మారుతి సుజుకి ఇగ్నిస్: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
Published On మే 10, 2019 By jagdev for మారుతి ఇగ్నిస్
- 1 View
- Write a comment
ఇగ్నిస్ వెల్లడిస్తున్నట్టు ఈ కారు యువతకేనా?
మారుతి సుజుకి యొక్క ప్రీమియం రిటైల్ చైన్, నెక్సా నుండి ఇగ్నిస్ మూడవ విక్రయం. ఇది నేడు నెక్సా షోరూం లో అత్యంత సరసమైన ఉత్పత్తి. ఈ కారు ముఖ్యంగా యుతవను ఉద్దేశించి నిర్మాణించబడింది, ఎందుకంటే ఈ సెగ్మెంట్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంలో లక్ష్యంగా ఉంది, అందువలన మారుతి సుజుకి దీనిలో ఎటువంటి తప్పులు చేయకూడదని నిశ్చయించుకుంది. ఇగ్నిస్ శ్రేణి రూ. 4.59 లక్షల నుంచి ప్రారంభమయ్యి రూ .7.80 లక్షల ధర (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకూ ఉంది. ఎలా యువత కోసమే అని తెలుసుకోడానికి ఇగ్నీస్ ని డ్రైవ్ చేసేందుకు మేము ఇప్పుడు చెన్నై లో ఉన్నాము.
బాహ్యభాగాలు:
డిజైన్ పరంగా ఇగ్నిస్ సురక్షితంగా అంత తెలివిగా ప్రవర్తించడంలేదని చెప్పాలి. యువతను ఆకర్షించుకోడానికి దీనిలో ఏముంది అనేది ముందు భాగం చూస్తే గనుక తెలుస్తుంది. హెడ్ల్యాంప్ యూనిట్లను కలిగి ఉండే విస్తృత సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ వెంటనే దృష్టిని ఆకర్షిస్తుంది. హెడ్ల్యాంప్స్ చుట్టూ U- ఆకారంలో ఉన్న DRLS లు ఆధునికత మరియు సుసంపన్నతను ఫ్రంట్ గ్రిల్ కు అందించాయి లేదంటే ఇది సాధారణంగా ఉండేది మరియు ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ ఉండే గుండ్రటి క్రోం హౌసింగ్ ఓల్డ్ ఫాషన్ ఫ్రంట్ బంపర్ ని కవర్ చేసేందుకు అందించబడింది.
ఇగ్నీస్ కూడా చూడడానికి ఒక SUV కి మరియు హ్యాచ్బ్యాక్ కి పుట్టినట్టుగా ఉంటుంది. ముందర ఉండే లైన్స్ అన్నీ కూడా బోనెట్ కు వెళుతున్నట్టుగా ఉంటాయి, కానీ అవి నిజంగా వెళ్ళవు. ఎత్తుగా ఉండే బోనెట్ లైన్ మరియు ఫ్లాట్ గా ఉండే హుడ్ ఇగ్నిస్ కి మరింత SUV లుక్ ని జోడించాయి. బోనెట్ మీద ఒక చిన్న రబ్బర్ స్ట్రిప్ మనకి సుజుకి యొక్క SUV ఒరిజినల్ విటారాను తలపించే విధంగా ఉంటుంది.
ఈ కారు చుట్టూ తిరిగి చూస్తే గనుక 3700mm పొడవు సులభంగా చిన్నగా కనిపిస్తుంది. ఇది చిన్నగా ఉండడం వలన చిన్న చిన్న పార్కింగ్ ప్లేస్ లోకి కూడా సులభంగా వెళిపోతుంది. ప్రక్క నుండి చూస్తే, ఇగ్నిస్ యొక్క డిజైన్ బాగా సమతుల్యతతో ఉంటుంది మరియు వెనకాతల ఆకస్మికంగా కట్ చేయబడి ఉన్నట్టు ఉంటుంది. పెద్ద 15 ఇంచ్ వీల్స్ బాగా అందంగా అమర్చబడి ఉంటాయి.
అదృష్టవశాత్తూ, మారుతి సుజుకి ఇగ్నిస్ లుక్ బలంగా ఉండేలా చేయడానికి ప్లాస్టిక్ క్లాడింగ్ ను మరీ ఎక్కువ చూపించలేదు. అయితే, అసాధారణ రీతిలో రూపొందించిన వెనుక భాగంలో పావు వంతు ఒక నాచ్‌బాక్ లా కనిపిస్తుంది.
ముందు మరియు ప్రక్క భాగం నుండి ఇగ్నిస్ ఆకర్షణీయంగా మరియు స్పష్టమైనదిగా కనిపిస్తుంది. అయితే, భాదాకరంగా వెనుకవైపు నుండి చూస్తే మాత్రం అంత ఆకర్షణీయంగా లేదు. వెనుక భాగంలోని సగం, బంపర్ లోకి సజావుగా వెళ్ళే ఫ్లేరెడ్ వీల్ ఆర్చులతో అదో రకంగా కనిపిస్తుంది. దీని బూట్ పార్ట్ అనేది బాగా ఫ్లాట్ గా ఉంటుంది మరియు బూట్ లిడ్ డిజైన్ చాలా గజిబిజిగా ఉంటుంది. వెనుక బంపర్ పై ప్లాస్టిక్ ట్రీట్మెంట్ ఆచరణాత్మకమైనదిగా ఉంటుంది మరియు రిట్జ్ కారుని తలపించే విధంగా ఉంటుంది.
లోపల భాగాలు:
ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పొడవైన వైఖరి కారణంగా క్యాబిన్ లోనికి సులభంగా వెళ్ళే విధంగా ఉంటుంది మరియు ఒక హ్యాచ్బ్యాక్ సైజ్ కి ఏ విధంగా అయితే ఊహిస్తారో అలానే విశాలంగా క్యాబిన్ ఉంటుంది. దీనిలో టచ్ పాయింట్లు క్వాలిటీ మారుతి కార్లలో ఉండే దానికంటే బాగా అభివృద్ధి చెందింది, కానీ ఫిట్ మరియు ఫినిషింగ్ విధానం ఇంకొంచెం బెటర్ గా ఉండాలి.
ఇగ్నీస్ లోపల ఉండే ఐవరీ మరియు బ్లాక్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ అందరికీ బాగా నచ్చుతుంది, ఎందుకంటే క్యాబిన్ లోని మంచి అనుభూతిని అందిస్తుంది. అయితే, దానిని కాపాడుకొనేందుకు నిరంతర శ్రద్ధ అవసరం. మారుతి సుజుకి అనేది చాలా మంది లగ్జరీ కారు తయాదారుల అడుగు జాడలలో నడిచి డాగ్బోర్డు లేఅవుట్ ను సరళీకృతం చేయడానికి 7-ఇంచ్ వినోద స్క్రీన్లను అందించింది. ఇది ఆధునికమైనదిగా కనిపిస్తోంది, కానీ అది అమర్చబడిన ప్లేస్ అనేది మరింత డ్రైవర్-సెంట్రిక్ అయి ఉంటే బాగుండేది.
దీని యొక్క తక్కువ వేరియంట్స్ లో, 2-DIN మ్యూజిక్ సిస్టమ్ టచ్‌స్క్రీన్ తో మార్చబడింది, అది అంత ఎబెట్టుగా ఉండదు. ఆ ఆరెంజ్ బ్లాక్ లైటింగ్ అనేది క్లాసీ వైట్ బ్లాక్ లిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో అంత బాగా కలవదు. ఇతర మారుతి సుజుకి కార్లతో పోల్చినట్లయితే ఎయిర్ క్రాఫ్ట్ స్టయిల్ ఎయిర్-కాన్ నాబ్స్ మరియు స్టీరింగ్ నియంత్రణల నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉంది.
ఇగ్నిస్ క్యాబిన్ లో ఇంకొక స్వాగతించాల్సిన మార్పు ఏమిటంటే కొత్త స్టీరింగ్ వీల్,ఇది పట్టుకోడానికి సులభంగా ఉంటుంది మరియు ఇది నాన్-ప్లాస్టిక్స్ రబ్బర్ ఫినిషింగ్ తో ఉంటుంది దీనికి గానూ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు కూడా బాగా అమర్చబడ్డాయి మరియు వీటిని ఉపయోగించడం సులభం.
ఇగ్నిస్ చాలా స్టయిల్ గా ఉంటుంది మరియు దీనిలో డోర్స్ మెటల్-ఫినిషెడ్ డోర్ హ్యాండిల్స్ ని కలిగి ఉండి అందంగా కనిపిస్తుంది. మారుతి సుజికి యొక్క ఇతర హ్యాచ్బ్యాక్ లతో పోలిస్తే ఇగ్నీస్ యొక్క డోర్స్ సైజ్ లో పెద్దవిగా భారీగా కనిపిస్తాయి, కానీ జర్మన్ కారులలో వచ్చే విధంగా 'తడ్' శబ్ధం అనేది రాదు.
దీనిలో ముందర సీట్లు ప్లేస్ ని కలిగి ఉంటూ తొడ క్రింద భాగానికి బాగా సపోర్ట్ ఇస్తాయి మరియు కూర్చొనే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సీటులో కూర్చున్నపుడు వ్యూ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది మరియు డాష్బోర్డ్ ఆధునిక హ్యాచ్‌బ్యాక్ లో ఉన్నట్టుగా అంత దూరంగా ఉండదు. కొంచెం పొట్టిగా ఉండేవారికి కూడా మంచి వ్యూ ని అందిస్తుంది, కొన్ని వేరియంట్లలో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లేకపోయినా కూడా మంచి వ్యూ ని అందిస్తుంది.
ఇగ్నిస్ క్యాబిన్ ఉత్తమంగా నలుగురుకి సరిపోతుంది, అయినప్పటికీ వెనుకవైపు సీటులో ఐదవ ప్రయాణీకుడిని కూడా కూర్చోపెట్టుకోవచ్చు. క్యాబిన్ వాస్తవాలని బాగా దృష్టిలో పెట్టుకొంటే ఎక్కువ మార్కులు సంపాదించుకుంటుంది, ఎందుకంటే దీనిలో అన్ని రకాలా వ్యక్తులకు సరిపడే విధంగా మంచి లెగ్రూం ఉంది, మంచి హెడ్ రూం ఉంది మరియు అన్ని డోర్స్ కి వాటర్ బాటిల్స్ పెట్టుకొనేందుకు క్యూబీ హోల్స్ ఉన్నాయి. దీనిలో వెనకాతల సీటు రెండు డిటాచబుల్ హెడ్రెస్ట్లు మరియు 60:40 స్పిల్ట్ సీటు ని కలిగి ఉంటుంది. దీనివలన వివిధ అవసరాలకు క్యాబిన్ స్థలాన్ని బాగా వాడుకోవచ్చు. 260-లీటర్ బూట్ తో, ఇగ్నిస్ ఇప్పటికే నలుగురు మనుషుల లగేజ్ ని తీసుకువెళ్ళడానికి తగినంత స్థలాన్ని అందిస్తుంది.
ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్:
ఇగ్నిస్ ఒక పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజన్ లో కూడా అందుబాటులో ఉంటుంది మరియు అన్ని 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్బాక్సులతో లభిస్తుంది. నిజానికి ఇగ్నీస్ కి ఎక్కువ మార్కులు పడతాయి అంటే ఈ AMT వెర్షన్ డీజల్ మరియు పెట్రోల్ రెండిటిలోనీ ఉంది.
పెట్రోల్ ఇంజిన్ కి వస్తే బలేనో లో ఏదైతే పవర్ ని అందిస్తుందో అదే 1.2 లీటర్ యూనిట్ ని ఇగ్నీస్ కూడా కలిగి ఉంది. ఇది 83Ps గరిష్ట శక్తిని మరియు 113Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. ఇగ్నీస్ కారు చాలా తేలికగా ఉంటుంది, పెట్రోల్ అయితే 860kg మరియు డీజిల్ అయితే 960kg బరువు ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ అనేది తక్కువ ఆక్సిలరేషన్ లో కూడా మంచి టార్క్ ని అందించి సులభంగా 3500rpm మార్క్ ని దాటుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది మనకు తెలియకుండా మారడం జరగదు, కానీ ఫెయిల్ అయితే అవ్వదు.
మొట్టమొదటిసారిగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడిన 5-స్పీడ్ AMT యూనిట్, ప్రత్యేకంగా సిల్కీ షిఫ్టులను నిర్ధారించడానికి ట్యూన్ చేయబడింది మరియు మారుతి సుజుకి అలాగే విజయవంతం అయింది. ఆటో మోడ్ లో ట్రాన్స్మిషన్ అనేది ముందే నిర్వచించిన షిఫ్ట్ పాయింట్ల వద్ద మారుతూ ఉంటుంది. ప్రతీ 2,000RPM మార్క్ కి ట్రాన్స్మిషన్ అనేది మారుతూ ఉంటుంది. అయితే ట్రాన్స్మిషన్ డ్రైవింగ్ విధానాలను అర్థం చేసుకుంటూ, త్రాటిల్ ఇంపుట్ డిమాండ్ చేసినపుడు గేర్స్ ని హోల్డ్ కూడా చేస్తుంది. గేర్స్ క్రిందకి రావడం లో చాలా వేగంగా వస్తాయి మరియు హైవేలో ఓవర్ టేక్ చేయడానికి కూడా ఎటువంటి సమస్య ఉండదు.
డీజిల్ మరియు AMT కలయిక అనేది ఈ ప్యాకేజీ యొక్క ముఖ్యాంశం. మాకు ఏం చెప్పడం జరిగిందంటే ఈ AMT 1.3 లీటర్ కి అనుగుణంగా ట్యూన్ చేయబడి 75Ps డీజిల్ ఇంజన్ అత్యధిక టార్క్ 190Nm ని 2,000Rpm వద్ద అందిస్తుంది. డిజైర్ డీజిల్ AMT తో పోలిస్తే ఈ కారు షిఫ్ట్స్ అనేవి స్మూత్ గా ఉంటాయి. అయితే ఈ డీజిల్ ఇగ్నీస్ AMT కి కొంచెం అలవాటు పడడానికి కొంత సమయం తీసుకుంటుంది, ఎందుకంటే టర్బో కొన్ని కొన్ని సార్లు వీల్స్ కి కావలసిన పవర్ ని అందించి, బ్రేక్ వేద్దాము అనుకొనేటపుడు పవర్ ని అందిస్తునే ఉంటుంది. ఒకే విధానంలో వెళుతున్నపుడు ట్రాన్స్మిషన్ ఆ విధానాన్ని గ్రహించుకొని గేర్స్ అనేవి పైకి జరుగుతూ ఉంటాయి మరియు కొన్ని కొన్ని సార్లు స్లో అయ్యి ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు కూడా అప్ షిఫ్ట్స్ జరుగుతూ ఉంటాయి మరియు ఎప్పుడైనా ఒకసారి జరగకపోవచ్చు.
దీనిలో సెమీ ఆటోమోడ్ కూడా కలిగి ఉంటుంది, మనం కంట్రోల్ తీసుకోవాలి అంటే సెమీ ఆటోమోడ్ ఉంటుంది. అప్ షిఫ్ట్స్ అనేవి మన ఇష్టానుసారంగా మనం పెంచుకోవచ్చు, కానీ డౌన్ షిఫ్ట్స్ అనేవి కారు స్టార్ట్ అయి ఉండడానికి ఆటోమెటిక్ గా డౌన్ షిఫ్ట్స్ అనేవి చాలా సందర్భాలలో అవుతుంటాయి. సెమీ ఆటో మోడ్ లో గేర్ లు పైకి వెళుతున్న కొలదీ మనం ఏదైతే లోపల జెర్క్స్ ఫీల్ అవుతామో అవి తగ్గించవచ్చు.
కొన్ని సమయానుకూల కారణాల వలన ఇగ్నీస్ ని ఇంధన సామర్ధ్యాల టెస్ట్ కి తీసుకొని వెళ్ళలేకపోయాము. అయితే, డ్రైవర్ ఇంఫో డిస్ప్లే యూనిట్ మీద డీజిల్ కి మరియు పెట్రోల్ రెండిటికీ మంచి గణాంకాలు ఉన్నాయి. డీజిల్ సిటీ లో 18kmpl ఇస్తుంది మరియు పెట్రోల్ హైవే మీద 50km ప్రయాణం చేస్తే 20kmpl మైలేజ్ ఇస్తుంది.
రైడ్ మరియు హ్యాండిలింగ్:
అంత ఎత్తుగా ఉండే కారు ఇగ్నీస్ మంచి రైడ్ ని అందిస్తుంది. దీనిలో 15 ఇంచ్ వీల్స్ ఉండడం వలన మిగిలిన హ్యాచ్‌బ్యాక్ ల కంటే కూడా రోడ్డు బాలేకపోయినా అవకతవకలు ఉన్నా కూడా ఆ ఇబ్బంది మనకి తెలియకుండా చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోడ్డు మీద ఉండే ఇబ్బంది లోపలకి తీసుకొని రాదు, కానీ పెద్ద పెద్ద గతకలు కానీ ఉంటే మాత్రం క్యాబిన్ లోనికి వినిపిస్తాయి. ఆశ్చర్యకరంగా మారుతి సుజుకి కార్లు అనేవి, సస్పెన్షన్లు పెద్ద గుంతలతో సునాయాసంగా శబ్ధం లోపలకి రాకుండా డీల్ చేస్తాయి.
మొత్తంగా డ్రైవింగ్ అనుభవం గురించి చెప్పలంటే మంచి బరువు కలిగిన స్టీరింగ్ వీల్ వలన అద్భుతంగా ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ తక్కువ స్పీడ్ లలో తక్కువ బరువు ని కలిగి ఉంటుంది మరియు స్పీడ్ పెరుగుతూ ఉంటే స్టీరింగ్ బరువు పెరుగుతూ ఉంటుంది. ఇగ్నీస్ గురించి అంత ఫీడ్‌బ్యాక్ ఇచ్చే విధంగా ఏమీ లేదు, ఎందుకంటే ఇది డ్రైవర్ కి అనుగుణంగా ఉండే కారు కాదు కాబట్టి వదిలేయేవచ్చు. చిన్న చిన్న స్టీరింగ్ కనెక్షన్లతోనే ఇది హైవేస్ లో ఆ వీల్ యొక్క బరువు వలన సరళంగా వెళుతుంది.
మారుతి సుజికి ఇగ్నీస్ ని ఐదవ జెన్ A- ప్లాట్ఫాం మీద నిర్మించింది, ఇది ముందు కంటే గట్టిగా ఉంటుంది మరియు దీని రహదారి స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఫ్రంటల్, రేర్ మరియు సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ పరీక్షలను పాస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది మరియు ABS మరియు EBD మరియు డ్యుయల్ ఎయిర్బ్యాగ్లను ప్రమాణంగా పొందుతుంది. ఇగ్నిస్ ఎక్కువ వేగంతో వెళ్ళినా కూడా బ్రేకింగ్ అనేది చాలా బాగుంటుంది మరియు వీకెండ్స్ లో ఔట్స్టేషన్ రైడ్స్ కోసం హైవే లో వెళ్ళడానికి ఉత్తమమైనది అని చెప్పవచ్చు.
తీర్పు:
మారుతి సుజుకి ఇగ్నీస్ ని ఎక్కువగా యువతను లక్ష్యం చేసుకొని తయారు చేసింది కాబట్టి లుక్స్ మీద ఇంకా శ్రద్ధ పెట్టాలి. ఇగ్నీస్ అనేది ఇతర కారులా ఉండదు మరియు ఖచ్చితంగా మనల్ని ఆకర్షిస్తుంది మరియు మంచి పనితీరు కూడా అందిస్తుంది, కానీ వెనకాతల నుండి చూస్తే గనుక అంత ఆకర్షణీయంగా ఉండదు. ఈ కారు కొనుక్కుంటే మాత్రం వెనకాతల డిజైన్ పట్ల కొంచెం రాజీ పడాలి. ఈ వెనకాతల భాగాన్ని కప్పి పుచ్చుకోవడానికి దీనిలో యాక్సిసరీస్ అనేవి బాగా ఉన్నాయి మరియు వాటితో కారు భిన్నంగా కంపిస్తుంది.
లోపల భాగం చూసుకుంటే చాలా ఆధునికంగా ఉంటూ బయట కలర్స్ తో పాటూ కలిసి క్యాబిన్ ని మరింత ఉత్తేజంగా ఉంచుతుంది. ప్లాస్టిక్ పార్ట్స్ మీద ఉండే ఫినిష్ అనేది చాలా అభివృద్ధి చేయబడింది మరియు మారుతి ఇతర కారుల వలే అంత గట్టిగా ఉండకుండా చూసుకున్నారు. ఇగ్నిస్ టాప్ వేరియంట్ ఆల్ఫా లో చాలా లక్షణాలను కలిగి ఉంది, అయితే తక్కువ వేరియంట్లు అయిన జీటా మరియు డెల్టా లో కూడా మంచి లక్షణాలను అందిస్తూ సౌకర్యంగా ఉంటుంది. కాబిన్ విశాలమైనది మరియు సౌకర్యవంతమైనది, లైట్ బీజ్ మరియు బ్లాక్ ఇంటీరియర్ థీం కి ధన్యవాదాలు తెలుపుకోవాలి మరియు దీనిని కాలం పెరుగుతున్న కొలదీ అలానే మెయింటైన్ చేయాలి అంటే చాలా శ్రద్ధ పెట్టాలి.
మారుతి సుజుకి ఇగ్నిస్ పై పవర్ ట్రైన్ ఎంపికలు తో కుంభ స్థలాన్ని చేరుకుంది. డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్లతో AMT బాక్స్ ని అందివ్వడం అనేది మారుతి సుజుకి ఈ వాహనాన్ని యువతను ఆకార్షించేందుకు మరియు సౌకర్యంగా చేసేందుకు అభివృద్ధి చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ప్రమాణంగా భద్రతా లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటే, ఇగ్నిస్ ఒక పూర్తి ప్యాకేజీలా యువతీ యువకులనే కాకుండా విస్తృతంగా ఆకర్షిస్తుంది.
ధరలు కొంచెం ఇప్పుడు అధికంగా కనిపిస్తాయి, కానీ ఇగ్నీస్ అనేది అవసరమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. దాని యొక్క పోటీదారులతో పోల్చుకుంటే దీనిలో భద్రతా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇది చాలా దూరం వెళుతుంది.