Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టయోటా రైజ్ గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు

toyota raize కోసం sonny ద్వారా నవంబర్ 12, 2019 04:44 pm ప్రచురించబడింది

క్రొత్త జపనీస్ SUV మన దగ్గరకి రాబోతున్నది, దీని గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి

టయోటా ఇటీవలే తన పోర్ట్‌ఫోలియోకు కొత్త మోడల్‌ ను జోడించింది, అది రైజ్ అనే SUV. ఇది ప్రస్తుతం జపాన్‌ లో మాత్రమే అందించబడుతుండగా, ఇతర మార్కెట్లలో కూడా దీనిని ప్రవేశపెట్టవచ్చు. రైజ్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి:

ఇది చిన్నది

టయోటా రైజ్ ఐదుగురు కూర్చొనేలా ఉండే సబ్ -4 మీటర్ SUV. ఇది నిజం, ఇది మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్‌ ల మాదిరిగానే ఉంది. ఇది 3995mm పొడవు మరియు 2525 mm వీల్ బేస్ ని కలిగి ఉంది.

ఇది వాస్తవానికి ఒక డైహత్సు

టయోటా రైజ్ టయోటా యొక్క అనుబంధ సంస్థలలో ఒకటైన డైహత్సు రాకీ నిర్మించిన మోడల్ పై ఆధారపడింది. రెండు మోడళ్లు ఒకే DNGA ప్లాట్‌ఫామ్‌ పై నిర్మించబడ్డాయి, కానీ రెండూ విభిన్న బాహ్య స్టైలింగ్‌ ను కలిగి ఉన్నాయి. ది రాకీ కూడా 2019 టోక్యో మోటార్ షోలో వెల్లడైన సరికొత్త మోడల్.

లక్షణాలు

టొయోటా రైజ్‌ లో క్రూయిజ్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే తో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల TFT డిస్‌ప్లే తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆల్-బ్లాక్ ఇంటీరియర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. భద్రతా లక్షణాలలో కొలిజన్ వార్నింగ్, పార్కింగ్ అసిస్ట్ మరియు క్రాష్ అవాయిడన్స్ బ్రేకింగ్ వంటి లక్షణాలు ఉన్నాయి.

ఇంజిన్

జపనీస్ మార్కెట్ లో ఒక ఇంజిన్‌ తో మాత్రమే రైజ్ అందించబడుతుంది – అది CVT ఆటోమేటిక్‌తో జతచేయబడిన 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్. ఇది 98PS పవర్ ని మరియు 140Nm పీక్ టార్క్ ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఫ్రంట్-వీల్-డ్రైవ్ మరియు ఫోర్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో రైజ్ అందించబడుతుంది.

ఇది భారతదేశానికి వస్తుందా?

రాకపోవచ్చు. టయోటా రైజ్ భారతదేశంలో ప్రసిద్ధ సబ్ -4m SUV విభాగంలోకి ప్రవేశించడానికి బ్రాండ్ యొక్క టికెట్ కావచ్చు. ఏదేమైనా, టయోటా సంస్థ సుజుకితో కలిసి 2022 లో ప్రవేశపెట్టబోయే తదుపరి తరం విటారా బ్రెజ్జాను ప్రారంభించనున్నది. రెండు SUV లు తమకు ప్రత్యేకమైన బాహ్య డిజైన్‌ ను కలిగి ఉంటాయి. అయితే, రైజ్ రాబోయే డిజైన్ మరియు లక్షణాలలో సబ్ -4 m SUV కి ప్రతిబింబంలా ఉంటుంది. లాంచ్ చేసినప్పుడు, దీని ధర రూ .8 లక్షల నుండి 11 లక్షల మధ్య ఉంటుంది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.42 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర