• English
  • Login / Register

సరికొత్త మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు

మెర్సిడెస్ వి-క్లాస్ 2024 కోసం tarun ద్వారా జూలై 31, 2023 02:14 pm ప్రచురించబడింది

  • 793 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఉత్తమమైన డిజైన్, ఖరీదైన ఇంటీరియర్‌లు, మెరుగైన సాంకేతికత ఈ వ్యాన్ؚలను మరింత విలాసవంతమైనవిగా చేస్తున్నాయి

2024 Mercedes Benz V-Class

2024 మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్‌ను అంతర్జాతీయంగా మొదటిసారిగా ప్రదర్శించారు మరియు ఈ లగ్జరీ వ్యాన్‌ల లైన్అప్ మరింత ఆకర్షణీయమైన ఫీచర్‌ల జాబితాను అందిస్తున్నాయి. సరికొత్త క్యాబిన్ లేఅవుట్‌తో అత్యాధునిక ఎక్స్ؚటీరియర్ డిజైన్ؚను మరియు మరింత సాంకేతికతను పొందింది. కొత్త V-క్లాస్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ అందించబడ్డాయి:

మరింత సొగసైన రూపం

2024 Mercedes Benz V-Class

కొత్త V-క్లాస్, మునపటి వ్యాన్-టైప్ ఆకారాన్ని కొనసాగిస్తున్నపటికి, సరికొత్త లుక్‌తో వస్తుంది. చుట్టు ప్రకాశవంతంగా ఉండే భారీ గ్రిల్, పదునైన LED లైట్‌లు మరియు మరింత ఆధునికమైన బంపర్‌లు లగ్జరీ-విభాగం వాహన కొనుగోలుదారులను మరింతగా ఆకర్షిస్తుంది.

సైడ్ ప్రొఫైల్‌లో కొత్త ఏరోడైనమిక్ؚ డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్ ఉన్నాయి, వీటిని 17 నుండి 19 అంగుళాల వరకు వివిధ పరిమాణాలలో అందిస్తున్నారు. వెనుకవైపు, కొంత వంగి ఉన్నట్లు కనిపించే టెయిల్ؚల్యాంప్ డిజైన్ మరియు విండ్ؚస్క్రీన్ డీటైలింగ్ؚతో లుక్ పరంగా తేలికపాటి మార్పులను పొందుతుంది.

అంతేకాకుండా, మునుపటి వర్షన్‌తో పోలిస్తే ప్రస్తుత V-క్లాస్ వర్షన్ మరింత అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

అద్భుతమైన క్యాబిన్ అనుభవం

2024 Mercedes Benz V-Class

ఇంటీరియర్‌లో మరిన్ని మార్పులను పొందింది, V-క్లాస్‌లో కొత్త ఇంటీరియర్ లేఅవుట్ మిగిలిన మెర్సిడెస్-బెంజ్ లైన్అప్ؚకు సరిపోలుతుంది. విస్తారమైన డ్యాష్‌బోర్డు లేఅవుట్ చాలా ఖరీదైనదిగా మరియు కంటికి ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఎట్టకేలకు ఇది డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేలతో వస్తుంది.

కొత్త స్టీరింగ్ వీల్, నాజూకైన AC వెంట్‌లు మరియు ఎండ్-టు-ఎండ్ ఆంబియాంట్ లైటింగ్ స్ట్రిప్ వంటి కొత్త అంశాలను డ్యాష్‌బోర్డుపై చూడవచ్చు. క్లైమేట్ కంట్రోల్ స్విచ్ؚలను కలిగి ఉన్న ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ మరియు ట్రాక్ؚప్యాడ్ؚతో ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ؚలను ఇప్పటికీ కలిగి ఉంది, అయితే వీటిని కొత్త రూపంలో అందిస్తున్నారు.

దీన్ని నాలుగు మరియు ఆరు-సీటర్ కాన్ఫిగరేషన్ؚలలో అందిస్తున్నారు, రెండవది మరింత విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: పెద్దవి, మెరుగైనవా? ఈ 10 కార్ లు ప్రపంచంలోనే అతి పెద్ద డిస్ప్లేలను కలిగి ఉన్నాయి

పుష్కలమైన ఫీచర్‌లు

2024 Mercedes Benz V-Class

ముందు భాగంలో, కొత్త-తరం మెర్సిడెస్ డ్యూయల్ డిస్ప్లే సెట్అప్‌ను చూడవచ్చు, ఇందులో టచ్‌స్క్రీన్ సిస్టమ్ మరియు వర్చువల్ కాక్ؚపిట్ (డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్) కోసం MBUX ఇన్ఫోటైన్మెంట్ ఉన్న 12.3-అంగుళాల స్క్రీన్‌లు రెండు ఉన్నాయి.  

మరింత సౌకర్యం మరియు విశ్రాంతి కోసం హీటెడ్ స్టీరింగ్ వీల్, 64-రంగుల ఆంబియంట్ లైటింగ్, లుంబార్ సపోర్ట్ؚతో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు మరియు అటెన్షన్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్ మరియు పార్కింగ్ అసిస్టెంట్ؚతో సహా అనేక డ్రైవింగ్ అసిస్టెంట్ ఫీచర్‌లు ఉన్నాయి.

2024 Mercedes Benz V-Class

స్పష్టంగా, V-క్లాస్‌లో వెనుక కూర్చునే ప్రయాణీకులకు లగ్జరీ పరంగా కొరత ఉండదు. వీటిలో ఎలక్ట్రికల్లీ స్లైడింగ్ డోర్‌లు, టింటెడ్ రేర్ విండోలు, సీట్ల క్రింద USB ఛార్జర్ؚలు మరియు పెద్ద పనోరమిక్ సన్ؚరూఫ్ ఉన్నాయి. 

ఇంకా చెప్పాలంటే, మార్కో పోలో ఎడిషన్ కూడా వస్తుంది, ఇది మౌలికంగా విలాసవంతమైన క్యాంపర్ దీనిలో సౌకర్యం కోసం వెనక్కి వంపగలిగే సీట్లు, సింక్ మరియు ఎలక్ట్రిక్ స్టవ్‌తో చిన్న కిచెన్, స్టోరేజ్ కొంపార్ట్మెంట్‌లు కూడా ఉన్నాయి. 

ఎలక్ట్రిక్ V-క్లాస్ గురించి అభిప్రాయం ఏమిటి?

2024 Mercedes Benz V-Class

మెర్సిడెస్ నవీకరించిన EQVని కూడా వెల్లడించింది, ఇది V-క్లాస్ ఎలక్ట్రిక్ వర్షన్ అని చెప్పవచ్చు. EQV మరియు కొత్త V-క్లాస్ పవర్ؚట్రెయిన్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. వీటో మరియు e-వీటో వర్షన్‌లు కూడా ఉన్నాయి, ఇవి వాణిజ్య విభాగానికి ఉపయోగకరంగా ఉంటుంది.

EQV సుమారు 400 కిలోమీటర్‌ల మైలేజ్‌ను అందిస్తాయని అంచనా. ICE వర్షన్‌లు లేదా సాధారణ V-క్లాస్ؚలో ఇతర మెర్సిడెస్ ఆఫరింగ్ؚలలో ఉన్నట్లుగానే మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతతో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ల ఎంపిక ఉంటుంది

ఇది కూడా చదవండి: మార్కెట్‌లో అత్యధిక పరిధిని అందించే 10 ఉత్తమ EVలు

ఇది భారతదేశానికి వస్తుందా?

2024 Mercedes Benz V-Class

V-క్లాస్ మునుపటి వర్షన్‌ను 2019లో భారతదేశంలో విడుదల చేశారు, కానీ 2022లో దీన్ని నిలిపివేశారు. నవీకరించిన మెర్సిడెస్ వ్యాన్ 2024 సంవత్సరంలో భారతదేశానికి వస్తుందని అంచనా, ఇది టయోటా వెల్ؚఫైర్ؚతో పోటీ పడనుంది, దీని ధర సుమారుగా రూ.90 లక్షల నుండి ఉంటుందని అంచనా.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mercedes-Benz వి-క్లాస్ 2024

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది మిని వ్యాను కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience