్ ఉండకపోవచ్చు.
భారతదేశంలో దీని ధర ఎంత ఉంటుంది?
భారతదేశంలో విడుదల కానున్న మూడవ-జనరేషన్ డస్టర్ ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభంకావచ్చు. MG ఆస్టర్, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటితో రెనాల్ట్ కాంపాక్ట్ SUV పోటీ పడుతుంది. విలక్షణమైన డిజైన్ؚతో దీని నిస్సాన్ వెర్షన్ కూడా వస్తుంది అని ఆశించవచ్చు.