• English
  • Login / Register

2015 ఫియాట్ 500 ఫేస్లిఫ్ట్ వెర్షన్ బహిర్గతం

జూలై 04, 2015 11:14 am raunak ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫియాట్ 500 ఎనిమిది సంవత్సరాల క్రితం అనగా 2007 లో ప్రారంభించగా నవీకరించిన ఫియాట్ 500 ఫేస్ లిఫ్ట్ తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టబడింది. 

జైపూర్: 2015 ఫియాట్ 500 తిరిగి ప్రవేశపెట్టబడి ఈ సంవత్సరంలో అమ్మకాలకు వెళ్ళనుంది. ఈ నవీకరించబడిన ఫియాట్ 500 చూసేందుకుగానూ దీని ముందరి వాహనం లానే ఉన్నప్పటికీ కొన్ని అధనపు లక్షణాలు మరియు నవీకరించబడిన ఇంజిన్లు చేర్చబడ్డాయి. ఇటాలియన్ తయారీదారులు సింక్వెసెంటో కారులో 1800 నూతనమైన మార్పులు చేస్తామని మాట ఇచ్చింది. 

డిజైన్ నుంచి ప్రారంభిస్తే , ముందుగా దీని ముఖ భాగంలో చాలా మార్పులు చేయబడ్డాయి. దీని బంపర్ వివరించిన క్రోమ్ ని కలిగి వస్తుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో ఎయిర్ డ్రమ్ పైన క్రోమ్ బటన్లు కలిగి ఉంది. వాహనం కూడా నవీకరించబడిన హెడ్ల్యాంప్స్ ని కలిగియున్న కొత్త ట్రెపిజోయిడల్ గ్రిల్ తో కొద్దిగా ఏటవాలుగా ఉంది. ఫాగ్ ల్యాంప్స్ ఇప్పుడు రింగ్ ఆకారంలో ఉన్న పగటిపూట పనిచేసే ఎల్ ఇడి లతో రాబోతున్నది. వెనుక వైపున, టెయిల్ లైట్స్ కొత్తగా మరియు త్రిభుజాకారంలో వస్తున్నాయి. సెంటర్ పాలెట్ కారు రంగులోనే అందుబాటులో ఉంది. అంతేకాక, అది 15 మరియు 16-అంగుళాల అల్లాయి మరియు రెండు కొత్త రంగులు కొరెల్లో ఎరుపు మరియు ఒపేరా బుర్గండి లో అందుబాటులోనికి రాబోతున్నది. 

బాహ్య స్వరూపాలు, అంతర్గత భాగాలు పాత ఫియట్ 500 లో లాగే ఉన్నాయి. క్యాబిన్ ఏమాత్రం మార్పులేకుండా ఉంది. అయితే, దీనిలో పెద్ద మార్పు ఏమిటనగా, అయిదు అంగుళాల టచ్స్క్రీన్ వ్యవస్థ తో పాటు బిల్ట్ ఇన్ నావిగేషన్ సిస్టం ను కలిగి ఉంది అంతేకాకుండా ఫియట్-క్రిస్లర్ యొక్క 'యు కనెక్ట్ సమాచార వ్యవస్థ" తో రాబోతుంది.

అంతేకాక, 7-అంగుళాల ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ను ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో ఆప్షనల్ గా పొందవచ్చు.

ఇంజన్ పరంగా చెప్పాలంటే, ఈ ఫియాట్ ఫేస్లిఫ్ట్ పాత ఇంజన్లతో నే రాబోతుంది. అవి వరుసగా, పెట్రోల్ - 0.9 లీటర్ ట్విన్ ఎయిర్, 1.2 లీటర్ మరియు 1.4 లీటర్; డీజిల్ - 1.3 లీటర్ మల్టిజెట్. ఈ ఇంజన్ లు 5-స్పీడ్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ తో పాటు ఫియట్ యొక్క డుయోలోగిక్ రోబోటైజెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటాయి.

దేశంలో ఫియట్ ఇండియా తిరిగి ప్రారంభించబోయే ఫియాట్ 500, అబర్త్ అవతార్- 595 వాహనాలతో రానున్న కొద్ది వారాల్లో పోటీ పడనుంది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience