రెనాల్ట్ క్విడ్ ఫస్ట్ డ్రైవ్ సమీక్ష

Published On మే 13, 2019 By abhishek for రెనాల్ట్ క్విడ్ 2015-2019

భారతీయులు నాలుగు చక్రాల వాహనాన్ని బాగా ఇష్టపడతారు. ఇది మీ స్వంత ఆస్తి మాత్రమే కాదు, గర్వం మరియు సంతోషం కూడా. కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క గర్వం మరియు ఆనందం మారుతితో పంచుకొనేవారు. దశాబ్ధాల కాలం నుండి మారుతి 800, జెన్, ఆల్టో మరియు ఇటీవల ఆల్టో 800 /k10 ఇవన్నీ ఏవైతే కొత్త కారుని కొనుగోలు చేసుకుందామని చూస్తున్నారో వాళ్ళ ఇంటికి ఇవన్నీ చేరాయి. ఇక్కడ మారుతి సుజుకి తిరుగులేని నాయకుడిగా ఉన్న A-విభాగాన్ని శాసిస్తుందని చెప్పడంలో ఎటువంటి సంశయోక్తి లేదు మరియు భారతదేశంలో ఈ విభాగంలో జరిగే అమ్మకాలలో మొట్టమొదటది మారుతి. ఇప్పుడు 2020 నాటికి ప్రపంచపు మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ విఫణిగా మారుతుందని చెప్పి  ఫ్రెంచ్ తయారీసంస్థ రెనాల్ట్ పేర్కొంది. ఈ మార్కెట్ షేర్ లో పెద్ద మొత్తం తీసుకోవాలని భావిస్తుంది.దీని యొక్క విలాశవంతమైన కార్లు డస్టర్, ఫ్లూయెన్స్ మరియు కోలియోస్ వారి లైనప్ లో ఉన్నప్పటికీ అది సాధించడానికి ఒక కఠినమైన పని గా ఏమీ ఉండదు. ఈ రెనాల్ట్ యొక్క ఆశయం ఏదైతే ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో పెద్ద షేర్ ని తీసుకోవాలి అనుకుంటుందో దాని యొక్క సమాధానం గా క్విడ్ ఉంది అని చెప్పవచ్చు. మరింత తెలుసుకొనేందుకు మా క్విడ్ యొక్క సమీక్ష చూడండి.

క్విడ్ గత కొద్ది నెలలుగా సోషల్ మీడియా యొక్క వేడి టాపిక్ గా ఉంది.  అధికారికంగా ఆవిష్కరించబడినప్పటికీ, దీని యొక్క మేము అక్కడక్కడ చూసిన షాట్లు మరియు స్పెసిఫికేషన్లు ఈ భారతీయ ఆటోమోటివ్ రంగంలో గొప్ప ఉత్సాహాన్ని అందించాయని చెప్పవచ్చు. ఈ క్విడ్ చేసే ఈ పనికి ఒక పిచ్చి కూడా తోడయ్యింది, ఎందుకంటే క్విడ్ అనేది మారుతి ఆల్టో ని ఓడించడానికి సిద్ధం అవుతుంది. రెనాల్ట్ సంస్థ ఆవిష్కరణ సందర్భంగా క్విడ్ ని ‘గేం చేంజర్’ అని పిలిచింది. ఇది A- సెగ్మెంట్ యొక్క రాతను మారుస్తుందా? పదండి కనుక్కుందాము. 

బాహ్యభాగాలు

క్విడ్ మీ సాంప్రదాయికమైన A- సెగ్మెంట్ హాచ్బ్యాక్ అయితే కాదు. ఇది ఎలాంటి కారు అంటే మంచి ఉనికిని కలిగి ఉంటూ మరియు ఒక అధికారిక వైఖరి ని కలిగి ఉంది, ఇది మిగిలిన హ్యాచ్బ్యాక్ లలో వాటిలో ఖచ్చితంగా కలిగి ఉండదు అని చెప్పవచ్చు. పోల్చి చూస్తే చాలా చిన్న కారు(3679 X 1579 X 1498mm) అని చెప్పవచ్చు, కానీ దీనిలో ఖచ్చితంగా ఒక మంచి నమ్మకం అయితే ఉంది. ఆల్టో 800 ని గనుక దీనితో పోల్చి చూస్తే కొంచెం నెమ్మదిగా కనిపిస్తుంది మరియు పోల్చి చూస్తే చిన్నదిగా ఉంటుంది. క్విడ్ కారు కొంచెం రఫ్ గా, హుందాగా మరియు దృఢంగా ఉంటుంది.   

Renault Kwid First Drive Review

ఈ డిజైన్ యొక్క హైలైట్ ఏదైనా ఉంది అని చెప్పాలంటే అది దిగువ సగభాగాన్ని కప్పి ఉంచే బ్లాక్ క్లాడింగ్ గా చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా క్విడ్ ని ఆ సిరీస్ లో ఉండే మిగిలిన హ్యాచ్‌బ్యాక్ ల కంటే భిన్నంగా ఉండేలా చేస్తుంది. ఈ దళసరిగా ఉండే బ్లాక్ మౌల్డింగ్ ఫ్రంట్ బంపర్ మీద ఉండే ఎయిర్‌డ్యాం తో మొదలవుతూ కారు యొక్క దిగువ భాగంలో మూడవ వంతు వరకూ ఉంటుంది, చివరగా బంపర్ యొక్క పైభాగం వరకూ ఉంటుంది. కానీ ఈ డోర్ మీద ఉండే బ్లాకెడ్అవుట్ పోర్షన్ అది ఈ క్లాడింగ్ కి ఒక స్టిక్కర్ లాగా కనిపిస్తుంది. ఇతర బ్లాక్డ్ అవుట్ అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి వెనుక వ్యూ అద్దాలు, B- పిల్లర్ మరియు డోర్ హ్యాండిల్స్. బ్లాక్ క్లాడింగ్ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా జరుగుతుంది, మరీ ఎక్కువగా ఉండదు. దీనిని చూసి మిగిలిన కారు తయారీదారులు నేర్చొని వారి క్రాస్ హ్యాచ్ లను మరింత అందంగా తీర్చిదిద్దండి.

Renault Kwid First Drive Review

ఈ క్విడ్ కి రెనాల్ట్ చిహ్నమును కలిగి ఉన్న పెద్ద గ్రిల్ అందించడం జరుగుతుంది. దాని మీద మనకి ఈ రెనాల్ట్ అనే లోగో ఉంటుంది. హెడ్ల్యాంప్స్ C- ఆకారపు క్రోమ్ మూలాంశాలు లభిస్తాయి, దీని వలన ఈ కారు కి మంచి ఆసక్తికరమైన లుక్ ని అందించడం లో తోత్పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ హెడ్‌ల్యాంప్స్ దూకుడు అప్పీల్ ని కలిగి ఉంటాయి. ఈ హనీ కాంబ్ మెష్ ఎయిర్‌డ్యాం తో బాగా కలిసి ఒక మంచి ఆకృతితో కనిపించేలా చేస్తుంది. ఎయిర్డామ్ చుట్టూరా గుండ్రంగా ఫాగ్‌ల్యాంప్స్ తో చుట్టడం జరుగుతుంది, ఇవి నల్లగా ఉండే భాగంలో మనకి ఉంటాయి. ఈ బంపర్ కి కొంచెం వొంపుగా ఉండే అంచులు ఉండడం వలన ఆ వీల్ ఆర్చులు కొంచెం అందంగా కనిపిస్తాయని చెప్పవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆ టవు హుక్ అది మనకి బయటకి కనిపిస్తూ ఉంటుంది, ఇది డ్రైవర్ వైపు ఉండే ఫాగ్‌ల్యాంప్ కి కుడివైపు ఉంటుంది.

Renault Kwid First Drive Review

ప్రక్క భాగానికి గనుక వస్తే, మీరు విండో లైన్ చాలా ఎత్తులో కూర్చొని ఉండడం గమనిస్తారు మరియు గ్లాస్ ఏరియా చాలా చక్కగా ఉంటుంది మరియు పెద్దది కూడా. ట్రిం బ్యాడ్ తెలివిగా C-పిల్లర్ పక్కన డోర్ ట్రిం దగ్గర ఉంటుంది. ప్రక్కభాగంలో మనకి అంత తేడా చూపించే క్యారెక్టర్ లైన్స్ ఉండవు, కానీ ఆ ఫ్లేరెడ్ వీల్ ఆర్చులు కనిపించేలా డిజైన్ చేశారు. డోర్ దగ్గర చిన్న చిన్న సొట్టలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బలంగా చూపించడంలో తోత్పడతాయి. 155/80 R13 వీల్స్ అనేవి సరైన పరిమాణంగా చెప్పవచ్చు. 

Renault Kwid First Drive Review

వెనకాతల సింపిల్ డిజైన్ అమరికతో పెద్ద టెయిల్ గేట్ ఉండి పెద్ద టెయిల్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటుంది. ఇక్కడ కట్స్ మరియు క్రీజులు ఏమీ లేవు. వెనక వైపు నుండి చూస్తే చాలా పెద్దదిగా అందంగా కనిపిస్తుంది.  

Renault Kwid First Drive Review

రెనాల్ట్ ఈ వెనకాతల భాగం యొక్క డిజైన్ ని బాగా ఉత్తేజపరంగా చేయవచ్చు, కానీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. నేను ఒక పదం లో బాహ్య భాగాలను వివరించాలి అంటే అది 'వినూత్నమైనవి’ అని చెప్పవచ్చు. ఇది నిజంగా ఒక సగటు హ్యాచ్‌బ్యాక్ ని భిన్నంగా నిలపడానికి బాగా కష్టపడాలి, రెనాల్ట్ దీనిని బాగా అందంగా తయారు చేసిందని చెప్పవచ్చు.   

లోపల భాగాలు

మారుతి ఆల్టో కవలలతో నాణ్యతను పైకి తీసుకెళ్ళింది, కానీ అంతర్భాగాలు మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. నాణ్యత పరంగా క్విడ్ యొక్క అంతర్భాగాలు సమానంగా ఉంటాయి. లోపల భాగాలు క్లాసిక్ బడ్జెట్ రంగుని కలిగి ఉంటాయి.  ఈ బోరింగ్ గ్రే కలర్ ని పియానో బ్లాక్ సెంటర్ కన్సోల్ తో ఉండడం వలన చాలా బాగుంటుంది. క్యాబిన్ చుట్టూ క్రోం చేరికలు చాలా తక్కువగా ఉంటాయి, A.C వెంట్స్ మరియు సెంటర్ కన్సోల్ చుట్టూ అంత ఎక్కువగా క్రోం చేరికలు అయితే ఉండవు.

Renault Kwid First Drive Review

 ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, లేదా 'మీడియానావ్' రెనాల్ట్ ఈ విధంగా పిలుస్తుంది, ఇది టాప్-స్పెక్ RXT ట్రిమ్ లో అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ అనేది దీని కంటే బాగా ఖరీదైన డస్టర్ నుండి తీసుకొచ్చి పెట్టడం జరిగింది, ఇది USB మరియు AUX ఇన్పుట్లను మద్దతిస్తుంది మరియు మీ ఫోన్ నుండి కాల్స్ తీసుకుంటుంది లేదా సంగీతాన్ని కూడా ప్లే చేసుకోవచ్చు. ఇది డస్టర్ లో ఉన్నట్టుగానే నావిగేషన్ పొందుతుంది మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉపయోగించడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు వ్యవస్థను కేవలం రెండు స్పీకర్లతో మాత్రమే పొందవచ్చు మరియు ఆడియో నాణ్యత కేవలం సగటుగా ఉంటుంది.   

 Renault Kwid First Drive Review

వీల్ బేస్ ఒక ఆరోగ్యకరమైన 2422mm గా ఉంది మరియు ఆల్టో 800 కంటే 58mm ఎక్కువ. దీని వలన కారు లోపల చాలా స్థలం ఉంటుంది, ముఖ్యంగా చెప్పాలంటే వెనుక వైపు. వెనుక బెంచ్ ముగ్గురు కోసం డిజైన్ చేయబడింది, ఇది మేము చెబుతున్నప్పటికీ కొంచెం కష్టపడాలి అని కూడా చెప్పవచ్చు. ఇద్దరు ప్రయాణికులు వెనుక వైపు సులభంగా కూర్చోవచ్చు, మూడవ వ్యక్తి మిగిలిన ఇద్దరు ప్రయాణికుల షోల్డర్ స్పేస్ తో ఇబ్బంది పడతాడు.

Renault Kwid First Drive Review

ముందర సీట్లు బాగా కుషనింగ్ తో ఉంటాయి మరియు మంచి మద్దతుని అందిస్తాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్ లు మీ మెడకి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. డ్రైవింగ్ పొజిషన్ కొంచెం ఎత్తులో ఉంటుంది, అలాగే మీకు రోడ్డు వ్యూ అనేది మీకు బాగా అందిస్తుంది. ఈ ఇన్స్టృమెంటల్ క్లస్టర్ అనేది డిజిటల్ గా ఉంటుంది మరియు చక్కగా కనిపించే డిజిటల్ సంఖ్యలు మరియు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ని కలిగి ఉంటుంది.

Renault Kwid First Drive Review

స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే అది న్యూట్రల్ యాంగిల్ లో ఉంచబడుతుంది, దీనివలన ఎక్కువగా సమస్య అయితే ఏమీ ఉండదు. ఈ వీల్ చాలా చక్కగా ఉంటుంది మరియు ఈ చంకీ 3-స్పోక్ యూనిట్ పట్టుకోడానికి కూడా చాలా బాగుంటుంది. స్టీరింగ్ అనేది కొద్దిగా బరువుగా ఉంటుంది కానీ దాని గురించి మనం తరువాత మాట్లాడుకుందాము. 

ఉపయోగపడే విషయంలో క్విడ్ కి చాలా ఎక్కువ మార్కులు అనేవి వస్తాయి. డోర్ పాడ్స్,  గ్లోవ్ బాక్స్ పైన ఒక చిన్న షెల్ఫ్ మరియు గేర్ లివర్ ఇరువైపులా కొంత నిల్వ స్థలం కూడా ఉన్నాయి. బూట్‌స్పేస్ 300 లీటర్ల వద్ద ఆరోగ్యకరమైనదిగా ఉంటుంది, ఇది రెండో వరుస సీట్లను మడవటం ద్వారా 1115 లీటర్ల వరకూ విస్తరించుకోవచ్చు.  

ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ భవిష్యత్తులో ఉండాల్సిన లక్షణాలుగా మనకి కనిపిస్తాయి, కానీ కొన్ని అంశాలు అయినటువంటి మాక్ డయిల్స్, డాష్ మీద ఖాళీ స్థలం మరియు బటన్ లెస్ స్టీరింగ్ ఒక బడ్జెట్ హాచ్బాక్ లోపల కూర్చొనే విధంగా చేస్తాయి. నేను చెప్పేది ఏమిటంటే, రెనాల్ట్ దాని యొక్క బేసిక్స్ ని సరిగ్గా ఉండేలా చూసుకుంది.

ఇంజిన్ మరియు ప్రదర్శన

క్విడ్ ఒక 799cc, 3 సిలిండర్ మోటార్ ద్వారా ఆధారితం చేయబడి గౌరవనీయ 54Ps పవర్ మరియు 72Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఒక ఐదు స్పీడ్ మాన్యువల్ ప్రస్తుతం అందించబడుతుంది, AMT వెర్షన్ కూడా రాబోతుంది. మైలేజ్ విషయానికి వస్తే ఇది ఆకట్టుకునే 25.17 కిమీ /L మైలేజ్ ని అందిస్తుంది. ఈ పవర్ సంఖ్యలు గనుక మనం చూసినట్టు అయితే అంత ఆహ్లాదకరంగా ఉండవు, కానీ కారు యొక్క బరువు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సుమారు 670 కిలోల బరువు వద్ద, క్విడ్ ఇక్కడ తేలికైన కార్లు మధ్య ఉంది. ఇది కొంచెం అవసరమైతే వేగంగా కూడా వెళ్ళగలదు.

Renault Kwid First Drive Review

మీరు కీ ఆన్ చేసినపుడు మీరు మొట్టమొదటిగా గమనించేది ఏమిటంటే 3 పాట్ మోటార్ నుండి వచ్చే శబ్దం. ఆ శబ్ధం అనేది అంత ఆహ్లాదకరంగా ఉండదు, రివల్యూషన్స్ పెరుగుతున్న కొలదీ అంత విన సొంపుగా అయితే ఉండదు. కారులో మంచి NVH స్థాయిలను నిర్ధారించడానికి రెనాల్ట్ ఖచ్చితంగా బాగా పని చేయాల్సి ఉంది.

కారు వెళుతున్నప్పుడు ఆ రైడ్ క్వాలిటీ ఆ శబ్ధాన్ని మనకి మరిచిపోయేలా చేస్తుంది. మిగిలిన రెనాల్ట్ వలే ఆ రైడ్ నాణ్యత కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు, ఈ సస్పెన్షన్ విషయానికి వస్తే బాగా సుదీర్ఘమైనది మరియు మీరు చెడు రహదారులపై కూడా వెళ్ళవచ్చు. దీని యొక్క 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు, మీరు దీనిని ఒక SUV లా ఫీల్ అవ్వచ్చు మరియు ఏదైనా గతక వస్తే సులభంగా దాటేయచ్చు. మూడు అంకెల వేగంతో కూడా, క్విడ్ చక్కగా ఉంటుంది మరియు ఒక ఆల్టో K10 లాగా కుదుపులు అవి లేకుండా ఉంటుంది.

Renault Kwid First Drive Review

రహదారులపై క్విడ్ కి విశ్వాసాన్ని అందించేది ఏమిటి? స్టీరింగ్. ఈ ముక్క సందేహం లేకుండా చెప్పవచ్చు. స్టీరింగ్ ఈ విభాగంలో మీరు కారులో ఆశించినంత తేలికగా అయితే ఉండదు. కొంచెం బరువుగా ఉంటుంది, మీరు ట్రాఫిక్ లో ఒక చిన్న సందులోనికి వెళ్ళాలన్నా లేదా త్వరిత U-టర్న్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఈ బరువు సమస్య గా ఉంటుంది, కానీ అది హైవే మీద ఒక వరంగా నిలుస్తుంది. ఈ సమపాళ్ళలో బరువు ని అందించే స్టీరింగ్ వలన క్విడ్ సునాయాంశంగా హైవే మీద వెళ్ళేలా చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

రహదారి మర్యాద మరియు సరళ రేఖ స్థిరత్వం క్విడ్ లో సమస్యలు గా ఉండవు. అయితే, కొద్దిగా రెనాల్ట్ కి కార్నర్స్ గనుక చూపిస్తే ఈ కధ అనేది త్వరగా మారిపోతుంది. కారు ఎత్తు వలన దానికి బాడీ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది తగ్గించలేకపోవడం వలన కార్నర్స్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కార్నర్స్ లో వెళుతున్నపుడు మీరు ఎలా అయితే క్లచ్ ని గానీ యాక్సిలరేటర్ ని గానీ డ్రైవ్ చేస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది.

మొత్తంమీద, క్విడ్ నగరానికి మరియు అప్పుడప్పుడు ఏదైనా టూర్ కోసం వెళ్ళాలంటే ఆకట్టుకునే ప్యాకేజీగా ఉంటుంది. ఇంజిన్ చాలా అద్భుతంగా పని చేస్తుంది, అయితే 3 సిలిండర్ల చప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. భద్రత గురించి మాట్లాడుకుంటే, టాప్ స్పెక్ క్విడ్ ఒక ఆప్ష్నల్ డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్ ని పొందుతుంది మరియు ఆ ఎంపికను టిక్ చేయమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.   

తీర్పు

Renault Kwid First Drive Review

కాబట్టి, క్విడ్ కి ఏదైతే కావాలో అది ఉంది అనుకుంటున్నారా? మేము ముందుగా చూసినదాని బట్టి అయితే ఉందనే మేము అనుకుంటున్నాము. ఇది రహదారిపై ఏ కారు లేనటువంటి విధంగా ఉంటుంది మరియు మినీ SUV రూపకల్పన మరియు దృక్పధంతో ఇది మరింత భిన్నంగా నిలుస్తుంది. ఇది మరింత స్థలం, మంచి పరికరాలు, సిటీ పరిస్తితులలో బాగా పనితీరు చూపించే ఇంజన్ మరియు మంచి ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. చివరగా, రెనాల్ట్ చేయవలసిన రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి అమ్మకాల తరువాత మంచి మద్దతు ఇవ్వడం మరియు రెండవది ఒక మంచి పోటీ ధరని కలిగి ఉండడం.

 

 

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience