Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

భారతదేశంలో BYD $1 బిలియన్ పెట్టుబడి ప్రతిపాదన తిరస్కరించబడింది: అసలు ఏమి జరిగింది

జూలై 25, 2023 10:19 pm rohit ద్వారా ప్రచురించబడింది

చైనా EV తయారీదారు హైదారాబాద్ؚకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీతో కలిసి భారతదేశంలో EV తయారీ కర్మాగారాన్ని నెలకొల్పాలని భావించింది

చైనీస్ EV తయారీదారు బిల్డ్ యువర్ డ్రీమ్స్ (BYD) భారతదేశ మార్కెట్ؚలో ఒక బిలియన్ డాలర్‌ల పెట్టుబడి పెట్టాలనే ప్రతిపాదనను చేసిన కొద్దికాలం తరువాత, భారత ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదించిన సమాచారం ప్రకారం, ఈ నిర్ణయం వెనుక బహిరంగంగా తెలిసిన ఏకైక కారణం సంబంధిత అధికారి చేసిన “చర్చలలో భారతదేశంలో చైనా పెట్టుబడులకు సంబంధించి భద్రతా ఆందోళనలు ప్రస్తావించబడ్డాయి,” ప్రకటన.

ప్రణాళిక ఒప్పందం గురించిన వివరాలు

జూలై 2023 మధ్యలో, “మేఘా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్” అనే హైదారాబాద్ؚకు చెందిన ప్రైవేట్ కంపెనీతో భాగస్వామ్యం చేసుకోవాలనే ప్రణాళికను BYD కలిగి ఉంది, భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్‌లు మరియు బ్యాటరీలను తయారు చేయడానికి జాయిన్ వెంచర్ ఏర్పాటు చేయాలని భావించింది. ఈ రెండు కంపెనీలు EV ప్లాన్ؚను హైదారాబాద్ؚలోనే ఏర్పాటు చేయడానికి తమ ప్రతిపాదనను డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ؚకు (DPIIT) సమర్పించాయి.

ఈ ప్రతిపాదనలో, రెండు కంపెనీలు సంవత్సరానికి 10,000 నుండి 15,000 ఎలక్ట్రిక్ కార్‌లను ఉత్పత్తి చేయాలనే తమ ప్రణాళికను పేర్కొన్నాయి. మూలధన అవసరాలను మేఘా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సమకూరుస్తుండగా, పరిజ్ఞానం మరియు సాంకేతికత బాధ్యతను BYD తీసుకుంటుంది.

ఇది కూడా చదవండి: BYD నుండి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ MG కామెట్ EVకి పోటీ కావచ్చు

తిరస్కరణకు కారణం ఏంటి?

వచ్చే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో తమ యాజమాన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్న మరొక చైనీస్ అనుబంధ సంస్థ MG మోటార్ ఇండియా, ఇది అందరికి తెలిసిన విషయమే. చైనాకు చెందిన కంపెనీలు లేదా అనుబంధ సంస్థలు ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నాయి? ఇది భారతదేశం మరియు చైనా మధ్య కొనసాగుతున్న ఘర్షణలు కారణం కావచ్చు, ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ప్రవాహంపై ప్రభావం చూపుతోంది అలాగే చైనాకు చెందిన పెట్టుబడిదారుల నుండి నిధులను సేకరించాలని చూసే కారు తయారీదారులకు కూడా సమస్యలను సృష్టించవచ్చు.

ఇప్పటివరకు భారతదేశంలో BYD ప్రయాణం

ప్రస్తుతానికి, చైనీస్ EV తయారీదారు ప్రయాణీకుల వాహనాల శ్రేణిలో కేవలం రెండు మోడల్‌లను మాత్రమే అందిస్తున్నారు, అవి E6 MPV మరియు ఆట్టో 3 ఎలక్ట్రిక్ SUV. భారతదేశంలో తన తదుపరి EV అయిన సీల్ EV సెడాన్‌ను ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించింది. అయితే, BYD భారతదేశంలో చాలా కాలం నుండి మెటీరీయల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, పబ్లిక్ సెక్టార్ ట్రాన్స్‌పోర్ట్, భారీ ట్రక్కులు వంటి ఇతర రంగాలలో ఉంది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర