• English
    • Login / Register

    ఎక్స్1, ఎం2, 7 సిరీస్ మరియు ఫేస్లిఫ్ట్ 3 సిరీస్ లను ఆటో ఎక్స్పో 2016 వద్ద ప్రదర్శించనున్న బిఎండబ్ల్యూ

    బిఎండబ్ల్యూ ఎక్స్1 2015-2020 కోసం konark ద్వారా డిసెంబర్ 22, 2015 11:27 am ప్రచురించబడింది

    • 21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    రాబోయే ఆటో ఎక్స్పో వద్ద జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన బిఎండబ్ల్యూ, ఎం2, ఎక్స్1 మరియు 7 సిరీస్ అను మూడు కొత్త మోడళ్ళను ఆవష్కరించనుంది. వీటితో పాటు, ఫేస్లిఫ్ట్ 3 సిరీస్ ను కూడా ప్రదర్శించనుంది.

    బిఎండబ్ల్యూ ఎం2

    అంతర్జాతీయంగా, ఎం2 ఇటీవల ఆవిష్కరించబడింది మరియు ఇది, బిఎండబ్ల్యూ యొక్క ఎం డివిజన్ యొక్క చిన్న వాహనం అని చెప్పవచ్చు. ఈ ఎం శ్రేణిలో, ఈ ఎం2 ను ఎం3 మరియు ఎం4 ల క్రింద చేర్చవచ్చు. ఈ ఎం2 వాహనం, పునరుద్దరించబడిన వెర్షన్ మరుయు ఇది, అత్యంత శక్తివంతమైన 3.0 లీటర్ 6 సిలండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి కేవలం 4.5 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అంతేకాకుండా ఈ ఎం2 వాహనం, ఒక 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశిద్దాం.

    బిఎండబ్ల్యూ ఎక్స్1

    ఈ బిఎండబ్ల్యూ ఎక్స్1 వాహనం, ఆడి ఏ3 కు మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎలే క్లాస్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. కాస్మటిక్ పరంగా ఈ కొత్త వాహనం, ఒక నిజమైన ఎస్యువి వాహనం వలే కనిపిస్తుంది. ముందు ఉన్న ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఎక్స్1 వాహనం బిఎండబ్ల్యూ యొక్క ట్రైడ్ మరియు పరీక్ష చేయించబడిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఇంజన్, 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    బిఎండబ్ల్యూ 7-సిరీస్ సెడాన్

    మెర్సిడెస్ ఎస్ క్లాస్ ఇప్పుడు కొంతకాలంగా, లగ్జరీ సెలూన్ విభాగంలో బెంచ్ మార్క్ ను కలిగి ఉంది. తదుపరి తరం 7 సిరీస్ ను మార్చడానికి, బిఎండబ్ల్యూ బలంగా ఆలోచిస్తోంది. ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, బాగా మెరుగుపడిన హ్యాండ్లింగ్ మరియు రైడ్ అందించబడుతుంది అలాగే ఈ 7 సిరీస్, ప్రతీ కారకంలో అబివృద్ది చెందిన నవీకరణ కనబడుతుంది.

    బిఎండబ్ల్యూ 3-సిరీస్ ఫేస్లిఫ్ట్

    ఈ బిఎండబ్ల్యూ 3-సిరీస్ ఫేస్లిఫ్ట్, అన్ని కొత్త ముందు అలాగే వెనుక బంపర్లు, విసృత ముందు ఎయిర్ ఇంటేక్ డ్యాం వంటి కొన్ని మార్పు చేయబడిన కాస్మటిక్ అంశాలను అందించడం జరిగింది. వేరియంట్ రకాన్ని బట్టి, ఎల్ ఈ డి హెడ్ ల్యాంప్ లతో పాటు మార్పు చేయబడిన టైల్ ల్యాంప్లు కూడా ఆప్షనల్ గా అందించబడతాయి. అంతేకాకుండా ఈ వాహనంలో, అదే 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా దీనిలో అందించే అవకాశాలు ఉన్నాయి.

    మూలం - ఆటోకార్ ఇండియా

    ఇవి కూడా చదవండి:

    బిఎండబ్ల్యూ 530డి ఎం స్పోర్ట్ వాహనాన్ని కొనడానికి గల 5 కారణాలు

    మరిన్ని చదవండి: ఎక్స్ 1 ధర

    బీఎండబ్ల్యూ ఎక్స్ 1

    was this article helpful ?

    Write your Comment on BMW ఎక్స్1 2015-2020

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience