124 స్పైడర్ ని బహిర్గతం చేసిన ఫియాట్ సంస్థ
నవంబర్ 19, 2015 12:45 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఫియట్ చివరకు ఎంతగానో ఎదురుచూస్తున్న 124 స్పైడర్ ని బహిర్గతం చేసింది. కారు దాని దగ్గరగా ఉన్న ప్రత్యర్థి మాజ్డా MX-5 తో అనేక పోలికలు కలిగి ఉంది మరియు అనేక వ్యత్యాసాలను కూడా కలిగి ఉంది.
ఇటాలియన్ వాహనతయారి సంస్థ పినిన్ఫారినా రూపొందించిన ఫియట్ 124 స్పైడర్ యొక్క అసలు వెర్షన్ నుండి స్టైలింగ్ అంశాలను తీసుకుంది. ఫియట్ సంస్థ 124 స్పైడర్ ని సృష్టించేందుకు MX-5 యొక్క బాడీ షెల్ ని మెరుగుపరిచింది. ముందరి భాగంలో కూడా హెడ్ల్యాంప్స్, ఫాగ్లాంప్స్ మరియు గ్రిల్ పునఃరుద్ధరించబడ్డాయి. దీనిలో హెడ్ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ సెట్ తో ఆధునిక పగటిపూట నడుస్తున్న ల్యాంప్స్ ని పొంది ఉంది. వెనుక భాగానికి వెళితే కారు డ్యుయల్ ఎగ్జాస్ట్ తో స్టైలిష్ దీర్ఘచతురస్రాకార టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంది. బూట్ కి స్పాయిలర్ అనుసంధానం చేయబడి ఉన్నందున డ్రైవర్ దాని ముందు డబుల్ విష్బోన్ మరియు వెనుక మల్టీ లింక్ సస్పెన్షన్ తో సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని పొందగలుగుతాడు.
ఇటీవల బహిర్గతమైన ఈ కారు MX-5 తో దాని అంతర్భాగాలను పంచుకుంటుంది. క్యాబిన్ చాలా ఫ్యాషన్ గా తయారుచేయబడి ఎల్లపుడూ డ్రైవర్ నియంత్రణలో ఉంటుంది. స్విచ్ గేర్ తో పాటూ సమాచార వ్యవస్థ మరియు సులభంగా పైకి లేవబడే రూఫ్ వంటి కొన్ని లక్షణాలు రెండు కార్లలో ఒకేలా ఉంటాయి.
యాంత్రికంగా 124 స్పైడర్ ఒక 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ని కలిగియుండి 160bhp శక్తిని మరియు 249.5Nm టార్క్ ని అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఒక ఆటోమేటిక్ గేర్బాక్స్ ల మధ్య ఎంపిక అందిస్తుంది. కారు 2016 లో అంతర్జాతీయంగా రోడ్ల పైకి రానుంది.