విడుదలకి ముందే ఆన్ؚలైన్ؚలో లీక్ అయిన 2024 Renault Duster చిత్రాలు
నవంబర్ 29, 2023 02:27 pm rohit ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో 2025లో విడుదల అవుతుందని అంచనా, దీని ధరలు సుమారు రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది
-
రెనాల్ట్ బడ్జెట్-ఓరియెంటెడ్ గ్లోబల్ బ్రాండ్, డాసియా, కొత్త డస్టర్ؚను నవంబర్ 20 తేదీన ఆవిష్కరించనుంది.
-
Y-ఆకారపు LED DRLలు మరియు నాజూకైన గ్రిల్ؚతో సహా బిగ్ؚస్టర్ కాన్సెప్ట్ؚకి సారూప్యమైన డిజైన్ؚను కలిగి ఉంటుంది.
-
దీనిలో ఉన్న ఫీచర్లలో బహుళ డిస్ప్లేలు, వెంటిలేటెడ్ సీట్లు మరియు బహుశా ADAS కూడా ఉండవచ్చు.
-
అంతర్జాతీయ-స్పెక్ మోడల్ؚలో మూడు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉంటాయి; ఇండియా-స్పెక్ పవర్ؚట్రెయిన్ వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు.
-
భారతదేశంలో కేవలం మొదటి-జెన్ రెనాల్ట్ డస్టర్ؚను మాత్రమే విడుదలయింది, 2022 ప్రారంభంలో ఇది నిలిపివేయబడింది.
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ నవంబర్ 20 తేదీన ఆవిష్కరించబడుతుందని అక్టోబర్ 2023 చివరిలో నిర్ధారణ అయింది. ఈ SUVని రెనాల్ట్ బడ్జెట్-ఓరియెంటెడ్ గ్లోబల్ బ్రాండ్, డాసియా, పోర్చుగల్ؚలో విడుదల చేస్తుంది.. అధికారిక విడుదల కోసం వేచి ఉండగా, కొత్త డస్టర్ చిత్రాలు ఇప్పటికే ఆన్ؚలైన్ؚలో లీక్ అయ్యాయి. రెనాల్ట్ కేవలం మొదటి-జెన్ డస్టర్ؚను భారతదేశంలో 2012 లో విడుదల చేసింది మరియు 2022 ప్రారంభంలో నిలిపివేసింది. భారతదేశంలో కాంపాక్ట్ SUV విభాగం అభివృద్ధికి దోహదపడిన మొదటి మోడళ్లలో అది కూడా ఒకటి.
బయట వైపు ఎలా కనిపిస్తోంది?
లీక్ అయిన టీజర్ؚలో SUV తన పూర్తి ప్రత్యేకతలతో కనిపించింది, ఇది బిగ్ؚస్టర్ కాన్సెప్ట్ నుండి డిజైన్ ప్రేరణను పొందింది అనేది స్పష్టం. కొత్త డస్టర్ నేమ్ؚప్లేట్ؚకు సంబంధించి బాక్సీ కొలతలను నిలుపుకుంది, ఇవి కారు తయారీదారు సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ؚకు అనుగుణంగా ఉన్నాయి. ముందు వైపు, Y-ఆకారపు LED DRLలతో ఇది నాజూకైన LED హెడ్ؚలైట్ సెటప్ؚను మరియు ఫాగ్ ల్యాంప్ؚలతో భారీ ఎయిర్ డ్యామ్ؚను కలిగి ఉంది.
దీని ప్రొఫైల్ؚలో ఆకట్టునేవి స్క్వేర్ ఆకారంలో ఉండే వీల్ ఆర్చ్ؚలు, రూఫ్ రెయిల్ؚలు మరియు డ్యూయల్-టోన్ అలాయ్ వీల్ؚలు. పూర్తి డిజైన్ؚకు బాడీ క్లాడింగ్ మరింత ధృఢత్వాన్ని అందిస్తుంది. భారీ రేర్ స్కిడ్ ప్లేట్ మరియు Y-ఆకారపు సిగ్నేచర్ LED టెయిల్ లైట్ؚలతో డిజైన్ మార్పులను సంపూర్ణం చేస్తాయి.
ఇంటీరియర్ మరియు ఫీచర్లు
టీజర్ లో కొత్త డస్టర్ క్యాబిన్ؚ వివరంగా కనిపించకపోయినా, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేؚను చూడవచ్చు. ఆశిస్తున్న ఇతర ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్, పనోరమిక్ టచ్ؚస్క్రీన్ సిస్టమ్, పనోరమిక్ సన్ؚరూఫ్ మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ ఉండవచ్చు.
దీని భద్రతా కిట్ؚలో బహుళ ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు బహుశా అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚల (ADAS) స్యూట్ కూడా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: క్యాలెండర్ ఇయర్ ముగింపులో కొత్త కారును కొనడంలో ఉండే అన్ని లాభాలు మరియు నష్టాలు
ప్లాట్ؚఫార్మ్ మరియు పవర్ؚట్రెయిన్ వివరాలు
మూడవ-జెన్ డస్టర్, రెండవ-జెన్ యూరోప్-స్పెక్ Capturలాగే, కొత్త CMF-B ప్లాట్ؚఫార్మ్ పై ఆధారపడుతుంది – ఇది ఇంటర్నల్ కంబూషన్ ఇంజన్ؚలు (ICE) మరియు EV పవర్ టెయిన్ؚలు రెండిటికీ తగినది. కొత్త డస్టర్ మూడు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుందని రిపోర్ట్ చేయబడింది: అవి 110 PS 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ హైబ్రిడ్ ఇంజన్ (120 PS మరియు 140 PS మధ్య విడుదల చేసే), మరియు 170 PS 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ؚలు గ్లోబల్-స్పెక్ డస్టర్ పై ఆధారపడతాయి, మన మార్కెట్ కోసం ఏ పవర్ ట్రెయిన్ కాంబోను రెనాల్ట్ ఎంచుకుంటుందో చూడవలసి ఉంది.
విడుదల మరియు ధర
మూడవ-జెన్ రెనాల్ట్ డస్టర్ 2025లో భారతదేశంలోకి ప్రవేశించవచ్చు. దీని ధరలు రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ వంటి వాటితో పోటీ పడుతుంది.