క్రెటా కొనుగోలు సమయంలో, ఒక వేరియంట్ ఆధారంగా నిర్ణయించలేము? ఈ విధంగా ప్రయత్నించండి!

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం sumit ద్వారా డిసెంబర్ 07, 2015 01:45 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

హ్యుందాయ్ క్రెటా, ఇప్పటివరకు ఒక గొప్ప విజయాన్ని సాధించింది. యుటిలిటీ వాహనాల చార్ట్ లో అగ్ర శ్రేణి అమ్మకాలలో ఉండే బొలెరో వాహనం నుండి ఈ క్రెటా, ప్రదమ స్థానాన్ని సంపాదించింది. కానీ, ఈ స్థానాన్ని మూడు నెలల కాలం పాటు కాపాడుకుంది. ప్రస్తుతం ఈ వాహనం, ఈ విభాగంలో ఉండే ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనాల్ట్ డస్టర్, మారుతీ ఎస్ క్రాస్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. హ్యుందాయ్ క్రెటా యొక్క స్పష్టమైన వివరణాత్మక పోలిక చదవండి. ఈ కారు కొనుగోలు ప్రణాళికా వారికి, సంస్థ వారు ఒక సమగ్ర చిత్రాల రూపంలో అనేక రకాల వేరియంట్ల ఒక సంక్షిప్త విశ్లేషణ ఈ క్రింద ఇచ్చారు.

1. దిగువ శ్రేణి వేరియంట్: రూపాయలు 8.9 లక్షలు (పెట్రోల్), రూ. 9.8 లక్షలు (డీజిల్)

ఈ దిగువ శ్రేణి వేరియంట్ లో, టచ్ స్క్రీన్ ఆడియో వ్యవస్థ, ఎయిర్బ్యాగ్స్ అలాగే 128 పి ఎస్ పవర్ ను ఉత్పత్తి చేసే ఇంజిన్ వంటి కొన్ని ఆకర్షణీయమైన లక్షణాలను కలిగి లేదు, అయితే వినియోగదారులు తప్పనిసరిగా చూడటానికి కొన్ని స్పష్టమైన లక్షణాలు క్రింది ఇవ్వబడ్డాయి. వాటిలో కొన్ని:

• ఏబిఎస్ + ఈబిడి
• సిల్వర్ రేడియేటర్ గ్రిల్
• ఫాలో మీ హోం -హెడ్ల్యాంప్స్
• మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్
• పవర్ స్టీరింగ్
• ముందు & వెనుక పవర్ విండోలు
• 2-దిన్ ఆడియో సిస్టమ్
• స్టీల్ రిమ్ లతో టైర్లు
• కీ లెస్ ఎంట్రీ
• ఎత్తు సర్దుబాటు ముందు హెడ్రెస్ట్

కఠినమైన రహదారులలో వెళ్లాలనుకునే వారికి, ఈ వాహనం తక్కువ ధరతో కూడుకున్న వాహనం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ దృడ నిర్మాణం గల వాహనం, చాలా ఆకర్షణీయంగా మరియు కొనుగోలుదారులకు సంతృప్తిని ఇస్తుంది.

2. ఎస్ వేరియంట్: రూపాయలు 9.9 లక్షలు (పెట్రోల్), రూ 10.8 లక్షలు (డీజిల్)

ఈ వేరియంట్ ను, బేస్ వేరియంట్ నుండి కొన్ని మార్పులతో సరి చేసారు; వాటిలో అదనంగా మరియు అత్యంత ప్రముఖమైనది, టచ్ స్క్రీన్ ఆడియో వ్యవస్థ. ఇతర ప్రధానాంశాలు కొన్ని వరుసగా:
• ముందు ఫాగ్ ల్యాంప్లు
• టైమర్ తో కూడిన వెనుక డిఫోగ్గర్
• రూఫ్ రెయిల్స్
• విద్యుత్తో సర్దుబాటయ్యే వెలుపలి అద్దాలు
• వెలుపల మిర్రర్ లకు ఎల్ ఈ డి టర్న్ సూచికలు
• అంతర్గత డోర్ హ్యాండిళ్ళకు మెటల్ ఫినిషింగ్
• రేర్ పార్సెల్ ట్రే
• వెనుక సీట్లు కోసం కప్ హోల్డర్లు
• స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు
• ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు

ఎస్ వేరియంట్ అనేది, సంగీత ప్రియులకు ప్రముఖమైనది అని చెప్పవచ్చు. ట్రాక్స్ ను సులభంగా మార్చడానికి, టచ్ స్క్రీన్ ఆడియో వ్యవస్థ మరియు స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు వంటి అంశాలు అందించబడ్డాయి.

3. ఎస్+ వేరియంట్: రూపాయలు 11.8 లక్షలు (డీజిల్)

ఈ వేరియంట్ కేవలం 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వాహనం, ప్రధాన అంశంగా ఎయిర్బ్యాగ్స్ రూపంలో వస్తుంది. ఇతర కీలక అంశాలు వరుసగా:
• డ్రైవర్ మరియు ప్రయాణీకుడి ఎయిర్బ్యాగ్లు
• వెనుక పార్కింగ్ సెన్సార్లు
• వెనుక కెమెరా
• ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్
• టచ్ స్క్రీన్ ఆడియో తో నావిగేషన్ వ్యవస్థ
ఈ వేరియంట్ అనేది, ఎవరికైతే పవర్ కంటే గరిష్ట స్థాయిలో సౌలభ్యం మరియు భద్రతా కావాలో వారికి ఈ వాహనం ముఖ్యమైనది అని చెప్పవచ్చు. అయితే ఈ వాహనం లో సౌలభ్యాన్ని పెంచడం కోసం, నావిగేషన్ వ్యవస్థ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి అంశాలు అందించబడ్డాయి. అదే భద్రత విషయానికి వస్తే, ఆటో డోర్ అన్లాక్ మరియు ఎయిర్బాగ్లు వంటి అంశాలు అందించబడ్డాయి.

4. ఎస్ఎక్స్ వేరియంట్: రూపాయలు 12.1 లక్షలు (డీజిల్ మాన్యువల్)

ఈ వేరియంట్, అత్యంత శక్తివంతమైన 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ తో వస్తుంది. కొన్ని ముఖ్యమైన లక్షణాలు వరుసగా:
• ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు
• డ్యూయల్ టోన్ రేడియేటర్ గ్రిల్
• ఆటోమాటిక్ ఎయిర్ కండీషనింగ్
• క్రోం తో అలంకరించబడిన వెనుక భాగం
• విద్యుత్ తో మడత వేయగల వెలుపలి అద్దాలు
• వెనుక వైపర్ మరియు వాషర్
• పవర్ విండో తో పాటు డ్రైవర్ సైడ్ ఆటో అప్- డౌన్ ఫంక్షన్
పవర్ విషయంలో, ఎవరైతే రాజీ పడరో వారికి ఈ వాహనం సరైన వాహనం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ ఎస్యువి లో, విలాసవంతమైన లక్షణాలు ఇవ్వబడ్డాయి.

5. ఎస్ఎక్స్+ వేరియంట్: రూపాయలు 11.5 లక్షలు (పెట్రోల్), రూ 13.1 లక్షలు (డీజిల్ మాన్యువల్), రూ 14.1 లక్షలు (డీజిల్ ఆటోమాటిక్)

ఈ వేరియంట్, 1.6 లీటర్ డీజిల్ అలాగే పెట్రోల్ రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది మరియు పుష్ బటన్ స్టార్ట్ లక్షణం అదనంగా ఈ కారు లో జోడించబడుతుంది. ఈ లక్షణాన్ని, కోరుకునే వారికి ఇది సరైన వాహనం అని చెప్పవచ్చు.

6. ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్: రూపాయలు 14.1 లక్షలు (డీజిల్ మాన్యువల్)

ఈ క్రెటా యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ తో అందించబడుతుంది. ఈ వాహనంలో అనేక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి అవి వరుసగా:

• డ్రైవర్, పాసింజర్, సైడ్ & కర్టెన్ ఎయిర్బ్యాగ్లు
• డైమండ్ కట్ అల్లాయ్ చక్రాలు
• ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈ ఎస్ సి)
• వాహన స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వి ఎస్ ఎం)
• హిల్ ప్రారంభం కంట్రోల్ అసిస్ట్
• ఎత్తు సర్దుబాటు ముందు సీటు బెల్ట్లు
• స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
• సీట్లు మరియు స్టీరింగ్ వీల్ కోసం లెదర్ ప్యాక్
• సూపర్విజన్ క్లస్టర్
• లేన్ చేంజ్ ఫ్లాష్ అడ్జస్ట్మెంట్
• ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఆప్షనల్)
మీకు కావలసినటువంటి అనేక లక్షణాలు, ఈ క్రెటా వాహనం యొక్క అగ్ర శ్రేణి వాహనంలో అందించబడ్డాయి. ఆ సాంకేతిక లక్షణాలు వరుసగా, ఈ ఎస్ సి మరియు వి ఎస్ ఎం వంటి అంశాలతో ఈ అగ్ర శ్రేణి వాహనాన్ని పూర్తిగా తయారు చేయడం జరిగింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience