డీలర్ నెట్వర్క్ ని కోల్పోతున్న షెవ్రొలె ఇండియా
నవంబర్ 05, 2015 06:43 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
అమెరికన్ కారు తయారీసంస్థ షెవ్రొలె క్రమంగా భారతదేశం అంతటా దాని డీలర్లను కోల్పోతోంది, సంఖ్య అనేక నెలల నుండి 280 కేంద్రాల నుంచి 223 కి పడిపోయింది. అమ్మకాలు వేగంగా క్షీణించిపోవడమే ఈ మందగింపు కి కారణం. ఎక్కువ మంది డీలర్స్ వారి కార్యకలాపాలను తగ్గించుకుంటున్నారు లేదా డీలర్షిప్ కి లొంగిపోతున్నారు.
సంస్థ గత ఏడాది సంఖ్యతో పోలిస్తే 33% అమ్మకాలను అధికంగా కోల్పోయింది. 2015 లో త్రైమాసికాల కాలం గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు , జనరల్ మోటార్స్ ఇండియా 19,299 యూనిట్లు (సంచిత సేల్స్) విక్రయించింది. 223 అవుట్లెట్లు అంతటా పంపిణీ చేయబడి 15 యూనిట్లు మాత్రమే ప్రతీ నెల అమ్ముడుపోతున్నాయి.
షెవ్రొలె ఇండియా నెట్వర్క్ విస్తరించుకునేందుకు దృష్టి సారించకుండా ప్రస్తుతం డీలర్షిప్ పైన దృష్టి సారిస్తుంది. వారు జూలై 2015 లో రూ 6,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. రాబోయే సంవత్సరానికి గానూ ఉన్న 10 ఉత్పత్తులను ప్రారంభించేందుకు ఈ పెట్టుబడిని హలోల్ కర్మాగారంలో మరియు తాలేగావ్ ప్లాంట్ లో పెట్టనున్నది.
జనరల్ మోటార్స్ ఇండియా నుండి ఒక ప్రతినిధి మాట్లాడుతూ " మాకు మరియు మా డీలర్స్ కోసం స్థిరమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి, డీలర్స్ ని దృష్టి లో పెట్టుకొని మేము గత 18 నెలల నుండి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నాము. మేము ఉత్తమ ప్రమాణాలలో పరిశ్రమకు డీలర్ మార్జిన్లు పెంచాము. మా డీలర్స్ 10 కొత్త ఉత్పత్తి ప్రారంభాలతో రాబోయే సంవత్సరాలలో నిశ్చితంగా ఉన్నారు. వారు ఒక స్థిరమైన వ్యాపారాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా ఒక లాభదాయకమైన వ్యాపారాన్ని కూడా సృష్టించగలరు. భవిష్యత్తులో ముందుకు వెళ్ళేందుకు మేము భారత వ్యాపార దీర్ఘకాలిక ఫండమెంటల్స్ మీద, అలాగే మా డీలర్స్ యొక్క ఆర్థిక ఆరోగ్యం మీద దృష్టి సారిస్తున్నాము." అని తెలిపారు.