టాటా టియాగో మారుపేరు జికా: ఫస్ట్ డ్రైవ్ నిపుణుల సమీక్ష

Published On మే 14, 2019 By abhishek for టాటా టియాగో 2015-2019

టాటా టియాగో యొక్క మొదటి డ్రైవ్ చూడండి

ఇది కైట్ అని పిలవబడేది, కానీ టాటా చివరకు దీనిని కొత్త జికా మారుపేరుగా  టియాగోగా విడుదల చేసింది. దీని పేరు మాత్రమే మార్చబడి ఉండవచ్చు, అమ్మకం విషయానికి వస్తే టాటా ఇప్పటికీ ఈ కారు అమ్మకాల పరంగా ఆకాశంలోకి ఎక్కుతుందని ఆశిస్తుంది. ఈ టియాగో ని మేము ఇది ఏమిటి అందిస్తుందో మీకు తెలియజేయడానికి గోవా వీధుల్లో తిప్పడానికి తీసుకెళ్ళాము  పదండి చూద్దాము.

Tata Zica

పోటీ అనేది  ప్రతి ఒక్కరినీ వారి కాలిపై ఉండేలా చేస్తుంది. మొత్తంగా ఇక్కడ విషయం ఏమిటంటే ఒకదానితో ఒకటి అన్ని వేళలా పోటీ పడేందుకు ఎప్పుడూ విషయాలు వేడి వేడిగా ఉండేలా చేస్తుంది మరియు నిశ్శందేహంగా వినియోగదారులు ఎంచుకోవడానికి విస్తృత వేదిక ఇస్తుంది. కొత్త టాటా టియాగో విషయంలో ఇది కేవలం మూడు సంవత్సరాలలో రహదారులపై ఉంచడానికి ప్రయత్నం చేసింది. మార్కెట్ లో జెస్ట్ మరియు బోల్ట్ తో ఇప్పుడు, టాటా బ్రాండ్ పై వినియోగదారుల యొక్క ఆసక్తిని తిరిగి కలిగించేందుకు టాటా సంస్థ ఏదో ఒకటి చేయడం అవసరం. కైట్ కొంతకాలం నుండి రహస్యంగా తిరుగుతూ అందరి కంట్లో పడింది మరియు చివరికి ఇప్పుడు బయట పడింది.

Tata Zica

టియోగో మారుతి సెలెరియో మరియు హ్యుందాయ్ గ్రాండ్ i10 లతో తలపడుతోంది, అయితే సెలేరియో మరియు గ్రాండ్ i10 యొక్క ధరల మధ్య దూరం గనుక మీరు చూసినట్లయితే చాలా గణనీయంగా ఉన్నాయి. ఈ రెండు అంతరాళాలను ఉత్తమంగా అందించే లక్ష్యంతో టియాగో ఈ ధర మధ్య ఉన్న గ్యాప్ ని నింపబోతుందని మేము భావిస్తున్నాము. మేము మరొక రోజు కోసం వీటి మధ్య పోలికలను పోల్చి చూడడాన్ని ఉంచాము, ఇప్పుడు అయితే టియాగో గురించి చూద్దాము పదండి.

డిజైన్

Tata Zica Grille

రహస్యంగా బయటపడిన కొన్ని షాట్స్ కి ధన్యవాధాలు తెలుపుకోవాలి, ప్రపంచానికి ఇప్పటికే రాబోయేది ఏమిటో తెలుసు మరియు మేము ఏమిటి అయితే చూశామో అది మాకు బాగా నచ్చింది కూడా. మేము దానిని పూర్తిగా అంతరికంగా చూసాక మేము దానిని మరింతగా ఇష్టపడ్డాము. బోల్ట్ వంటి అన్ని కొత్త ఉత్పత్తులతో కూడా, టాటా రూపకల్పనకు సంబంధించినంత వరకు కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మంచిదిగా కనిపించినప్పటికీ, పోటీలో నిలబడటానికి ఇది ఇప్పటికీ చాలా ఇండికా విస్టాలో లాగా ఉంటుంది. టాటాకు ఇది తెలుసు, కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయాలని కోరుకోలేదు మరియు దాని ఫలితంగా డిజైన్ కోసం బాగా కష్టపడి దృష్టి పెట్టింది. ఇది పూనే, UK మరియు ఇటాలియన్ స్టూడియోల నుండి వచ్చిన సమాచారం.

Tata Zica Headlamp

మొదటి చూపులో టియాగో ఒక టాటా ఉత్పత్తిగా గుర్తింపు పొందడం కష్టమవుతుంది. స్మార్ట్ హెక్సాగొనల్ గ్రిల్ మీద మీరు బోల్డ్ కొత్త త్రీ-డైమెన్ష్నల్ ‘T’ లోగోను గమనించినప్పుడు మాత్రమే అది టాటా అని మీరు నమ్ముతారు. ఈ డిజైన్ పెద్ద స్వెప్ట్ బ్యాక్ హెడ్‌లైట్స్ తో మరింతగా మెరుగుపడింది అని చెప్పవచ్చు, దీనితో టియాగోకు నమ్మకమైన ముఖ భాగం వచ్చింది. ప్రక్క భాగాలలో కూడా మంచి  క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి, దీని వలన ప్రక్క భాగం మరింత ఆసక్తికరంగా మారింది. వెనుక భాగం కూడా పదునైన టెయిల్ ల్యాంప్స్ తో చాలా స్మార్ట్ కనిపిస్తుంది. స్పాయిలర్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన స్పాయిలర్ స్పాట్స్ తో స్పాయిలర్ కి ఇరువైపులా చూడడానికి చక్కగా ఉంది. మొత్తమ్మీద టియాగో చాలా బాగుంది మరియు టాటా నుంచి కొత్త డిజైన్ ధోరణిగా కనిపిస్తుంది. మేము ఖచ్చితంగా అది కనిపించే విధానాన్ని ఇష్టపడతాము.

Tata Zica Spoiler

లోపల భాగాలు

Tata Zica Interiors

బాహ్యరంగులు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నప్పుడు, ఇంటీరియర్స్ ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించిన అంశాలని అనుకుందామని టాటా చాలా చేసిందని చెప్పాలి. క్యాబిన్ లోనికి మీరు అడుగు పెట్టినపుడు ఈ మాట మీరే చెబుతారు. వెంటనే గమనించదగినది ఏమిటంటే డిజైన్ మరియు నాణ్యత చాలా పెంచినట్టు ఉంటుందని మీరు భావిస్తారు. టాటా మనకి ఏమి చెప్పిందంటే లేత గోధుమరంగుని ఇంటీరియర్స్ నుండి తొలగిస్తారని ప్రకటించింది మరియు ఇది ఒక మంచి పరిణామం అని మేము భావిస్తున్నాము. మీరు ఇప్పుడు మంచిగా కనిపించే బ్లాక్-గ్రే డ్యుయల్ టోన్ డాష్బోర్డ్ ని పొందుతారు. దీనిలో ప్లాస్టిక్స్ యొక్క నాణ్యత చాలా ఆకట్టుకొనే విధంగా ఉంటుంది మరియు టాటా ఇంటీరియర్స్ కోసం చాలా దూరం వెళ్ళింది. మీరు క్రోమ్ మరియు పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ వలన ఈ అంతర్భాగాలు అనేవి ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ క్రోం బిట్స్ అనేవి సాధారణంగా చాలా తక్కువ రకంలో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఈ కారు విషయానికి వస్తే అలా లేవు బాగుంటాయి.  

Tata Zica Center Console

సెంట్రల్ కన్సోల్ ఇక్కడ బోల్ట్ ఉన్నట్టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని అంటే మళ్లీ అదే హర్మాన్ ని కలిగి ఉంటుంది మరియు బ్లూటూత్ మరియు ఇతర కనెక్టివిటీలతోపాటు 8 స్పీకర్లను కలిగి ఉంది. ఇక్కడ ధైర్యంగా మనం ఏమిటి చెప్పవచ్చు అంటే ఈ వ్యవస్థ ఈ విభాగంలోనే ఉత్తమమైనది అనే కాదు దాని ఎగువ భాగంలో కంటే కూడా బాగుంటుంది.

Tata Zica Steering

స్టీరింగ్ వీల్, టెలిఫోనీ మరియు ఆడియో నియంత్రణలు మరియు గేర్ నాబ్ లను బోల్ట్ నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇన్స్టృమెంటల్ కన్సోల్ రెండు స్పోర్టీ పోడ్స్ ని కలిగి ఉంటుంది ఇది ఆక్సిలరేషన్ మరియు స్పీడ్ లను చూడడానికి ఉంటుంది, సెంటర్ MID బోల్ట్ కి పోలి ఉంటుంది.

ఈ సీట్లు హైట్ అడ్జస్టబుల్ మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ దీనిలో తొడ క్రింద మద్దతుని కూడా కలిగి ఉంటే బాగుండేది, దీనిని కొంచెం మిస్ అవుతున్నాము. టాటా నిల్వా స్థలాల విషయానికి వస్తే బాగా నిర్వహించిందని చెప్పవచ్చు. క్యాబిన్ లోపల దాదాపు 22 వినియోగ ఖాళీలతో, మీరు కారులో ఏదైనా మరియు ప్రతిదీ ఉంచడానికి మీకు ఒక మంచి ప్రదేశం ఉంది. దీనిలో బూట్ సామర్ధ్యం 240 లీటర్లు ఉంది, ఈ విభాగంలో ఇది చాలా విశాలవంతమైనదిగా ఉంది.

Tata Zica Seats

వెనక భాగానికి వస్తే, దీనిలో ముగ్గురు మనుషులు కూర్చోడానికి చాలా బాగుంటుంది. అయితే కొంచెం ఇరుక్కున్నట్టుగా ఉంటుంది కానీ, సగటు వయసు గల పెద్ద వారికి సౌకర్యంగా ఉండాలనుకుంటే మాత్రం టియాగో చాలా విస్తృతంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ తొడ క్రింద సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి, ఇది కొంచెం బాగుండుంటే చాలా బాగుండేది. మొత్తంగా చూస్తే టియాగో లోపల భాగంలో పుష్కలంగా మంచి పరికరాలని అందిస్తుంది, ఖరీదైనదిగా ఉంటుంది మరియు మంచి స్పేస్ ని అందిస్తుంది. టాటా ఇక్కడ మంచి పని నిర్వహించింది అని చెప్పవచ్చు.

ఇంజన్ మరియు పనితీరు

రెవెట్రాన్1.2L పెట్రోల్

రెవోట్రాన్ శ్రేణి నుండి రెండవ పెట్రోల్ ఇంజిన్ అయిన పెట్రోల్ ని మేము మొదట నడిపించాము.  1199CC మూడు సిలిండర్ ఇంజిన్ 85Ps పవర్ ని @ 6000rpm వద్ద మరియు 115Nm టార్క్ ని @ 3500rpm వద్ద అందిస్తుంది, ఇది గ్రాండ్ i10 కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు సెలేరియో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.  బోల్ట్ లాగా ఈ ఇంజిన్ కి టర్బోచార్జర్ లభించకపోయినా, నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ తక్కువ ఘర్షణకి వేరియబుల్ కామ్ టైమింగ్ తోడవ్వడం వలన మంచి పనితీరుని అందిస్తుంది అని చెప్పవచ్చు. ఇంజన్ ని మీరు ప్రారంభించండి మీకు ఈ 3-సిలెండర్ కి ఎలాగైతే శబ్ధం ఉంటుందో అది దీనిలో మిమంలని పలకరిస్తుంది, కానీ కానీ క్విడ్ లేదా సెలేరియో చెప్పిన దానికన్నా చాలా తక్కువగా ఉంది. దీనిలో క్లచ్ యాక్షన్ బాగా తేలికగా ఉంటుంది మరియు గేర్ త్రో అనేది చాలా బాగుంటుంది, మారుతీ లో ఉన్నట్టుగా వెంట వెంటనే గేర్ లు అయితే మారవు కానీ మీరు పిర్యాదు చేసేంత ఇబ్బంది అయితే పెట్టవు. 1012 కిలోల వద్ద, టియాగో చాలా సున్నితమైనది మరియు చాలా సరళంగా తిరుగుతుంది. 4000rpm దాటిన తరువాత ఈ ఇంజన్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పవచ్చు, కానీ ఇంకా దీనిని గట్టిగా మీరు లాగడానికి ప్రయత్నించాలి అంటే ఆ రివ్ నీడిల్ ని రెడ్ లిమిటర్ దగ్గరకి వచ్చేలా తీసుకెళ్ళవచ్చు. దీని డ్రైవబిలిటీ కూడా చాలా బాగుంటుంది, ఎత్తైన ప్రదేశాలలో, 3వ గేర్ లో కూడా చక్కగా వెళ్ళడం గమనించాము. ECO మోడ్ లో ఇంజిన్ ని ఉంచినట్లయితే మంచి సామర్థ్యం పొందడానికి ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ మీరు ఎల్లప్పుడూ మరింత పనితీరు కోసం నగరానికి తిరిగి మారవచ్చు. బోల్ట్ వలె కాకుండా, ఈ ఇంజిన్లకు స్పోర్ట్ మోడ్ అనేది కూడా ఉంటుంది. మేము ఇంజిన్ ఎంత మంచిదో చూడాలి మరియు అది ఎంత మంచి పనితీరుని అందిస్తుందో తెలుసుకోడానికి మేము దీనిని పరీక్షించడానికి వచ్చినప్పుడు తెలుస్తుంది.

రెవెటార్క్1.05L డీజిల్

Tata Zica

రెవోటార్క్యూ సీరీస్ నుండి ఇది మొదటి డీజిల్ ఇంజిన్. ఈ ఇంజన్ DOHC, సెంట్రల్ ఇంజెక్టర్లు, ఎలెక్ట్రానిక్ త్రోటిల్ నియంత్రణ వంటి వాటితో వస్తుంది మరియు 70Ps పవర్ @ 4000Rpm మరియు 1800-3000 Rpm మధ్య 140Nm టార్క్లను అందిస్తుంది. ఈ సంఖ్యలు 3-సిలిండర్ డీజిల్ కోసం ఆకట్టుకునే విధంగా ఉంటాయి మరియు కొంచెం కొత్తగా కూడా ఉంటాయి. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఇది కొంచెం నిబద్దతతో కూడా వెళుతుంది. పవర్ డెలివరీ చాలా సరళంగా ఉంటుంది,అది చాలా మంచి విషయం కానీ కొన్ని కొన్ని సార్లు మీరు డీజిల్ లో ఉన్న పవర్ ని చూడకపోవచ్చు. ప్రయాణికుడు పిర్యాదు చేసే విధంగా ఏమీ ఉండదు దీనిలో. డీజిల్ ఇంజన్ నగరంలో తిరగడానికి చాలా బాగుంటుంది మరియు మంచి మైలేజ్ ని అందిస్తుంది. దీనికిగానూ సిటీ మరియు ECO మోడ్స్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దీనికంటే ఎక్కువ ఆశించినట్లయితే మాత్రం మీరు నిరాశ చెందుతారు. ఇది అందించే సంఖ్యల బట్టి మంచి పనితీరు అందిస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే మేము దీనిని పరీక్షించి చూడాలి.

రైడ్ మరియు నిర్వహణ

డైనమిక్ ఫ్రంట్ విషయానికి వస్తే టియాగో కి కొత్త డ్యుయల్ పాత్ సస్పెన్షన్ ఉంటుంది, ఇది సమతుల్య రైడ్ మరియు నిర్వహణను అందించడానికి ట్యూన్ చేయబడింది. ePAS స్టీరింగ్ మంచిదనిపిస్తుంది మరియు చాలా తేలికైనది కాదు అలా అని చాలా భారీగా కూడా ఉండకుండా అధిక వేగంతో చాలా స్పూర్తినిస్తుంది. ఈ సస్పెన్షన్ అనేది కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ బంప్స్ లో బాగుంటుందని చెప్పవచ్చు. 130 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా కూడా, వెడల్పైన కార్నర్స్ లో టియాగో మరింత ఆత్మవిశ్వాసంతో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. మా డీజిల్ కారు యొక్క సస్పెన్షన్ అనేది గతకలలో ఉన్నప్పుడు కొంచెం శబ్ధన్ని అందిస్తుంది. డీజిల్ వేరియంట్లలో సస్పెన్షన్ క్రమాంకనం కొద్దిగా భిన్నంగా ఉంటుంది, దీనికి గానూ భారీ ఇంజన్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అది పక్కన పెడితే  బాగా అందంగా క్రమబద్ధీకరించబడింది.

తీర్పు

Tata Zica

మొత్తంగా టాటా యొక్క కైట్ ఎగిరే సమయం వచ్చింది మరియు టాటా దీనిపై ఎటువంటి రాళ్ళు విసరకుండా ఉండేలా జాగ్రత్త పడింది. స్టైలింగ్, ఇంటీరియర్స్, ఇంజిన్ మరియు పనితీరు మరియు విశ్వసనీయత నుండి ప్రతిదీ బాగా ఆలోచించి టాటా మంచి ఉత్ప్పత్తిని మనకి అందించింది. టియాగో వారికి అత్యంత ముఖ్యమైన ఉత్పత్తిగా ఉంటుందని టాటాకు తెలుసు మరియు అన్ని కోణాల్లో కూడా అది ఒక గేమ్ చేంజర్ గా ఉండాలని టాటా కోరుకుంటుంది. టాటా సంస్థ ఖచ్చితంగా బాగా కష్టపడింది మరియు అది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వారికి కావలసిందల్లా సరైన ధర ట్యాగ్ మరియు అమ్మకాలు తరువాత సర్వీస్, వీటి ద్వారా కైట్ మరింతగా అమ్మకాలు జరుగుతుంది.

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience