బీఎండబ్ల్యూ ఎక్స్ 1

` 32.3 - 42.7 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

బీఎండబ్ల్యూ ఇతర కారు మోడల్లు

 
*Rs

బీఎండబ్ల్యూ ఎక్స్ 1 వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


భారతదేశ మార్కెట్ లో ఈ సంస్థ, స్టైలిష్ మరియు విలాసవంతమైన వాహనాలు అందించటం కోసం ప్రముఖమైనది అని చెప్పవచ్చు. ఈ సంస్థ యొక్క వాహనాలు భారత రోడ్డు పరిస్థితులను ఆకట్టుకునే ప్రదర్శనను మరియు సామర్ధ్యాన్ని ఉత్పత్తి చేసే పవర్ ప్యాక్ ఇంజిన్ లను కలిగి ఉంటాయి. అనేక కార్లు మధ్య, ఈ బిఎండబ్లూ ఎక్స్1, మార్కెట్ లో అమ్మకాల పరంగా చాలా ప్రత్యేకమైనది మరియు ప్రముఖ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం మోడల్, గా ఉంది. ఇది అనేక సంవత్సరాల క్రితం భారతదేశం లో పరిచయం చేయబడింది. అంతర్గత మరియు భాహ్య బాగాల పరంగా చిన్న చిన్న మార్పులను కలిగి తిరిగి భారతదేశం లో 2013 వ సంవత్సరం లో అడుగుపెట్టింది. ప్రస్తుతం, ఈ ఎస్యువి వాహనం ఎస్ డ్రైవ్ 20డి, స్పోర్ట్ లైన్, ఎక్స్ లైన్ అను మూడు పేర్ల తో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహనాలు 1995 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ వాహనాలు 8- స్పీడ్ స్టెప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి, అత్యధికంగా 184 బి హెచ్ పి పవర్ ను మరియు 380 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ వాహనాల చాలా సమర్థవంతమైన బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం ఎల్లవేళలా సమతుల్యంగా మరియు స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ బ్రేకింగ్ మెకానిజం, మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి ఏబిఎస్ తో పాటు అత్యవసర బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, డైనమిక్ స్టెబిలిటీ తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ను కూడా కలిగి ఉంటుంది. వీటితోపాటు, ఈ ఎస్యువి బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టం ను కూడా కలిగి ఉంటుంది. ఈ వాహనం, ఈ విభాగం లో ఉన్న ఆడి క్యూ 3, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ ఏ క్లాస్, వోల్వో వి40 క్రాస్ కంట్రీ మరియు ఇతర వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ ను మినహాయించి, మిగిలిన వేరియంట్ లు ఈ వాహనాలకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వడం కోసం స్టిలింగ్ ప్యాకేజ్ ను కలిగి ఉంటాయి. ఈ వాహన సిరీస్ యొక్క మధ్య శ్రేణి వేరియంట్ అయిన స్పోర్ట్ లైన్ లో యాంబియంట్ లైట్నింగ్ సిస్టం తో పాటు స్విచ్చబుల్ కలర్స్, హై గ్లాస్ బ్లాక్ కిడ్నీ బీన్ గ్రిల్, రెడ్ స్టిచ్చింగ్ తో కూడిన స్పోర్ట్ లెధర్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలను కలిగి ఉంటుంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎక్స్ లైన్ వాహనం, క్రోం టైల్ పైప్స్, ఎంట్రీ సిల్ విత్ ఎక్స్ లైన్ లెటరింగ్, గ్లేసియర్ సిల్వర్ మేట్టె తో ఉన్న రేడియేటర్ గ్రిల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఈ మోడల్ సిరీస్, డ్రైవర్ కు సౌకర్యవంతం చేయడానికి వెనుక భాగం లో ఒక ఆధునిక పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ (పి డి సి), తో బిగించబడి ఉంది. కారు తయారీదారుడు కూడా దాని ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి, ఈకోప్రో మోడ్ యాక్టివేషన్ ఫంక్షన్ తో పాటు పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్ ను కలిగి ఉంటుంది. దీని ప్రధాన హైలైట్స్ ఏమిటంటే, బ్లూటూత్ విత్ హ్యాండ్స్ ఫ్రీ, 22.3 సింటీమీటర్ల కలర్ డిస్ప్లే కలిగిన యూఎస్బి కనెక్టవిటీ మరియు ఐ డ్రైవ్. మరోవైపు, వాహన తయారీదారుడు, ఈ వాహనం ఆకర్షణీయంగా కనబడటం కోసం అనేక కాస్మటిక్ లక్షణాలను మరియు సొగసైన సరీర నిర్మాణాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా, ఈ వాహనానికి విలక్షణీయమైన లుక్ ను అందించడానికి, బాడీ క్లాడింగ్ ను కూడా కలిగి ఉంది. అదే సమయం లో ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వాహనాలు 17- అంగుళాల అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటాయి. ఈ వాహనం బయట నుండి కాంపాక్ట్ ఎస్యువి గా కనిపించినప్పటికీ, లోపల చాలా విశాలంగా ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునే సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ సిరీస్, విద్యుత్తో సర్దుబాటు అయ్యే ముందు సీట్లు, బహుళ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించే ఒక 2-జోన్ ఆటోమేటిక్ ఏసి యూనిట్ తో సహా అనేక వినూత్న సౌకర్యాలతో అందించారు. ఈ వాహన సిరీస్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, రన్ ఫ్లాట్ టైర్స్ తో కూడిన రైన్ ఫోర్సెడ్ సైడ్ వాల్స్ మరియు క్రాష్ సెన్సార్స్ తో కూడిన ఇంజన్ ఇమ్మోబిలైజర్ వంటి పలు అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ విభాగం లో ఇన్ని లక్షణాలను కలిగి ఉన్న ఈ వాహనం చూడటానికి ఆకర్షణీయం గా మరియు భద్రతా వాహనంగా పరిగణింపబడుతుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్ధ్యం:


వాహన తయారీదారుడు, ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ను కలిగి కామన్ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ టెక్నాలజీ తో జత చేసి అందించాడు. దీని ద్వారా ఇంధన సామర్ధ్యం మరింత పెరుగుతుంది. ఈ ఇంజన్, నగరాలలో 12 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారుల పై 17.05 కె ఎం పి లె మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

శక్తి సామర్ధ్యం:


ఈ మోడల్ సిరీస్ 1995 సిసి స్థానభ్రంశాన్ని కలిగిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ మంచి పనితీరును ఇవ్వడం లో సహాయపడుతుంది. మరోవైపు, ఈ ఇంజన్ అత్యధికంగా 4000 ఆర్ పి ఎం వద్ద 184 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1750 నుంది 2750 ఆర్ పి ఎం మధ్య లో 380 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ ట్విన్ పవర్ టర్బోచార్జ్డ్ పవర్ ప్లాంట్, ఈ వాహనం యొక్క వెనుక చక్రాలకు టార్క్ ఉత్పత్తి అందించడానికి 8- స్పీడ్ స్టెప్ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ట్రాన్స్మిషన్ సిస్టం తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 0 నుంది 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 7.7 సెకన్ల సమయం పడుతుంది. అదే సమయం లో మరోవైపు ఈ వాహనం, అత్యధికంగా 200 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


కంపెనీ, ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహన సిరీస్ కు అనేక ఆకర్షణీయమైన లక్షణాలను అందించడం జరిగింది. ఇది నిస్సందేహంగా విభిన్న, సౌందర్య మరియు బలమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉండటం లో మరియు ప్రవేశ స్థాయి లగ్జరి ఎస్యువి విభాగంలో అత్యంత అందమైన వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహనం యొక్క ముందు ముఖభాగం విషయానికి వస్తే, అందమైన హెడ్ లైట్ క్లస్టర్ ను కలిగి దానిలో అత్యంత శక్తివంతమైన ద్వి జినాన్ హెడ్ల్యాంప్స్ తో పాటు టర్న్ సూచికలు పొందుపరచబడి ఉంటాయి. అంతేకాకుండా, ఇది ఎల్ఇడి డే టైం రన్నింగ్ లైట్ లను కలిగి ఉంటుంది. దీని వలన ముందు భాగం మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. మధ్య భాగం లో కిడ్నీ ఆకృతి కలిగిన రేడియేటర్ గ్రిల్ అందించబడుతుంది. ఇది నిలువైన బార్స్ ను కలిగి హై గ్లాస్ బ్లాక్ మరియు క్రోమ్ తో పొందుపరచబడి ఉంటుంది. ఇదే గ్రిల్, ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో గ్లేసియర్ సిల్వర్ మ్యాట్ తో అలంకరించబడి ఉంటుంది. ఈ గ్రిల్ మధ్య భాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. దీని క్రింది భాగానికి వస్తే, డ్యూయల్ టోన్ బంపర్ బిగించబడి ఉంటుంది. ఇది చిన్న నష్టాలను నుండి వాహనాని రక్షించడం కోసం బ్లాక్ ప్రొటెక్టివ్ క్లాడింగ్ తో పాటు నడ్జ్ గార్డ్ కూడా అందించబడుతుంది. అంతేకాకుండా, ఇంజన్ ను చల్లగా ఉంచడం కోసం ఒక ఎయిర్ డక్ట్ ను మరియు ఎయిర్ డాం ను కలిగి ఉంటుంది. రోడ్ పై ప్రత్యక్షతను మరింత పెంచడానికి ఎయిర్ డక్ట్ పై భాగం లో రౌండ్ ఆకృతి లో ఉన్న రెండు ఫాగ్ ల్యాంప్స్ అందించబడతాయి. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, అనేక క్యారెక్టర్ లైన్స్ ను మరియు ట్రెండీ కాస్మటిక్ లైన్స్ ను కలిగి ఉంటాయి. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ మరియు అగ్ర శ్రేణి వేరియంట్ లు స్టార్ స్పోక్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. అదే స్పోర్ట్ లైన్ వేరియంట్ లో, వి స్పోక్ డిజైన్ వీల్స్ అందించబడతాయి. ఈ వీల్స్ రోడ్ల పై మరింత పటుత్వాన్ని ఇవ్వడానికి అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లెస్ రేడియల్ టైర్ లతో కప్పబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క రేర్ వ్యూ మిర్రర్స్ మరియు డోర్ హ్యాండిల్స్ రెండూ కూడా కారు యొక్క బాడీ రంగులో ఉంటాయి. అంతేకాకుండా, రేర్ వ్యూ మిర్రర్ లకు టర్న్ సూచికలు బిగించబడి ఉంటాయి. ఈ మిర్రర్ లు విద్యుత్ సర్దుబాటు ఫంక్షన్ తో పాటు హీటింగ్ మరియు మెమొరీ ఫంక్షన్ లను డ్రైవర్ సౌకర్యార్ధం అందించడం జరుగుతుంది. వీటితో పాటు, అందమైన అప్పీల్ ను ఇవ్వడం కోసం క్రోమ్వైస్ట్ లైన్ మౌల్డింగ్ మరియు బ్లాక్ విండో సిల్స్ ను కలిగి ఉంటుంది. అదే, ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, అనేక లక్షణాలను పొందుపరచడం జరిగింది. దీనిలో భాగంగా వెనుక టైల్ లైట్ క్లస్టర్ ను, అదే విధంగా, ఎల్ ఈ డి బ్రేక్ లైట్ సెట్ అప్ ను, రివర్స్ లైట్స్ మరియు టర్న్ సూచికలను కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క టైల్ గేట్ అందంగా మధ్య భాగం లో కంపెనీ యొక్క లోగో బిగించబడి ఉంటుంది. వెనుక విండ్ స్క్రీన్ చాలా సొగసైనది గా ఉంటుంది మరియు స్పాయిలర్ కు ఒక హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అమర్చబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ విండ్ స్క్రీన్ కు డిఫోగ్గర్ ఫంక్షన్ మరియు ఒక వైపర్, ఒక వాషర్ బిగించి ఉంటాయి. అంతేకాకుండా, వెనుక బంపర్ కూడా రెండు రంగుల పధకంతో అలంకరించబడి రెండు రిఫ్లెక్టర్లను కలిగి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం యొక్క మొత్తం పొడవు 4454 మిల్లీ మీటర్లు, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లతో సహ ఈ వాహనం యొక్క మొత్తం వెడల్పు 2044 మిల్లీ మీటర్లు. ఈ వాహనం యొక్క ఎత్తు 1545 మిల్లీ మీటర్లు, దీని వలన ఈ వాహనం లో ప్రయాణించే పొడవైన వ్యక్తులకు సౌకర్యాన్ని అందిస్తుంది. అదే గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే, 179 మిల్లీ మీటర్లు, దీని వలన ఎటువంటి రోడ్లపైన అయినా సౌకర్యవంతమైన డ్రైవ్ ను ఇస్తుంది. మరోవైపు, 2760 మిల్లీ మీటర్ల పొడవైన వీల్ బేస్ కారణంగా ఆకర్షణీయమైన లెగ్ స్పేస్ ను అందిస్తుంది.

లోపలి డిజైన్:


ఈ మోడల్ సిరీస్ యొక్క అంతర్గత క్యాబిన్ విస్తృతంగా లెధర్ అపోలిస్ట్రీ తో రూపొందించడం జరిగింది. ఈ అంతర్గత క్యాబిన్ డ్యూయల్ టోన్ పధకంతో రూపొందించబడి, చెక్క తో పొదిగి మరియు పరిసర లైటింగ్ ను మరియు అనేక క్రోమ్ ఇన్సర్ట్స్ తో అలంకరించడం వలన అంతర్గత క్యాబిన్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. సీటింగ్ విషయానికి వస్తే, ముందు రెండు సీట్లు కూడా విద్యుత్ సర్దుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. దీనితో పాటుగా సరైన లుంబార్ మద్దతును కలిగి ఉంటుంది. అదే డ్రైవర్ సీటు విషయానికి వస్తే, మెమొరీ ఫంక్షన్ ను కలిగి ఉంటుంది. అదే ఈ వాహన సిరీస్ యొక్క మధ్య శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, స్పోర్ట్ సీట్లు అంతర్గత క్యాబిన్ లుక్ ను మరింత పెంచడానికి అందించబడతాయి. దీనిలో మొదటి మరియు రెండవ వరుస లో సెంటర్ ఆర్మ్ రెస్ట్ తో కూడిన స్టోరేజ్ కంపార్ట్మెంట్ తో పాటు డ్రింక్ హోల్డర్స్ అందించబడతాయి. వెనుక బెంచ్ సీటు 40 : 20: 40 నిష్పత్తిని కలిగి ఉంటాయి. దీని మడత సౌకర్యం కారణంగా బూట్ కంపార్ట్మెంట్ ను మరింత పెంచవచ్చు. దీని కాక్పిట్ విభాగం సొగసైన డాష్బోర్డ్ పై ఫైన్ లైన్ వుడ్ మరియు క్రోమ్చేరికలతో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ డాష్బోర్డ్ శీతలీకరణ ను కలిగిన గ్లోవ్ బాక్స్ ను, అధునాతన ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ను, దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఏసి వెంట్ లను కలిగి ఉంది. అంతేకాకుండా, దీనిపై లెధర్ తో కప్పబడిన త్రీ స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ అందించబడుతుంది. ఈ స్టీరింగ్ వీల్ పై అనేక నియంత్రణ స్విచ్చులు పొందుపరచబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క మధ్య భాగం ఏసి యూనిట్, సమాచార వ్యవస్థ తో కూడిన టచ్ స్క్రీన్ డిస్ప్లే వంటి పలు అధునాతన పరికరాలను కలిగి ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక ఇంటిగ్రేటెడ్ రంగు స్క్రీన్ కలిగి దీనితో పాటుగా రెండు రౌండ్ ఆకృతి కలిగిన మీటర్ల ను కలిగి ఉంటుంది. దీనిలో స్పీడోమీటర్, ఇంధన వినియోగం, టాకొమీటర్, బాహ్య ఉష్ణోగ్రత, ట్రిప్ మీటర్ మరియు అనేక ఇతర నోటిఫికేషన్ ల్యాంప్స్ డ్రైవర్ సౌలభ్యం కోసం అందించబడ్డాయి. అంతేకాకుండా, కంపెనీ గ్లోవ్ బాక్స్, ముందు సీటు వెనుక పాకెట్లు, ముందు మరియు వెనుక సెంటర్ ఆర్మ్రెస్ట్ తో కూడిన నిల్వ కంపార్ట్మెంట్, డ్రైవర్ సీట్ కింద నిల్వ బాక్స్ మరియు సన్ గ్లాస్ హోల్డర్, కప్ మరియు బాటిల్ హోల్డర్స్, రేర్ పార్సెల్ షెల్ఫ్, డోర్ మ్యాప్ పాకెట్స్, రిమోట్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ మరియు అనేక ఇతర వినియోగ ఆధారిత అంశాలను ఈ వాహనానికి అందించడం జరిగింది.

లోపలి సౌకర్యాలు:


ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లు లోపల కూర్చునే యజమానులకు ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం కోసం అనేక అధునాతన సౌకర్య లక్షణాలతో సంఘటిత చేశారు. క్యాబిన్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం అలాగే వెనుక ప్రయాణీకులకు ఎయిర్ వెంట్లతో సహా 2 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ అందించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, కనెక్టివ్ డ్రైవ్. ఇది అనేక అధునాతన లక్షణాలను కలిగి ఉంది. ఆ అధునాతన లక్షణాలు ఏమిటంటే, బ్లూటూత్ తో పాటు హ్యాండ్స్ ఫ్రీ మరియు యూఎస్బి ఇంటర్ఫేస్, విస్తరించిన బ్లూటూత్ తో కూడిన ఆడియో స్ట్రీమింగ్ మరియు వాయిస్ కంట్రోల్, ఆఫీస్ ఫంక్షన్స్ మరియు కాంటాక్ట్ ఫోటో డిస్ప్లే వంటి లక్షణాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం క్యాబిన్ వాతావరణాన్ని పెంచడం తో పాటు ఎనిమిది స్పీకర్ లతో కూడిన హైఫై లౌడ్ స్పీకర్ వ్యవస్థ కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, ఇది ఐ డ్రైవ్ తో కూడిన 22.3 టచ్ స్క్రీన్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది డివిడి ప్లేయర్ ను, మ్యాప్స్ కొరకు హార్డ్ డ్రైవ్ ను మరియు ఆడియో ఫైల్స్ లకు మద్దతిస్తుంది. ఈ వాహన సంస్థ వారు, ఈ వాహనానికి రహదారులపై ఒక స్థిరమైన వేగాన్ని నిలబెట్టడానికి ఒక క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ ను అందించారు. వీటితో పాటు, ఈ వాహనం అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, వన్ టచ్ ఆపరేషన్ తో పాటు అన్ని నాలుగు పవర్ విండోలు, విధ్యుత్ తో సర్దుబాటయ్యే యాంటీ డాజింగ్ ఫంక్షన్ తో పాటు మెమోరీ కూడిన వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ వంటి అనేక అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం రేర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ తో కూడిన రెండు కప్ హోల్డర్స్ ను, ఆటోమేటిక్ యాంటీ డాజ్లింగ్ ఫంక్షన్ తో కూడిన వెలుపలి రేర్ వ్యూ మిర్రర్, స్టోరేజ్ కంపార్ట్మెంట్ ప్యాకేజ్ మరియు స్టార్ట్ మరియు స్టాప్ తో కూడిన ఇంజన్ బటన్ వంటి వాటిని కూడా కలిగి ఉంది. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ ను ప్రక్కన పెడితే, మిగిలిన అన్ని వేరియంట్ లు పనరోమిక్ గ్లాస్ రూఫ్ ను కలిగి ఉంటాయి. .

లోపలి కొలతలు:


ఈ వాహనం బయట నుండి చూడటానికి కాంపాక్ట్ ఎస్యువి లా కనిపిస్తుంది. కానీ లోపల ఒక భారీ స్పేస్ కలిగి కనీసం ఐదు ప్రయాణీకులకు విలాసవంతమైన సీటింగ్ ను అందిస్తుంది. ఈ కాక్పిట్ యొక్క హెడ్ రూం 1048 మిల్లీ మీటర్లు మరియు షోల్డర్ స్పేస్ 1439 మిల్లీ మీటర్లు. అయితే, రేర్ క్యాబిన్ లో హెడ్ స్పేస్ 1008 మీటర్లు మరియు షోల్డర్ స్పేస్ 1443 మిల్లీ మీటర్లు. మరోవైపు, ఈ వాహన సిరీస్ 480 లీటర్ల బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంటుంది. దీనిని వెనుక సీటు మడవటం ద్వారా మరింత పెంచవచ్చు. అయితే, వెనుక సీటు 40 : 20: 40 నిష్పత్తి గల బెంచ్ సీట్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, సుదీర్ఘ ప్రయాణాల ప్రణాళిక కోసం, కంపెనీ ఒక సహేతుకమైన మంచి ఇంధన ట్యాంక్ ను ఇచ్చింది.

ఇంజన్ మరియు దాని పనితీరు:


ఈ వాహనం యొక్క బోనెట్ క్రింద భాగానికి వస్తే, ఈ మోడల్ సిరీస్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ సిరీస్ మూడో తరం కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ టెక్నాలజీ తో విలీనం చేయబడి ఉంటుంది. మరోవైపు, ఈ ఇంజన్ డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 1995 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ మోటార్, 8-స్పీడ్ స్టెప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా టార్క్ అవుట్పుట్ ను ఈ వాహనం యొక్క వెనుక వీల్స్ పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 4000 ఆర్ పి ఎం వద్ద 184 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా, 1750 నుండి 2750 ఆర్ పి ఎం మధ్య లో 380 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ మోడల్ సిరీస్ కనెక్టెడ్ డ్రైవ్ పరికరాలతో బిగించబడి ఉంటాయి. దీనితో పాటుగా, హైఫై లౌడ్ స్పీకర్ సిస్టం తో పాటు బ్లూటూత్, హ్యాండ్స్ ఫ్రీ మరియు యూఎస్బి కనెక్టవిటీ వంటి అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం లో తయారీదారుడు బిజినెస్ సిడి ప్లేయర్ తో పాటు ఎం పి3 డెకోడర్, ఆక్సలరీ ఇంపుట్ మరియు టూ లైన్ డిస్ప్లే వంటి వాటిని కూడా కలిగి ఉంది. మరోవైపు, ఈ వాహనం, పార్కింగ్ సమయం లో ఒత్తిడి ని తగ్గించేందుకు ఆధునిక పార్క్ దూరం నియంత్రణ వ్యవస్థ, తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహన సిరీస్ యొక్క మధ్య శ్రేణి మరియు అగ్ర శ్రేణి వాహనాలు, సౌలభ్యాన్ని మరింత చేకూర్చడానికి ఆడియో స్ట్రీమింగ్ మరియు వాయిస్ కంట్రోల్ ఫంక్షన్ ల కొరకు బ్లూటూత్ కనెక్టవిటీ లను కలిగి ఉంటాయి. వీటితో పాటు, ఈ వాహనాలు ఐ డ్రైవ్ యూనిట్ తో పాటు 22.3 సెంటీమీటర్ల కలర్ డిస్ప్లే ను, డివిడి ప్లేయర్, మ్యాప్ మరియు ఆడియో ఫైల్స్ కొరకు హార్డ్ డ్రైవ్ లను కలిగి ఉంటాయి. అంతేకాక, ఈ వాహన తయారీదారుడు మ్యాప్స్ కొరకు నావిగేషన్ సిస్టం, సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, ఈ ఎస్యువి యొక్క యజమానులు వారి అవసరాల ఎంపికల మేరకు వివిధ బాహ్య మరియు అంతర్గత పరికరాలు ఎంపిక చేసుకోవచ్చు. బాహ్య ఉపకరణాల గురించి గనుక మాట్లాడటానికి వస్తే, స్టైలిష్ బాడీ డికాల్స్ తో పాటు డోర్ విజర్స్, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్స్, సైడ్ స్టెప్, మడ్ గార్డ్ సెట్, రూఫ్ రైల్స్, స్పాయిలర్ మరియు సైడ్ స్కర్ట్స్ వంటివి ఈ వాహనానికి స్పోర్టీ లుక్ ను అందిస్తాయి. అదే సమయం లో ఈ వాహన సిరీస్ యొక్క అంతర్గత ఉపకరణాల విషయానికి వస్తే, ఐ పాడ్ హోల్డర్, స్నాప్ ఇన్ అడాప్టర్, ఆల్ వెథర్ ఫ్లోర్ మ్యాట్స్, ఐసోఫిక్స్ తో కూడిన జూనియర్ సీట్లు వంటి వాటిని కలిగి ఉంటాయి.

వీల్స్ పరిమాణం:


ఈ వాహన సిరీస్ యొక్క స్పోర్ట్లైన్ వరియంట్ వీల్ ఆర్చులు 17- అంగుళాల వి స్పోక్ అల్లాయ్ వీల్స్ సమితి తో జత చేయబడి ఉంటాయి. అదే మిగిలిన రెండు వేరియంట్ లు అయితే, స్టార్ స్పోక్ స్టైల్ అల్లాయ్ వీల్స్ తో జత చేయబడి ఉంటాయి. ఈ వాహనాలు అన్ని రకాల రోడ్ల పై గట్టి పటుత్వాన్ని ఇవ్వడానికి, వీటి యొక్క రిమ్స్ 225 / 50 R17 పరిమాణం గల రేడియల్ ట్యూబ్ లెస్ టైర్ల తో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ సంస్థ ఒక విడి చక్రం తో పాటుగా ఒక స్పేర్ వీల్ మార్చడానికి అవసరమైన ఉపకరణాలన్నింటినీ బూట్ కంపార్ట్మెంట్ లో అందించబడతాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


కంపెనీ, అన్ని సార్లు ఈ వాహనాన్ని బాగా సమతుల్యంగా ఉంచడానికి సమర్థవంతమైన బ్రేకింగ్ అలాగే ఒక నమ్మకమైన సస్పెన్షన్ విధానాన్ని ఈ విలాసవంతమైన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం లో అందించడం జరిగింది. ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ల చక్రాలు అధిక పనితీరు కలిగిన వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ లతో పాటు గట్టి బ్రేక్ క్యాపిల్లరీస్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ విధానాన్ని మరింత పెంపొందించుటకు ఈ వాహన సిరీస్ యాంటీ లాక్ బ్రేకింగ్ మెకానిజం ను కలిగి ఉంటాయి. అదనంగా, ఈ వాహన సిరీస్ మలుపులు తిరిగే సమయంలో దాని సామర్థ్యాన్ని మరింత పెంచడానికి పెంచడానికి బ్రేక్ నియంత్రణ ను కలిగి ఉంది. మరొక విషయం ఏమిటంటే, ఈ వాహన సిరీస్ యొక్క సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనాల ముందు ఆక్సిల్ డబుల్ జాయింట్ స్ట్రట్ సిస్టం తో జత చేయబడి ఉంటాయి. అదే విధంగా వెనుక ఆక్సిల్ మల్టీ ఆర్మ్ సస్పెన్షన్ సిస్టం తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్ రోడ్ల పై మరింత పటుత్వాన్ని ఇవ్వడానికి ట్రాక్షన్ నియంత్రణ వ్యవస్థ తో పాటు డైనమిక్ స్థిరత్వం వంటి కార్యక్రమాలను కూడా కలిగి ఉన్నాయి. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క విద్యుత్ తో సర్దుబాటయ్యే స్టీరింగ్ వీల్, సర్వోస్ట్రోనిక్ సహాయాన్ని అందిస్తుంది. తద్వారా, మొత్తం సామర్థ్యం మెరుగుపడుతుంది.

భద్రతా మరియు రక్షణ:


ఈ మోడల్ సిరీస్, ప్రమాదం విషయంలో ప్రయాణీకులకు భద్రతను ఇవ్వడం కోసం అనేక క్రియాశీల మరియు నిష్క్రియాత్మక భద్రతా లక్షణాలను కలిగి ఉంది. క్యాబిన్ లో ప్రయాణికులకు మరింత భద్రతను అందించడం కోసం ఎనిమిది ఎయిర్బాగ్ లను కలిగి ఉంది (డ్యూయల్ ఫ్రంట్, హెడ్ అండ్ సైడ్). వీటితో పాటు, అన్ని సీట్లకు త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ తో పాటు పైరోటెక్నిక్ బెల్ట్ ప్రీటెన్సినర్ మరియు లోడ్ లిమిటర్ సౌకర్యాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇన్స్ట్రుమెంట్ పానెల్ మీద సీటు బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ ను కలిగి ఉంటుంది. కారు తయారీదారుడు, ఈ వాహనానికి ఇంపాక్ట్ బీమ్స్ మరియు క్రంపుల్ జోన్ తో కూడిన దృఢమైన శరీరం నిర్మాణం ఇచ్చారు. దీని వలన తాకిడి ప్రభావం తగ్గుతుంది. వీటన్నింటితో పాటు, ఈ వాహన సిరీస్ వార్నింగ్ ట్రైయాంగిల్ తో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటక్షన్, రన్ ఫ్లాట్ టైర్ తో రైంఫోర్సెడ్ సైడ్ వాల్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది. అదే సమయంలో, ఈ వాహన సిరీస్ కలిగి ఉన్న భద్రతా లక్షణాలు పరంగా అధునాతన ఇంజన్ ఇమ్మోబిలైజర్ తో కూడిన క్రాస్ సెన్సార్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది.

అనుకూలాలు:


1. ఈ వాహనం యొక్క అధునాతన భద్రత మరియు సౌకర్య లక్షణాలు దాని పెద్ద ప్లస్ పాయింట్ గా ఉన్నాయి.
2. బాహ్య ప్రదర్శన చాలా ఆకర్షణీయంగా ఉంది.
3. ఈ వాహనం యొక్క త్వరణం మరియు పికప్ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందాయి.
4. విలాసవంతమైన సీటింగ్ ఏర్పాటు ఈ వాహనం యొక్క ప్రయోజనాన్ని మరింత జతచేస్తుంది.
5. ఈ వాహనం యొక్క రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ప్రతికూలాలు:


1. దీని యొక్క ఇంధన సామర్ద్యం అంత ఆకర్షణీయంగా లేదు.
2. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, అసమాన రోడ్ల పై హార్డ్ డ్రైవ్ ను ఇస్తుంది.
3. అధికారిక సేవా కేంద్రాలు పెంచవలసిన అవసరం ఉంది.
4. ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లకు నావిగేషన్ సిస్టం ప్రామాణికంగా అందించకపోవడం ఒక ప్రతికూలత.
5. యాజమాన్యం ప్రారంభ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది.