రూ. 46.10 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన డిస్కవరీ స్పోర్ట్
modified on సెప్టెంబర్ 02, 2015 04:42 pm by nabeel కోసం ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ 2015-2020
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ల్యాండ్ రోవర్ నేడు డిస్కవరీ స్పోర్ట్ ని రూ.46.10 లక్షల ధర వద్ద (ఎక్స్-షోరూం ముంబై) లో ప్రారంభించింది. ఈ కొత్త విలాశవంతమైన ఆఫ్-రోడర్ వాహనం సికెడి మార్గం ద్వారా వచ్చింది కనుక ధర సాధారణంగా ఉంది. ఇది మెర్సిడెస్ బెంజ్ ఎం క్లాస్, బిఎండబ్లు ఎక్స్3, ఆడి క్యూ 5, వోల్వో ఎక్స్ సి 60 వంటి కార్లతో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ యొక్క అధ్యక్షుడు, రోహిత్ సూరి మాట్లాడుతూ" చాలా మంది ల్యాండ్ రోవర్ అభిమానులు చూపిస్తున్న మక్కువ మరియు ఉత్సాహంకి మరియు ఎవరైతే ముందుగానే ఈ బహుముఖ ఎస్యువి కోసం ముందుగానే ఆర్డర్ ఇచ్చారో వారికి మా ధన్యవాదాలు. ఈ డిస్కవరీ స్పోర్ట్ సాంకేతిక అసాధారణ కలయిక, డిజైన్, ఆఫ్-రోడ్ మరియు ఆన్-రోడ్ సామర్ధ్యం వంటి అంశాలతో అందించబడుతున్నది." అని తెలిపారు.
ఈ ప్రధాన ఎస్యువి, దాని పోటీదారుల వలే కాకుండా విశాలమైన అంతర్భాగాలతో, మూడవ వరుస సీటింగ్ ఎంపిక (5 + 2) తో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ కారు, చక్కటి లెథర్ తో ప్రీమియం ఇంటీరియర్స్ ని కలిగి ఉంటుంది మరియు గొప్ప టెర్రైన్ రెస్పాన్స్ సిస్టం తో మరియు టచ్స్క్రీన్ మీడియా నేవిగేషన్ వ్యవస్థతో కూడా అందజేయబడుతున్నది.
లుక్స్ విషయానికి వస్తే, జెఎల్ఆర్ ఎల్ఇడి డే టైం రన్నింగ్ ల్యాంప్స్, ఉత్తమమైన క్లామ్షేల్ బోనెట్ తో పాటూ ల్యాండ్ రోవర్ సారాంశం అయిన ఎత్తయిన ముక్కు వైఖరి తో అందించబడుతుంది.
ఈ కారు శక్తివంతమైన 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి 1750 rpm వద్ద 150ps శక్తిని మరియు 400 Nm టార్క్ ని అందిస్తుంది. ట్రాన్స్మిషన్ విధులు ఆధునిక 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా పూర్తి అవ్వగా ఈ ఎస్యువి 0 నుండి 100 చేరుకొనేందుకు కేవలం 10.3 సెకెన్ల సమయం తీసుకుంటుంది.
ధరలు:
2.2ఎల్ టిడి4 డీజిల్ ఎస్: రూ. 46.10 లక్షలు (5 ఎస్)
2.2ఎల్ టిడి4 డీజిల్ ఎస్ఇ : రూ. 51.01 లక్షలు (5 ఎస్), 52.50 లక్షలు (5 + 2ఎస్)
2.2ఎల్ టిడి4 డీజిల్ హెచ్ఎస్ఇ : రూ. 53.34 లక్షలు (5 ఎస్), 54.83 లక్షలు (5 + 2ఎస్)
2.2ఎల్ టిడి4 డీజిల్ హెచ్ఎస్ఇ లగ్జరీ : రూ. 60.70 లక్షలు (5 ఎస్), 62.18 లక్షలు (5 + 2ఎస్)
- Renew Land Rover Discovery Sport 2015-2020 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful