• English
  • Login / Register

ప్రారంభమైన మారుతి ఇన్విక్టో బుకింగ్ؚలు!

మారుతి ఇన్విక్టో కోసం tarun ద్వారా జూన్ 20, 2023 04:00 pm ప్రచురించబడింది

  • 38 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి కార్‌ల శ్రేణిలో ఇన్విక్టో ఖరీదైన కారుగా నిలుస్తుంది, దీని ధర సుమారు రూ.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా

Maruti Invicto MPV

  • రూ.25,000 ముందస్తు ధరను చెల్లించి నెక్సా డీలర్‌షిప్ؚల ద్వారా ప్రస్తుతం దీన్ని బుక్ చేసుకోవచ్చు.

  • ఇది ఇన్నోవా హైక్రాస్ పునర్నిర్మించబడిన వర్షన్, కానీ ఎక్స్ؚటీరియర్ డిజైన్ కొంత భిన్నంగా ఉంటుంది. 

  • 10-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్, వెంటిలేటెడ్ ముందు సీట్‌లు, డ్యూయల్-జోన్ AC (ముందు+వెనుక), 360-డిగ్రీ కెమెరా, మరియు ADAS వంటి ఫీచర్‌లు ఉన్నాయి. 

  • బలమైన హైబ్రిడ్ ఎంపికతో ఇన్విక్టో హైక్రాస్ 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది.

  • ధరలు సుమారు రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

జులై 5న విడుదల అవుతున్న మారుతి ఇన్విక్టో MPVని ప్రస్తుతం రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది నెక్సా డీలర్‌షిప్ؚల ద్వారా విక్రయించబడుతుంది మరియు మార్కెట్‌లో ఉన్న అన్నీ మారుతి వాహనాల ధరతో పోలిస్తే ఇదే అత్యంత ఖరీదైనది.

Toyota Innova Hycross

(టయోటా ఇన్నోవా హైక్రాస్ చిత్రాన్ని రిఫరెన్స్ కోసం ఉపయోగించబడింది)

కార్‌లు మరియు సాంకేతికత మార్పిడి కోసం టయోటా-సుజుకి గ్లోబల్ భాగస్వామ్యంలో భాగంగా, ఇన్విక్టో వాహనం టయోటా ఇన్నోవా హైక్రాస్ పునర్నిర్మించబడిన వర్షన్‌గా పరిచయం చేయబడింది. గ్రాండ్ విటారా/హైరైడర్ మరియు గ్లాంజా/బాలెనో విధంగానే, హైక్రాస్‌తో పోలిస్తే ఇన్విక్టో ఎక్స్‌టిరియర్ డిజైన్‌ కొంత భిన్నంగా ఉంటుంది.

సంబంధించినది: CD మాటలలో: మారుతి MPV కోసం రూ.30 లక్షల కంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడండి 

ఇన్నోవా హైక్రాస్‌పై ఆధారపడిన ఇన్విక్టోలో ఫ్యాన్సీ మరియు ప్రీమియం ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఫీచర్‌ల విషయానికి వస్తే ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ముందు సీట్లు, డ్యూయల్-జోన్ AC, 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, రాడార్-ఆధారిత ADAS సాంకేతికతలు భద్రత ఫీచర్‌లలో ఉన్నాయి.

Toyota Innova Hycross

హైక్రాస్‌లో ఉన్న పవర్ؚట్రెయిన్‌తో ఇన్విక్టోని అందిస్తున్నారు, హైబ్రిడైజేషన్ ఎంపికతో 2-లీటర్‌ల పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. బలమైన-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ 186PS పవర్‌ను విడుదల చేస్తుంది మరియు 23.24kmpl సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఇన్విక్టోలో కూడా మనం ఇలాంటి గణాంకాలను చూడవచ్చు.

పోలిక: కియా క్యారెన్స్ లగ్జరీ ప్లస్ Vs టయోటా ఇన్నోవా GX 

ఇన్నోవా హైక్రాస్ ధర రూ.18.55 లక్షల నుండి రూ.29.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మారుతి ఇన్విక్టో ధర కొంత ఎక్కువగా, సుమారు రూ.19 లక్షలు ఉంటుందని అంచనా. ప్రత్యక్ష పోటీదారు లేకపోయినా, ఇన్విక్టో, కియా క్యారెన్స్ؚకు ప్రీమియం ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

was this article helpful ?

Write your Comment on Maruti ఇన్విక్టో

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience