2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్: వేరియంట్స్ వివరణ

published on ఏప్రిల్ 20, 2019 12:15 pm by cardekho కోసం హ్యుందాయ్ క్రెటా 2015-2020

 • 16 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Hyundai Creta Variants Explained

హ్యుందాయ్ ఇటీవలే భారతదేశంలో ఎదురుచూస్తున్న క్రెటా ఫేస్లిఫ్ట్ ని ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 9.43 లక్షల నుంచి ప్రారంభమయ్యి రూ. 15.03 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వెళ్తుంది. ప్రీ-ఫేస్లిఫ్ట్ వెర్షన్ తో పోల్చితే కొత్త క్రెటా లో చాలా మార్పులు ఏమీ జరగలేదు; అయితే, ఇది ముందు కంటే మెరుగైనదిగా అమర్చబడినది మరియు మీరు ఇప్పటికే కొత్త క్రెటా ను కొనుగోలు చేసుకొనేందుకు ప్రణాళిక వేసుకుంటున్నారా మరియు ఏ వేరియంట్ కోసం వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా, ఇక్కడ చదవండి.

Hyundai Creta

హ్యుందాయ్ క్రెటా E

క్రెటా యొక్క బేస్ E వేరియంట్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే అందుబాటులో ఉంది.

లక్షణాలు

 •  డ్యుయల్  ఫ్రంట్ ఎయిర్ బాగ్స్
 • EBD తో ABS
 • నాలుగు పవర్ విండోస్
 • ప్రీ టెన్షనర్లతో ఉన్న ఫ్రంట్ సీట్ బెల్ట్

Hyundai Creta

 • వెనుక వెంట్లతో మాన్యువల్ AC
 • టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్
 •  హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
 •  డే/నైట్ IRVM
 •  నాన్- అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్లు

Hyundai Creta

 • స్టోరేజ్ తో ఫ్రంట్ ఆరంరెస్ట్ స్లైడింగ్

​​​​​​​

కొనుగోలు చేసుకోడానికి ఏది విలువైనది?

ఎవరైతే టైట్ బడ్జెట్ లో ఉండి మాకు క్రెటా కావాలనుకుంటారో వారికి ఈ వేరియంట్. ఈ వేరియంట్ లో, క్రెటా కనిష్ట లక్షణాలను పొందుతుంది మరియు దానివలన దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో కూడిన కారులా అనిపించదు. ఇది ఒక మ్యూజిక్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs వంటి కొన్ని చాలా ప్రాథమిక లక్షణాలను కోల్పోతుంది. ఈ వేరియంట్ కరెక్ట్ బడ్జెట్ లో  పెట్రోల్ క్రేటా కావాలనుకొనే వారికి మరియు వాళ్ళే డ్రైవింగ్ చేయాలనుకుంటారో వారికి బాగుంటుందని చెప్పవచ్చు.  

హ్యుందాయ్ క్రెటా E +

క్రెటా యొక్క E + వేరియంట్ 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ తో లభిస్తుంది.

ధర వ్యత్యాసం: E (పెట్రోల్) పై రూ. 56,000 ఎక్కువ ధర కలిగి ఉంది.

ఫీచర్స్ (E వేరియంట్ పైన కలిగి ఉండేవి)  

Hyundai Creta

 • టర్న్ సూచికలతో ఎలక్ట్రానిక్ సర్దుబాటు ORVM లు
 •  బ్లూటూత్ తో 5-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (పెట్రోల్ మాత్రమే)
 • స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ (పెట్రోల్ మాత్రమే)
 • 4 స్పీకర్లు (డీజిల్ లో కూడా)
 • హ్యుందాయ్ iబ్లూ (పెట్రోల్ మాత్రమే)

​​​​​​​

కొనుగోలు చేసేందుకు ఏది విలువైనది

మీరు టైట్ బడ్జెట్ లో పెట్రోల్ ఇంజన్ క్రెటా కోసం చూస్తున్నారా, అయితే బేస్ E వేరియంట్ కోసం వెళ్లి మంచి ఆడియో సిస్టమ్ ను తరువాత పొందవచ్చు అని మేము మీకు సూచిస్తాము. హ్యుందాయ్ E వేరియంట్ పైన  E + కి ఉన్న అధిక ధర(పెట్రోల్ కోసం) వసూలు చేయడం సమర్ధించదగినది కాదు. అయితే, మీరు డీజిల్ క్రెటా కావాలనుకుంటే మరియు సరైన బడ్జెట్ లో ఉంటే, మీకు ఇక్కడ ఆప్షన్ లేదు. ఇది ఇప్పటికీ కూడా ఈ విభాగంలో మరియు ఈ ధరల శ్రేణిలోని ఉండే కార్లు ప్రాథమికంగా ఎటువంటి లక్షణాలను అందిస్తాయని భావిస్తామో అటువంటి అనేక లక్షణాలను కోల్పోతుందని మేము నమ్ముతున్నాము.   

హ్యుందాయ్ క్రెటా S

క్రెటా యొక్క S వేరియంట్ 1.4-లీటర్ డీజిల్ (MT) ఇంజిన్ మరియు 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ (AT) తో అందుబాటులో ఉంటుంది.

ధర తేడా:

క్రెటా E+ డీజిల్ మీద రూ. 1.74 లక్షలు ధర ఎక్కువ, డీజిల్ ఆధారిత క్రెటా S MT(1.4) మరియు S AT(1.6) మీద రూ.1.56 లక్షలు ధర ఎక్కువ ఉంటుంది.

ఫీచర్స్ (E + వేరియంట్ పై)

 • రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు డైనమిక్ గైడ్ లైన్స్ తో కెమెరా

​​​​​​​Hyundai Creta

 • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
 • వెనుక డీఫాగర్
 • అలాయ్ వీల్స్ (16-అంగుళాలు)
 • LED DRLs
 • బ్లూటూత్ మరియు స్టీరింగ్-మౌంట్ నియంత్రణలతో 5 అంగుళాల టచ్‌స్క్రీన్  ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్

​​​​​​​Hyundai Creta

 • రూఫ్ రెయిల్స్
 •  కప్ హోల్డర్స తో వెనుక ఆరంరెస్ట్
 • రేర్ పవర్ అవుట్లెట్
 • రేర్ పార్సెల్ ట్రే
 • రేర్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ లు

​​​​​​​

కొనుగోలు చేసుకొనేందుకు ఏది విలువైనది?

మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ తో శక్తిని ఇవ్వబడిన  క్రేటా S వేరియంట్ మీరు ఎక్కువగా డ్రైవరుచే కారు నడిపించుకోవాలనుకొని అనుకున్నా మరియు ఎక్కువగా ట్రావెల్ చేయాలనుకుంటే మీరు దీనిని తీసుకోవచ్చు. మునుపటి వేరియంట్స్ మీద అధనంగా ఉండే అధనపు లక్షణాలు  అడ్జస్టబుల్ వెనుక హెడ్ రెస్ట్, వెనుక పవర్ అవుట్లెట్ మరియు ఆరంరెస్ట్ వంటి లక్షణాలు పొందడం ద్వారా మీరు వెనుక సీటులో బాగా స్థిరపడి కూర్చోవచ్చు. అయితే, ధర వ్యత్యాసం రూ.1.74 లక్షలు (క్రెటా E + (1.4) కంటే) అదనపు లక్షణాల కోసం వసూల్ చేయబడుతుంది.

మీరు ఎక్కువగా మీరే కారు డ్రైవింగ్ చేయాలనుకుని అనుకున్నా మరియు  డీజిల్-ఆటో కలయిక కావాలనుకుంటే, క్రెటా S (1.6 D) అనేది అత్యంత సరసమైన మోడల్.  ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో 1.4 డీజిల్ మీద అధనంగా రూ. 1.56 లక్షలు ధరను చెల్లించాలి, ఇది చాలా న్యాయమైన ధర.

హ్యుందాయ్ క్రెటా SX

Hyundai Creta

అందించే ఇంజన్లు: 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్

ధర తేడా (పెట్రోలు): క్రెటా  E + పెట్రోల్ మీద రూ. 1.94 లక్షలు ధర ఎక్కువ || SX(మాన్యువల్) మీద SX(ఆటో) రూ. 1.6 లక్షలు ఎక్కువ

ధర తేడా (డీజిల్): క్రెటా S డీజిల్ మీద రూ. 1.50 లక్షలు ఎక్కువ || SX (మాన్యువల్) మీద SX (ఆటో) రూ .1.5 లక్షలు ఎక్కువ క్రెటా S AT మరియు క్రెటా SX AT మధ్య ధర వ్యత్యాసం రూ. 1.64 లక్షలు

ఫీచర్స్ (S పైగా అందించబడేవి)

Hyundai Creta

 •  ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్
 •  కార్నరింగ్ ల్యాంప్స్

​​​​​​​Hyundai Creta

 •  క్రూజ్ నియంత్రణ
 •  పుష్ బటన్ స్టార్ట్

​​​​​​​Hyundai Creta

 • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
 •  ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVMs

​​​​​​​Hyundai Creta

 • ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆర్కేంస్ సౌండ్ తో 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్  
 • 60:40 స్ప్లిట్ సీట్లు (ఆటోమేటిక్ లో మాత్రమే)
 • ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ (ఆటోమేటిక్ లో మాత్రమే)
 • 17-ఇంచ్ అలాయ్స్(ఆటోమేటిక్ లో మాత్రమే)

​​​​​​​Hyundai Creta

 •  ఎలక్ట్రిక్ సన్రూఫ్ (ఆటోమేటిక్ మాత్రమే)

​​​​​​​

కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?

ధరల పెరుగుదల ఎక్కువ ఉన్నప్పటికీ, ఇది క్రెటా శ్రేణిలో అత్యంత జనాదరణ పొందిన వేరియంట్స్ లో ఒకటిగా పరిగణించబడుతుంది, ఇది పూర్తి ప్యాకేజిగా ఉందని భావించబడుతుంది. మీరు ఆటోమేటిక్ కోసం చూస్తున్నట్లయితే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది టాప్-స్పెక్ SX (O) వేరియంట్లో అందుబాటులో లేనందున ఇది మీకు ఉత్తమమైనది. అయితే, మీరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కోసం చూస్తున్నట్లయితే మీకు SX (O) వేరియంట్ కోసం వెళ్ళమని మేము సూచిస్తాము.

గమనిక :

 రెండు ఆటోమేటిక్ వేరియంట్స్ ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ మరియు 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, టాప్-స్పెక్ SX (O) వేరియంట్ లో  కూడా ఇవ్వని లక్షణాలను పొందుతాయి.

హ్యుందాయ్ క్రెటా SX (డ్యూయల్ టోన్):

Hyundai Creta

SX పై ధర వ్యత్యాసం: పెట్రోల్ మరియు డీజిల్ రెండింటికీ రూ .50,000

ఫీచర్స్ (SX పైగా అందించబడేవి)

 • 17-అంగుళాల అలాయ్స్
 •  బ్లాకెడ్ అవుట్ రూఫ్
 •  కలర్-కోడెడ్ హైలైట్లతో అంతా నల్లని క్యాబిన్
 • ఇది రెండు రంగు కాంబినేషన్లలో మాత్రమే లభిస్తుంది: ఫాంటమ్ బ్లాక్ తో పోలార్ వైట్
 • మరియు ఫాంటమ్ బ్లాక్ తో పాషన్ ఆరంజ్

​​​​​​​

కొనుగోలు చేసుకొనేందుకు సరైనదా?

ఎవరికైతే కొత్త వీల్స్ అని చూపించుకోవాలని ఉంటుందో వారికి SX డ్యుయల్ టోన్ వేరియంట్ సరిగ్గా సరిపోతుంది. ఇది ఆచరణాత్మకత మరియు లగ్జరీ యొక్క సరైన మిశ్రమాన్ని కలిగి ఉంది, మరియు అందరూ దానిని చూసే విధంగా అదనపు అందం పొందుతుంది. అంతేకాకుండా, ఇంటీరియర్ ప్యాక్ హ్యుందాయ్ SUV యొక్క క్యాబిన్ కి అధనపు అందం జోడిస్తుంది.

హ్యుందాయి క్రెటాSX(O)

SX పై ధర వ్యత్యాసం: పెట్రోల్ కి రూ.1.6 లక్షల రూపాయలు మరియు డీజిల్ కి రూ. 1.8 లక్షలు

అందించబడే ఇంజన్లు: 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.6 లీటర్ డీజిల్

ఫీచర్స్ (SX పైగా అందించబడేవి)

Hyundai Creta

 • సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్
 • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
 •  వెహికెల్ స్టెబిలిటీ మేనెజ్మెంట్ కంట్రోల్
 • హిల్ లాంచ్ అసిస్ట్
 • 17-అంగుళాల అలాయ్స్
 • ఆటో- డిమ్మింగ్ IRVM

​​​​​​​Hyundai Creta

 • ఎలక్ట్రిక్ సన్రూఫ్
 • లెదర్ సీట్లు
 • లేన్ చేంజ్ ఫ్లాష్ అడ్జస్ట్మెంట్
 • 6- వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

​​​​​​​Hyundai Creta

 •  స్మార్ట్ కీ బ్యాండ్
 •  వైర్లెస్ మొబైల్ ఛార్జర్

​​​​​​​

కొనుగోలు చేసుకొనేందుకు సరైనదా?

SX (O) అనేది క్రెటా యొక్క పూర్తిగా లోడ్ చేయబడిన,టాప్-లైన్-వేరియంట్ మరియు ముఖ్యమైన భద్రతా లక్షణాలతో సహా పలు లక్షణాలను పొందుతుంది. ఈ లక్షణాల కోసం 1.5 లక్షల రూపాయల అధనపు ప్రీమియం ఖచ్చితంగా సమర్థించబడుతోంది. కాబట్టి, మీరు అదనపు ఖర్చు కోసం పట్టించుకోకపోతే, మేము అధిక స్థాయిలో అందించే భద్రత మరియు లక్షణాలను పరిగణలోకి తీసుకొని ఈ వేరియంట్ కోసం వెళ్ళమని సూచిస్తాము.

Hyundai Creta

పెట్రోల్

డీజిల్

E రూ. 9.43 లక్షలు

అందుబాటులో లేదు

E+ రూ. 9.99 లక్షలు

1.4L E+ రూ. 9.99 లక్షలు

NA

1.4L S రూ. 11.73 లక్షలు

NA

1.6L S AT రూ. 13.19 లక్షలు

SX రూ.11.93 లక్షలు

1.6L SX రూ. 13.23 లక్షలు

SX (డ్యుయల్ టోన్) రూ.12.43 లక్షలు

1.6L SX (డ్యుయల్ టోన్) రూ.13.73 లక్షలు

SX AT రూ.13.43 లక్షలు

1.6L SX AT రూ.14.83 లక్షలు

SX(O) రూ. 13.59 లక్షలు

1.6L SX(O) 15.03 లక్షలు

     

ఇంజన్

1.6- లీటర్

1.4- లీటర్

1.6- లీటర్

పవర్

123PS

90PS

128PS

టార్క్

151Nm

219Nm

259Nm

ట్రాన్స్మిషన్

6MT/6AT

6MT

6MT/6AT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2015-2020

Read Full News

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

 • లేటెస్ట్
 • ఉపకమింగ్
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience