2021 వోక్స్వ్యాగన్ టైగన్ వెల్లడి, ఇది హ్యుందాయ్ క్రెటా & కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది
వోక్స్వాగన్ టైగన్ కోసం dhruv ద్వారా ఫిబ్రవరి 10, 2020 03:37 pm సవరించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వోక్స్వ్యాగన్ తన భారీగా స్థానికీకరించిన, సరికొత్త మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన కాంపాక్ట్ SUV ని వెళ్ళడించింది
- సమీప-ప్రొడక్షన్ మోడల్ చైనా-స్పెక్ T-క్రాస్‌తో సమానంగా కనిపిస్తుంది.
- ప్రొడక్షన్-స్పెక్ SUV ని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ తో ఉంటుందని ఆశిస్తున్నాము.
- ఇది 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ DSG తో లభిస్తుంది.
- వోక్స్వ్యాగన్ పనోరమిక్ సన్‌రూఫ్, 9.2-ఇంచ్ టచ్‌స్క్రీన్ మరియు 10.25 పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలను అందించే అవకాశం ఉంది.
- దీని ధర రూ .10 లక్షల నుండి 16 లక్షల బ్రాకెట్‌లో ఉంటుందని ఆశిస్తున్నాము.
- దీని ప్రారంభం 2021 మొదటి భాగంలో జరుగుతుంది.
జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటివారికి ప్రత్యర్థిగా ఉండే కాంపాక్ట్ SUV టైగన్ ని రాబోయే ఆటో ఎక్స్‌పో 2020 కి ముందు జరిగిన ఒక మీడియా కార్యక్రమంలో వెల్లడించింది. మేము ఊహించినట్లుగా, భారతదేశం కోసం VW కాంపాక్ట్ SUV, చైనా-స్పెక్ T-క్రాస్ కి సమానంగా ఉంటుంది , ఇది దాని బ్రెజిల్-స్పెక్ నేమ్‌సేక్ యొక్క మరింత కఠినమైన వెర్షన్ అని చెప్పవచ్చు. యాదృచ్ఛికంగా, ఆటో ఎక్స్‌పో 2014 లో ప్రదర్శించిన సబ్ కాంపాక్ట్ SUV కాన్సెప్ట్ కోసం VW మొదట ‘టైగన్’ పేరును ఉపయోగించింది.
టైగన్ MQB A0-IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఇది VW గ్రూప్ భారతదేశం కోసం స్థానికీకరించబడింది. ప్రొడక్షన్-స్పెక్ మోడల్ కొత్తగా, స్థానికంగా తయారైన 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 115Ps గరిష్ట పవర్ ని మరియు 200 Nm పీక్ టార్క్ ని అందిస్తుంది. అలాగే 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉంది.
VW గ్రూప్ BS 6 యుగంలో డీజిల్ ఇంజిన్లను తొలగిద్దామని యోచిస్తున్నందున, టైగన్ కూడా డీజిల్ ఇంజన్ ని పొందదు. అయితే, ఇక్కడ SUV లాంచ్ అయినప్పుడు CNG వేరియంట్ ను భారత్ కు తీసుకురావడానికి బ్రాండ్ కృషి చేస్తోంది.
వోక్స్వ్యాగన్ ప్రొడక్షన్ కి దగ్గరగా ఉన్న టైగన్ కి LED హెడ్ల్యాంప్స్ మరియు టైల్లంప్స్ మరియు పెద్ద మెషిన్-ఫినిష్ వీల్స్ ఇచ్చింది. 10.25-ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఆల్-డిజిటల్ ఉంటుంది, ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 9.2- ఇంచ్ టచ్‌స్క్రీన్‌ను పూర్తి చేస్తుంది.
టైగన్ ఇంకా భారత మార్కెట్ కోసం మాత్రమే వెల్లడి చేయబడింది మరియు స్కోడా విజన్ IN- ఆధారిత SUV అదే సమయంలో 2021 మొదటి భాగంలో ప్రారంభించబడుతుంది. లాంచ్ అయినప్పుడు, ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు రాబోయే స్కోడా కాంపాక్ట్ SUV వంటి వాటికి ప్రత్యర్థి అవుతుంది. వోక్స్వ్యాగన్ రూ .10 లక్షల నుండి 16 లక్షల బ్రాకెట్లలో ధరని కలిగి ఉంటుందని భావిస్తున్నాము.
మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా డీజిల్
0 out of 0 found this helpful