రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్‌లిఫ్ట్ యొక్క బుకింగ్స్ మొదలు అయ్యాయి

సవరించబడిన పైన Oct 21, 2015 11:53 AM ద్వారా Abhijeet for ల్యాండ్ రోవర్ Range Rover Evoque

  • 8 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Range Rover Evoque Front

రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు బుకింగ్స్ కి అందుబాటులో ఉంది. ఇది వచ్చే నెల పండుగ కాలంలో విడుదల కానుంది.  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది మొదట్లో లోపలా మరియూ బయట చిన్నపాటి మార్పులతో విడుదల అయ్యింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కి పోటీగా బీఎండబ్ల్యూ ఎక్స్3, ఆడీ క్యూ5 మరియూ వోల్వో ఎక్స్‌సీ 60 నిలువనున్నాయి. 

మార్పుల గురించి మాట్లాడుతూ, బాహ్య రూపానికి కొత్తగా రూపొందిన ముందు మరియూ వెనుక బంపర్ తో వెడల్పాటి ఎయిర్ స్కూప్ లు ఇంకా ఒక క్రింది స్కిడ్ ప్లేట్ కలిగి ఉంటుంది. కొత్త డే లైట్ రన్నింగ్ ల్యాంప్ సెటప్ వలన దీనికి ఉన్న హెడ్‌ల్యాంప్స్ పూర్తిగా ఎలీడీ గా మారతాయి. ఇవి కొత్త గ్రిల్లు డిజైన్ తో జత చేసి ఉంటాయి. కొత్త జత అల్లోయ్ వీల్స్ ఉండి, వెనుక భాగానికి కొత్త టెయిల్ లిడ్ స్పాయిలర్ ఉంటుంది. 

లోపల వైపు, కొత్త సీట్లు ఉన్నాయి, డోర్ కేసింగ్ మరియూ వేర్వేరు రంగుల ఎంపికలు కలిగి ఉన్నాయి. ఇవి కాకుండా, ఒక కొత్త 8-అంగుళాల టచ్‌స్క్రీన్ మీడియా నావిగేషన్ సిస్టం మరియూ ఒక కొత్త టీఎఫ్‌టీ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఉంటుంది.  దీనికి హెడ్స్అప్ డిస్ప్లే మరియూ హ్యాండ్స్ ఫ్రీ టెయిల్‌గేట్ వంటి లక్షణాలు ఉంటాయి. 

Range Rover Evoque Rear

ప్రస్తుతం, రేంజ్ రోవర్ ఇవోక్ కి భారతదేశంలో 2.2-లీటర్ డీజిల్ ఇంజిను అమర్చి ఉంటుంది. ఇది 187bhp శక్తిని విడుదల చేస్తుంది. ఈ కారుకి జేఎల్ఆర్ నుండి పునికి తెచ్చుకున్న ఆల్ టెర్రేఇన్ ప్రొగ్రెస్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటుంది. ఈ కారు స్థానికంగా అస్సెంబల్ (అమర్చినందున) అయినందున ధర తక్కువ పడింది. బేస్ వేరియంట్ (దిగువ శ్రేణి) ని రూ. 49.2 లక్షల (ఎక్స్-షోరూం, ) ధరకి అందుబాటులో ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన Land Rover Range Rover Evoque

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?