X3కి కొత్త డీజిల్ వేరియెంట్‌లను జోడించిన BMW

బిఎండబ్ల్యూ ఎక్స్3 కోసం ansh ద్వారా మార్చి 31, 2023 06:17 pm ప్రచురించబడింది

  • 32 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ లగ్జరీ SUV కొత్త ఎంట్రీ-లెవెల్ Xలైన్ వేరియెంట్ؚను పొందింది.

BMW X3

  • దీని డీజిల్ ఇంజన్ 190PS పవర్ మరియు 400Nm టార్క్‌లను అందిస్తుంది. 

  • ఈ యూనిట్ 8-స్పీడ్‌ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో అందిస్తున్నారు. 

  • రెండూ ఆల్-వీల్ డ్రైవ్ కలిగిన Xడ్రైవ్ వేరియెంట్ؚలు. 

  • తేలికపాటి మార్పులను మినహాహిస్తే, డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు ఇందులో లేవు. 

  • ఈ X3 ధర రూ.67.50 లక్షల నుండి రూ.69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 

ఇటీవల ఈ SUV పెట్రోల్ వేరియెంట్ؚలను నిలిపివేసిన తరువాత, X3 వేరియెంట్ లైన్అప్ؚకు BMW మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ కారు తయారీదారు దీన్ని డీజిల్ؚ వేరియెంట్ؚలలో అందిస్తున్నారు, ఇందులో ఒకటి X3 లగ్జరీ ఎడిషన్ స్థానంలో వచ్చింది.

ధరలు 

వేరియెంట్‌లు

ధర (ఎక్స్-షోరూమ్)

xడ్రైవ్20d xలైన్

రూ. 67.50 లక్షలు

xడ్రైవ్20d M స్పోర్ట్

రూ. 69.90 లక్షలు

X3 Xలైన్ వేరియెంట్ లగ్జరీ ఎడిషన్ స్థానంలో వచ్చింది మరియు దీని ధర రూ.20,000 ఎక్కువగా ఉంటుంది. ఈ వేరియెంట్ؚలు రెండూ డీజిల్‌తో నడుస్తాయి, పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ఇకపై అందుబాటులో ఉండదు. 

తేడా ఏమిటి?

BMW X3

డిజైన్ పరంగా చూస్తే, xలైన్ వేరియెంట్ؚలో ఎటువంటి మార్పులు లేవు. LED లైటింగ్ ఎలిమెంట్‌లు, 19-అంగుళాల అలాయ్ వీల్స్ వంటి వాటిని ఈ SUV ప్రామాణికంగా పొందింది. క్యాబిన్‌లోؚ 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరామిక్ గ్లాస్ రూఫ్, హర్మాన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు రేర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్‌లు ఉన్నాయి. 

M స్పోర్ట్ వేరియెంట్ ఎక్స్ؚటీరియర్ స్పోర్టీయర్ స్టైలింగ్ؚతో వస్తుంది. ఎయిర్ ఇన్ؚలెట్ؚలు, ఇన్సర్ట్ؚలు గ్లాస్ బ్లాక్ ఫినిష్ కలిగి ఉంటాయి. కిడ్నీ గ్రిల్, రూఫ్ రెయిల్ؚలు మరియు విండో గ్రాఫిక్స్ కూడా గ్లాస్ బ్లాక్ రంగులో అందుబాటులో ఉన్నాయి. M స్పోర్ట్ వేరియంట్‌లో స్పోర్ట్ సీట్‌లు, M లెదర్ సీట్‌లు, M ఇంటీరియర్ ట్రిమ్, డైనమిక్ డ్యాంపర్ కంట్రోల్, సరౌండ్ వ్యూ కెమెరా మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మునపటి కంటే మరింతగా SUVలా కనిపిస్తున్న సరికొత్త జనరేషన్ BMW X1 ఇప్పుడు భారతదేశంలో రూ.45.9 లక్షల ధరతో రానుంది.

భద్రత విషయానికి వస్తే, ఈ వేరియెంట్‌ల మధ్య తేడా ఏమి లేదు. ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు ఆటో హోల్డ్ؚతో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఇందులో ఉన్నాయి. 

పవర్ؚట్రెయిన్ 

X3 ఇప్పుడు 190PS పవర్ మరియు 400Nm టార్క్‌ను అందించే 2-లీటర్, నాలుగు-సిలిండర్ డీజిల్ ఇంజన్ؚతో వస్తుంది. ఈ డీజిల్ మిల్ ఎనిమిది-స్పీడ్ ఆటోమ్యాటిక్ స్ట్రెప్ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్ؚమిషన్ؚతో వస్తుంది మరియు BMW xడ్రైవ్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ؚని కూడా పొందుతుంది. ఈ SUV వేగం సున్నా నుండి 100kmphకి 7.9 సెకన్‌లలో చేరుకుంటుంది, దీని గరిష్ట వేగం 213kmph. 

ఇది కూడా చదవండి: పునరుద్ధరించిన X7ను భారతదేశంలో పరిచయం చేసిన BMW 

2022లో పరిచయం చేసిన నవీకరించబడిన X3తో అందించబడిన 252PS, 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు అందుబాటులో లేదు. 

పోటీదారులు 

BMW X3 ఇప్పుడు ఆడి Q5, వోల్వో XC60 మరియు రానున్న మెర్సిడెజ్-బెంజ్ GLC వంటి వాటితో పోటీ పడుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన బిఎండబ్ల్యూ ఎక్స్3

Read Full News
Used Cars Big Savings Banner

found ఏ కారు యు want నుండి buy?

Save upto 40% on Used Cars
  • quality వాడిన కార్లు
  • affordable prices
  • trusted sellers

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience