హోండా WR-V గురించి 5 ఆసక్తికరమైన వాస్తవాలు
హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 కోసం cardekho ద్వారా మార్చి 27, 2019 01:32 pm ప్రచురించబడింది
- 19 Views
- 11 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హోండా WR-V మార్చ్ 2017 యొక్క మధ్య భాగంలో షోరూంలోకి రావచ్చు. కొన్ని రిపోర్ట్స్ గానీ మీరు పరిశీలించినట్లయితే మీకు ఇప్పటికే కొంత సమాచారం తెలిసే ఉంటుంది.ఆ వాస్తవాల యొక్క సారాంశం ఇక్కడ ఉంది:
- WR-V జాజ్ మరియు హోండా సిటీ వంటి అదే ప్లాట్‌ఫార్మ్ పై ఆధారపడి ఉంది. ఇది జాజ్ తో దాని పోర్ట్రెయిన్ ఎంపికలను 1.2 లీటర్ పెట్రోల్ మరియు ఒక 1.5 లీటర్ డీజిల్ మోటార్ ను పంచుకుంటుంది.
- పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో లభించగా, డీజిల్ 6-స్పీడ్ మాన్యువల్ తో ఆఫర్ చేయబడుతుంది.
- ఇది జాజ్-ఆధారిత క్రాస్ ఓవర్ అయినందున, డాష్బోర్డ్ మరియు అంతర్భాగాలు దాని లాగానే పెద్దదిగా ఉంటాయి.
ఇప్పుడు, ఇక్కడ మరిన్ని ఆసక్తికరమైన అంశాలు కొన్ని చూడండి:
ఇంఫోటైన్మెంట్
హోండా యొక్క R & D కార్య నిర్వాహకులు మనకు ధ్రువీకరించినట్లు, WR-V లో కూడా సిటీ ఫేస్లిఫ్ట్ లో వచ్చినట్టే అదే 7- అంగుళాల డిగిపడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని దాని టాప్ వేరియంట్స్ లో పొందుతుంది. ఈ వ్యవస్థ బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ మరియు టెలిఫోనీ, SD కార్డ్ బేసెడ్ నావిగేషన్ సిస్టమ్ మరియు ఆడియో మరియు వీడియో ఫైళ్లను ప్లే చేసే మీడియా ప్లేయర్లకు మద్దతు ఇస్తుంది. ఇది Wi-Fi మరియు మిర్రర్లింక్ మద్దతుతో పాటు HDMI పోర్ట్ మరియు USB కనెక్టివిటీతో కూడా వస్తాయి. ఒక గమనిక, అది ఒక CD డ్రైవ్ లేదా AUX పోర్ట్ పొందడం లేదు.
సన్‌రూఫ్
ఇది జాజ్ కారు ఆధారంగా ఉన్నా కూడా, WR-V సిటీ కారు నుండి ఒక లక్షణం తీసుకుంది, ఆ లక్షణమే సన్‌రూఫ్ ఎంపిక, ఇది టాప్-ఎండ్ గ్రేడ్స్ లో అందించబడుతుంది.
క్రూయిజ్ కంట్రోల్
WR-V క్రూయిజ్ నియంత్రణ ప్రయోజనం పొందుతుంది. అయితే, ఈ లక్షణం కొన్నిసార్లు మన రహదారి పరిస్థితుల్లో ఉపయోగించడం కష్టం అయినా, విస్తృతమైన హైవే మీద వెళ్ళడానికి చూస్తున్న వారికి ఒక పెద్ద వరంగా ఉంటుంది. WR-V కారు ఒక SUV రూపాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, ఇది చాలా సౌకర్యాన్ని అందిస్తుంది, అందుకుగానూ దాని అనువైన క్యాబిన్(జాజ్ నుండి ఉద్భవించింది) కి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎవరైతే, సిటీ లోపల మరియు వీకెండ్ ట్రిప్స్ కి హైవే లో వెళ్తారో వారికి క్రూయిజ్ కంట్రోల్ బాగా ఉపయోగపడుతుంది. అదనంగా, హోండా సంస్థ ఒక పుష్ బటన్ స్టార్టర్ తో కూడా వస్తుందని భావిస్తుంది!
గ్రౌండ్ క్లియరెన్స్
హోండా సంస్థ యొక్క సాధారణంగా మన రోడ్డు పరిస్థితులపై కిందికి తగిలే విధంగా బలహీనమైన గ్రౌండ్ క్లియరెన్స్ ను అందించేటట్టు ఉంటాయని చెడ్డ పేరును కలిగి ఉంది. మరోవైపు, WR-V, సుమారు 200 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్ ను అందిస్తుంది, ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కి సమానంగా ఉంది. మీరు మట్టి రోడ్డు లేదా సెమీ-పట్టణ రహదారుల ద్వారా డ్రైవింగ్ చేసినా కూడా, ఎక్కువ మంది మనుషులు తో ప్రయాణం చేసినా కూడా దీని మంచి గ్రౌండ్ క్లియరెన్స్ వలన ఇబ్బంది ఉండదు.
జాజ్ కంటే ఎక్కువ డైమెన్షన్స్
WR-V కారు ఇది ఆధారపడే జాజ్ హాచ్బ్యాక్ కంటే ఎక్కువ వీల్‌బేస్ ని (జాజ్ = 2,530 మిమీ, WR-V = 2,555 మిమీ) కలిగి ఉంది.హోండా బ్రెజిల్ యొక్క అధికారిక ప్రకటన ప్రకారం, వెడల్పు మరియు ఎత్తు కూడా వరుసగా 1,730mm మరియు 1,600mm జాజ్ కంటే ఎక్కువే ఉన్నాయి. బ్రెజిల్-స్పెక్ WR-V అనేది 4m పొడవులో ఉంటుంది, హోండా ఇండియా కారు కూడా అదే పొడవులో ఉంటుంది, అయితే అలా ఉంచేందుకు చాలా కష్టపడ్డారు.
హోండా WR-V పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు దీనిని ఏ ధర లో కొనుగోలు చేయాలనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి!
0 out of 0 found this helpful