• English
  • Login / Register

2015 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ రేపే ప్రారంభం

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం raunak ద్వారా అక్టోబర్ 09, 2015 12:54 pm ప్రచురించబడింది

  • 11 Views
  • 3 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

సియాజ్ వలె, ఎర్టిగా  ఎస్ హెచ్విఎస్  తేలికపాటి హైబ్రిడ్ టెక్ ని ఇంధన సామర్ధ్యం మెరుగుపరిచేందుకు కలిగి ఉంటుందని ఊహిస్తున్నాము.   

మారుతి సుజికి రేపు ఎర్టిగా ఫేస్లిఫ్ట్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫేస్లిఫ్ట్ మోడల్ గైకొండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షో (జి ఐఐఎ ఎస్) లో ఆగస్టు 20 న తన మొదటి ప్రపంచ ప్రదర్శన చేసింది. ఈ నవీకరించబడిన ఎర్టిగా తాజా బాహ్య స్వరూపాలతో మరియు ఊహించిన యాంత్రిక నవీకరణలతో పాటు కొత్త లక్షణాలతో వస్తోంది. దీని ధరలు ఎక్కువగా ఉండవచ్చని అంచనా.   

మార్పులు గురించి మాట్లాడుకుంటే,  పునఃరూపకల్పన చేయబడిన ముందరి బంపర్ లో క్రోం చేరికలు కలిగిన ఫాగ్ ల్యాంప్స్ తో పాటూ, మూడు స్లాట్ల క్రోమ్ గ్రిల్ అందించబడుతుంది. అలానే, బోనెట్ సూక్ష్మమైన మార్పులతో అందించబడుతున్నది. దీని వెనుక ప్రొఫైల్ ఎర్టిగా నేం క్రోం స్ట్రిప్ తో మరియు టెయిల్ లైట్స్ మధ్య ఒక జత రిఫ్లెక్టర్స్ తో అందించబడుతున్నది.  

లోపలివైపు, ఎర్టిగా వాహనం  పుష్ బటన్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్, విద్యుత్ తో మడత వేయగల బయట వెనుక వీక్షణ అద్దాలు మరియు కొత్త అపోలిస్ట్రీ మొదలైనటువంటి స్విఫ్ట్ మరియు డిజైర్ ని పోలినటువంటి మార్పులను కలిగి ఉంది. పోటీని దృష్టిలో ఉంచుకుని, సంస్థ  7 అంగుళాల టచ్స్క్రీన్ స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థను కూడా ఫేస్లిఫ్ట్ ఎర్టిగా లో అందించింది. అంతేకాక, 50:50 మడతవేయగల సీట్లను ఇండోనేషియన్ ఎర్టిగా నుండి భారత వెర్షన్ లోనికి తీసుకురావడం జరిగింది.    


ఇంజిన్లు పరంగా, ఎర్టిగా ఫేస్లిఫ్ట్ 1.4 లీటర్ కె14బి పెట్రోల్ మరియు  1.3 లీటర్ DDiS200 ఇంజిన్ ని అందిస్తుంది. అయితే, 1.3 లీటర్ DDiSఇంజిన్ సుజికి యొక్క స్మార్ట్ హైబ్రిడ్ వాహనం సిస్టమ్ ని మరియు  బ్రేక్ ఎనర్జీ పునరుత్పత్తిని కలిగి ఉండవచ్చు. డీజిల్ ఇంధన సామర్ధ్యం ఔట్గోయింగ్ మోడల్ నుండి ఎస్ హెచ్విఎస్ ని తీసుకుంటే గనుక 20.77kmpl అందించవచ్చు. ఈ ఫేస్లిఫ్ట్ లో పెట్రోల్ ఇంజిన్ ఒక  ఆటోమేటిక్ ఎంపికను కూడా పొందవచ్చు. భద్రత పరంగా, మారుతి ఎర్టిగా లో ఎయిర్బ్యాగ్స్ ప్రామాణికంగా ఉండే అవకాశం ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience