కొత్త Tata Nexonతో పోలిస్తే Maruti Brezza అందించే 5 ముఖ్యమైన ప్రయోజనాలు
మారుతి బ్రెజ్జా కోసం rohit ద్వారా సెప్టెం బర్ 27, 2023 04:32 pm ప్రచురించబడింది
- 81 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా నెక్సాన్ అనేక ఫీచర్‌లను అందిస్తున్నప్పటికీ, బ్రెజ్జాలో, CNG ఎంపిక వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మారుతి బ్రెజ్జా, భారతదేశంలో 2016లో మార్కెట్ؚలో ప్రవేశపెట్టినప్పటి నుండి అత్యంత ప్రజదరణ పొందిన సబ్‌కాంపాక్ట్ SUVలలో ఒకటి, ఇది తరచుగా నెలవారీ విక్రయాలؚలో మొదటి స్థానంలో నిలుస్తుంది. దీనికి సముచిత పోటీదారు అయిన టాటా నెక్సాన్ 2017లో విడుదల అయ్యింది, ఇటీవల ఇది భారీ నవీకరణను పొందింది. మారుతి SUV కూడా 2022 మధ్యలో జనరేషన్ అప్ؚగ్రేడ్ؚను పొందింది, ఈ నవీకరణతో అధిక ఫీచర్‌లను పొంది భారీ ఆఫరింగ్‌గా నిలచింది. ఇటీవలి కాలంలో నెక్సాన్ విక్రయాలు (EV వర్షన్ సేల్స్ గుణంకాలతో కలిపి) బ్రెజ్జాను అధిగమించింది. అలాగే ఇది డీజిల్ ఎంపికతో కూడా వస్తుంది. అయితే, బ్రెజ్జా పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే వస్తుంది.
మారుతి బ్రెజ్జా కంటే ఎక్కువగా 2023 టాటా నెక్సాన్ ఏమి అందిస్తుందో మీకు ఇప్పటికే తెలియజేశాము, ఇప్పుడు మనం టాటా నెక్సాన్‌తో పోలిస్తే మారుతి SUV అందించే ప్రయోజనాలు, వాటి మధ్య ఉండే ముఖ్యమైన తేడాలను చూద్దాం.
హెడ్స్అప్ డిస్ప్లే
హెడ్స్అప్ డిస్ప్లేను పొందిన ఏకైక సబ్-4మీ SUV బ్రెజ్జా మాత్రమే. ఇది ఇంధన స్థాయి, వేగం, గేర్ పొజిషన్ ఇండికేటర్ (కేవలం ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియెంట్‌లలో), సమయం మరియు మైలేజ్ సమాచారాన్ని అందిస్తుంది. మారుతి ఈ సౌకర్యవంతమైన ఫీచర్ؚను కేవలం బ్రెజ్జా ఫుల్లీ లోడెడ్ ZXi+ వేరియెంట్ؚలో మాత్రమే అందిస్తోంది.
CNG ఎంపిక
2023 ప్రారంభంలో CNG పవర్‌ట్రెయిన్ؚ ఎంపికను పొందిన మొదటి సబ్‌కాంపాక్ట్ SUVగా బ్రెజ్జా నిలిచింది. నెక్సాన్ CNG ఎంపికను కూడా పొందడం గురించి రిపోర్ట్ؚలు వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి ఇది లేకపోవడం ఈ విభాగంలో మారుతి SUVపై స్థానంలో నిలిచేలా చేస్తుంది. మారుతి బ్రెజ్జా CNG మూడు వేరియంట్‌లలో లభిస్తుంది - LXi, VXi మరియు ZXi – వీటి ధరలు రూ. 9.24 లక్షల నుండి రూ. 12.15 లక్షల వరకు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: 6 చిత్రాలలో మారుతి ఆల్టో K10 లోయర్-స్పెక్ LXi వేరియెంట్ వివరణ
మరింత సమర్ధమైన పెట్రోల్-ఆటో కాంబో
మారుతి బ్రెజ్జా ఏకైక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో (103PS/137Nm) వస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్ؚతో జోడించబడింది.
మారుతి బ్రెజ్జా పెట్రోల్ AT |
టాటా నెక్సాన్ పెట్రోల్ AMT, పెట్రోల్ DCT |
|
క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యం |
19.80kmpl |
17.18kmpl, 17.01kmpl |
బ్రెజ్జా AT మారుతి సుజుకి స్మార్ట్-హైబ్రిడ్ సాంకేతికతతో వస్తుంది, ఫలితంగా ఇది పెట్రోల్-మాన్యువల్ వర్షన్ కంటే చవకగా వస్తుంది.
మరింత చవకైన పెట్రోల్ ఆటోమ్యాటిక్ ఎంపిక
మారుతి బ్రెజ్జా ఆటోమ్యాటిక్, టాటా నెక్సాన్ పెట్రోల్-ఆటోమ్యాటిక్ ఎంపికల కంటే మరింత చవకైనది మాత్రమే కాకుండా, మరింత అందుబాటులో కూడా ఉంటుంది.
మారుతి బ్రెజ్జా పెట్రోల్-ఆటో |
టాటా నెక్సాన్ పెట్రోల్-ఆటో |
|
ధర |
రూ. 11.14 లక్షల నుండి 14.14 లక్షల వరకు |
రూ. 11.70 లక్షల నుండి 14.70 లక్షల వరకు |
మారుతి SUV మరింత ఆధునికమైన ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను అందించినప్పటికీ దీని ధర నెక్సాన్ పెట్రోల్-AMT ప్రారంభ ఎంపిక కంటే రూ. 56,000 తక్కువ ఉంటుంది.
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
సంప్రదాయ Vs ఆధునిక డిజైన్


మారుతి బ్రెజ్జా మరియు టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ప్రత్యేకమైన డిజైన్‌లను కలిగి ఉంటాయి, ఇవి కొనుగోలుదారులకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. నవీకరించిన నెక్సాన్ షార్ప్ డీటైల్స్, క్రీజెస్ మరియు వాలుగా ఉండే పై కప్పుతో ఉంటుంది, బ్రెజ్జా సాధారణంగా SUVలలో ఉండే బాక్సీ ఆకారంలో వస్తుంది. ఇది చుట్టుపక్కల క్రమమైన మరియు ధృడమైన డిజైన్ؚతో వస్తుంది, వీటిలో ప్రధానమైనవి చుట్టు ఉన్న LED టెయిల్‌లైట్‌లు మరియు డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్.
మరొక వైపు 2023 నెక్సాన్, డిజైన్ؚలో కనెక్టెడ్ టెయిల్‌లైట్‌లు, నాజూకైన హెడ్ؚలైట్‌లు మరియు కొత్త లుక్‌తో షార్ప్ అలాయ్ వీల్స్ ఆధునిక మెరుగులను కలిగి ఉంటుంది
ప్రజాదరణ పొందిన ఈ సబ్‌కాంపాక్ట్ SUVలలో మీకు ఏది నచ్చుతుంది? క్రింద కామెంట్‌లలో తెలియజేయండి.
ఇది కూడా చూడండి: మారుతి బ్రెజ్జా Vs టాటా నెక్సాన్
ఇక్కడ మరింత చదవండి: బ్రెజ్జా ఆన్ؚరోడ్ ధర