2018 రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ AMT: నిపుణుల సమీక్ష
Published On మే 13, 2019 By nabeel for రెనాల్ట్ క్విడ్ 2015-2019
- 0 Views
- Write a comment
పరీక్షించిన కారు: 2018 రెనాల్ట్ క్వైడ్ క్లైంబర్
ఇంజిన్: 1.0 లీటర్
ట్రాన్స్మిషన్: 5-స్పీడ్ AMT
ధర: రూ. 4.6 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ
ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ లో రెనాల్ట్ క్విడ్ ఎల్లప్పుడూ కుర్ర కారుని ఉర్రూతలూరించే ఎంపికగా ఉంటుంది. దీని యొక్క SUV ప్రేరేపిత లుక్స్,పొడవాటి లక్షణాల జాబితా మరియు దీని యొక్క అతి తక్కువ ఖరీదుతో కుర్ర కారు యొక్క మేలైన ఎంపికగా నిలిచింది. 2018 కి గానూ రెనాల్ట్ ఆ మొత్తం ప్యాకేజీకి ఎక్కువ లక్షణాలు అందించి మరియు ధర అదే రేంజ్ లో ఉంచుతూ ఇంకా డబ్బు కి విలువని బాగా అందిస్తుంది. 2018 క్విడ్ క్లైంబర్ AMT లో ఏది కొత్తది అని పరిశీలిద్దాం పదండి.
డిజైన్
లుక్స్ విషయానికి వస్తే క్విడ్ అనేది ఈ చిన్న కార్ల సెగ్మెంట్ లో చాలా యేళ్ళ వరకూ ఎవరూ కూడా దీనిని ప్రయత్నించలేదు అని చెప్పవచ్చు. 2018 నాటికి, రెనాల్ట్ సంస్థ క్విడ్ కి గ్రిల్ మీద కొత్త క్రోం ఎలిమెంట్స్,కొత్త సైడ్ గ్రాఫిక్స్ మరియు నల్లని వీల్ క్యాప్స్ వంటి చిన్న చిన్న సౌందర్య మార్పులతో అన్ని వేరియంట్స్ ని అందించింది. అయితే, క్విడ్ క్లైంబర్ ని మటుకు ఎటువంటి మార్పులు లేకుండా అలానే ఉంచేసింది.
ఒక బోల్డ్ గ్రిల్, పొడవైన బోనెట్ మరియు పెద్ద బాడీ క్లాడింగ్ తో ఇది ఒక చిన్న SUV లాగా కనిపించేలా చేస్తుంది. అంతేకాక, క్లైంబర్ రూఫ్ రెయిల్స్,పెద్ద ఫాగ్ ల్యాంప్స్ మరియు సైడ్ క్లాడింగ్ మరియు ఆరెంజ్ ఆక్సెంట్స్ తో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ ని కలిగి ఉంది. అంతే కాక, అల్లాయ్ వీల్స్ లా ఉండే వీల్ క్యాప్స్ తో కూడా లభిస్తుంది.
'క్లైంబర్' బ్యాడ్జింగ్ అనేది ఫ్రంట్ డోర్స్, వెనుక విండ్‌స్క్రీన్ మరియు కారు లోపల కూడా చూడవచ్చు.మొత్తంగా చూసుకుంటే క్విడ్ క్లైంబర్ రెగ్యులర్ మోడల్స్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది, అందుకే మెరుగైన రహదారి ఉనికిని కలిగి ఉంది.
లోపల భాగాలు
క్లైంబర్ లోపలకి వస్తే విషయాలు అన్నీ కూడా తెలిసినట్టే ఉంటాయి. డోర్ పాడ్స్ మీద సెంటర్ కన్సోల్ మీద మరియు సీటు అపోలిస్ట్రీ మీద ఆరెంజ్ కలర్ చక్కగా వాడారని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా క్లైంబర్ బాడ్జింగ్ అనేది మీరు స్టీరింగ్ వీల్ మరియు సీట్లపై పొందుతారు దీని వలన అంతర్భాగాలు చాలా అందంగా కనిపిస్తాయని చెప్పవచ్చు.
ఆపై దీనిలో నావిగేషన్, బ్లూటూత్, USB మరియు AUX ఇన్పుట్లతో మొదటి-తరగతికి చెందిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఈ ఫీచర్లు సరిగ్గా లేనట్లయితే, రెనాల్ట్ తన యొక్క స్టాండర్డ్ ని 2018 మోడల్ తో మరింత పెంచింది ఎలా అంటే రివర్సింగ్ కెమెరా, కష్టమైన పార్కింగ్ స్థలాల్లోకి ప్రవేశించడానికి మరియు బయటపడేందుకు మొట్టమొదటిసారిగా కారుని నడిపే డ్రైవర్లకు ఒక వరంలా నిలుస్తుంది.
అలాగే దీనిలో పూర్తి ఇన్స్టృమెంటల్ క్లస్టర్ ఉంది, ఇది స్పీడ్ యొక్క రీడింగ్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అయితే దీనిలో ఫ్రంట్ ట్రిప్ డిస్ప్లే కొంచెం పెద్దవిగా ఉంటే ఇంకా బాగుండేది. అంతేకాకుండా, క్లస్టర్ యొక్క ఆరెంజ్ బ్యాగ్‌రౌండ్ అనేది క్లైంబర్ లో ఉన్న ఆరెంజ్ కలర్ కి బాగా అందం చేకూరుస్తుందని చెప్పవచ్చు.
క్విడ్ క్లైంబర్ మొట్టమొదటి తరగతి AMT డయల్ ని పొంది ఉండడాన్ని కొనసాగిస్తుంది.ఇది సంప్రదాయ గేర్ లీవర్ ని ఒక నాబ్ తో భర్తీ చేస్తుంది, ఇది వరుసగా 'డ్రైవ్' లేదా 'R' డ్రైవ్ లేదా రివర్స్ కోసం మార్చబడుతుంది.
కాబిన్ లోపల నాణ్యత క్విడ్ కి మంచి అధనపు బలాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. డాష్బోర్డులోని ఉండే ప్లాస్టిక్లు, ప్రత్యేకంగా చెప్పాలంటే సెంట్రల్ A.C వెంట్స్ మరియు బటన్లు బలహీనంగా ఉంటాయి. డోర్ పాడ్స్ మాములు క్వాలిటీ ప్లాస్టిక్ ని మరియు క్యాబిన్ కూడా బాగున్నప్పటికీ అంత ప్రీమియం ఫీల్ అయితే ఉండదు. AMT డయల్ కూడా కొంచెం ఎబెట్టుగా ఉంటుంది మరియు మెటాలిక్ గానీ ఉండి ఉంటే ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనే భావన మనకి కలిగేది.
ఇది చెప్తున్నప్పటికీ దీనిలో స్టొరేజ్ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ గేర్ లివర్ లేకపోవడం వలన మొత్తం స్టోరేజ్ కన్సోల్ అనేది ఇక్కడ బకెట్ లా వస్తుంది మరియు ఈ ఫ్రంట్ లో ఉండే ఏరియా అనేది రెండు కప్ హోల్డర్స్ మరియు 12V సాకెట్ ని కలిగి ఉంటుంది మరియు మిగిలిన స్థలం ఇతర వస్తువులు ఏమైనా పెట్టుకోడానికి బాగుంటుంది. దీనిలో రెండు గ్లోవ్ బాక్స్ లు కూడా ఉన్నాయి. ఫ్రంట్ డోర్ పాకెట్లు కూడా 1-లీటరు బాటిల్ ని ఇంకా శుభ్రపరిచే వస్త్రం మరియు వార్తాపత్రికలు వంటి చిన్న వస్తువులు పెట్టుకొనేందుకు కూడా స్పేస్ ని కలిగి ఉంటుంది.
స్థలం గురించి మాట్లాడుతూ, క్విడ్ యొక్క వెనుక సీట్లు ఒక ఫ్లాట్ బెంచ్ ను కలిగి ఉంటాయి, ఇవి ఇద్దరు పెద్దవాళ్ళు లేదా ముగ్గురు పిల్లలను సులువుగా కూర్చుకొనేలా చేస్తుంది. దీనిలో మంచి లెగ్‌రూం మరియు హెడ్‌రూం ని కలిగి ఉంటూ ఆరడుగుల వ్యక్తికి మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. 2018 క్విడ్ క్లైంబర్ ఇప్పుడు వెనుక సీటు ఆర్మ్రెస్ట్ ని కూడా పొందుతుంది. ఈ లక్షణం దీని యొక్క పైన సెగ్మెంట్ లో ఉండే కార్లలో కూడా ఉండదు. ఇది దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు వెనకాతల కూర్చొనే ప్యాసింజర్లకు బాగా సౌకర్యంగా ఉంటుంది.
ముఖ్యంగా, 2018 క్విడ్ కి వెనకాతల కూర్చొనే ప్రయాణికులకు రిక్ట్రాక్టబుల్ సీటు బెల్ట్స్ వస్తాయి. ఇది అంతకుముందు మోడల్స్ లో ఒక స్పష్టమైన లేని అంశంగా కనిపిస్తుంది. ఇది పక్కన పెడితే దీనిలో వెనకాతల కొత్త 12V ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది.
క్విడ్ సులభంగా నలుగురు ప్రయాణీకులను కూర్చోపెట్టుకోవడమే కాకుండా కానీ వారి సామాను కూడా బాగా స్టోర్ చేస్తుంది. దీని యొక్క బూట్ సామర్ధ్యం ఆ విభాగంలోనే ఉత్తమంగా 300 లీటర్ల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది ఎగువ భాగంలో ఉన్న హాచ్బాక్ల కంటే కూడా చాలా ఎక్కువ. ఇది సులభంగా వారానికి సరిపడా లగేజ్ ని తీసుకొని వెళ్ళగలదు.
క్లుప్తంగా చెప్పాలంటే క్విడ్ క్లైంబర్ స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే లోపల మరింత అద్భుతంగా కుర్రకారుకి నచ్చే విధంగా ఉంటుంది. ఇది ఆచరణాత్మక నిల్వ ఎంపికలు, లక్షణాలు మరియు ఎక్కువ స్థలాన్ని కూడా కలిగి ఉంటుంది. మీరు కొంచెం పార్ట్స్ యొక్క నాణ్యతను పట్టించుకోకుండా ఉండగలిగే లోపల కూర్చోడం సులభం అని చెప్పవచ్చు.
ఇంజిన్ మరియు పనితీరు
క్విడ్ క్లైంబర్ ఇప్పటికీ బోనెట్ లో 1.0 లీటర్ పెట్రోల్ మోటారుతో అమర్చబడింది. ఇది 5500rpm వద్ద 68Ps శక్తిని మరియు 4250rpm వద్ద 91Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. మేము పరీక్షించిన కారు 5-స్పీడ్ AMT తో వచ్చింది. అలాగే మీరు 5-స్పీడ్ మాన్యువల్ లో కూడా కొనుక్కోవచ్చు.
2018 నవీకరణతో, రెనాల్ట్ చివరికి క్రీప్ ఫంక్షన్ ను AMTకు పరిచయం చేసింది. మీరు డ్రైవ్ మోడ్ లో పెట్టి బ్రేక్ మీద కాళ్ళు తీస్తే అలా నెమ్మదిగా ముందుకు వెళిపోతుంది. ఇది బంపర్ నుండి బంపర్ ట్రాఫిక్ లో బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే డ్రైవర్ త్రోటిల్ పెడల్ ని ఇకపై ఉపయోగించాల్సిన అవసరం లేదు.
అయితే, ఈ ఫంక్షన్ ఎత్తైన ప్రదేశాలలో పనిచేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంజిన్ చాలా శక్తివంతమైన కాదు, క్లైంబర్ కేవలం వీల్స్ పై ప్రాకడానికి ఇబ్బంది పడుతుంది మరియు వెనుకకు వెళ్లడం మొదలవుతుంది, మీరు హ్యాండ్ బ్రేక్స్ ని ఉపయోగించాలి అన్న భావన కలిగిస్తుంది. అలాగే మీరు క్రీప్ మోడ్ లో ఉన్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే కారు అనేది న్యూట్రల్ మోడ్ లోనికి వచ్చేస్తుంది మరియు ఇంజన్ ఆగిపోకుండా చూస్తుంది.
నగరం లోపల, 1.0 లీటర్ ఇంజిన్ క్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఓవర్టేక్ చేస్తున్నపుడు కానీ ఇంజిన్ యొక్క మిడ్ రేంజ్ మీరు త్వరగా ట్రాఫిక్ లోనికి వెళ్ళడానికి సహాయపడుతుంది. చెప్పాలంటే ఇంజన్ కి ఎక్కువ ఆక్సిలరేషన్ ఇస్తున్నపుడు త్వరగా దాని యొక్క పవర్ ని కోల్పోతుంది మరియు మొట్టమొదటి కారుకి అంత ఆహ్లాదకరంగా ఉండదు. మా పరీక్షలో, క్విడ్ క్లైంబర్ AMT నగరంలో 17.09Kmpl మైలేజ్ మరియు హైవే లో 21.43Kmpl మైలేజ్ ని అందిస్తుంది.
హైవే గురించి మాట్లాడుకుంటే క్విడ్ మూడు అంకెల వేగాన్ని సులభంగా చేరుకుంటుంది. ఏమైనప్పటికీ, AMT యొక్క నెమ్మదిగా ఉండే తత్వం అనేది ఓవర్‌టేక్స్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ AMT నెమ్మదిగా ఉండే వేగాలలో అంత చిరాకు అయితే తెప్పించదు కానీ ఈ క్లైంబర్ యొక్క గేర్‌బాక్స్ అనేది ఓవర్‌టేక్స్ చేస్తున్నపుడు మటుకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
క్విడ్ క్లైంబర్ AMT 100Kmph వెళ్ళడానికి 17.30 సెకన్లు సమయం తీసుకుంది మరియు 20-80Kmph ని అందుకోడానికి 9.45 సెకండ్ల సమయం తీసుకుంటుంది. విచారంగా, క్విడ్ యొక్క బ్రేక్లు ఆ పవర్ లేకపోవడం మరియు ABS వంటి ఆప్షన్ కూడా లేకపోవడం అనేది బాధాకరం. ఈ కారు 100kmph నుండి ఆగడానికి 59.67 మీటర్స్ దూరం వెళ్ళి ఆగుతుంది, అది కూడా అంత ఆహ్లాదకరంగా ఉండదు.
రైడ్ మరియు నిర్వహణ
క్విడ్ యొక్క రైడ్ అనేది నగరం కోసం బాగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి పెద్ద గుంతలు మరియు పదునైన బంప్స్ ని కానీ క్యాబిన్ లోనికి సులభంగా అనుభూతి చెందుతారు. ఇది చిన్న బంప్స్ మరియు చిన్న స్పీడ్‌బ్రేకర్స్ వచ్చినట్లయితే సునాయాసంగా దానిని దాటేస్తారు. సస్పెన్షన్ కూడా చాలా వేగంగా ఉంటూ ఏదైనా రోడ్డు మీద గతకలు గానీ వస్తే తిందరగా అది తీసుకొని మిమ్మల్ని ఎగిరి పడే అనుభూతి కలిగించకుండా చూస్తుంది. ఈ లక్షణం హైవే మీద మరింత సహాయపడుతుంది, అయితే ఒక నిర్దిష్ట వేగంలో మాత్రమే.
ఈ క్విడ్ యొక్క సన్నపాటి టైర్స్ అయిన 155/80 R13 టైర్ల కారణంగా, విరిగిన రహదారులపైకి వెళుతున్నప్పుడు కొంచెం అస్థిరంగా ఉంటుంది. ఎక్కువ వేగాలలో వెళితే ఈ కారు తేలికగా ఉండడం వలన మరియు సన్నని టైర్లు కారణంగా మీరు స్టీరింగ్ దిద్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది. వేగంగా కార్నర్స్ లో వెళుతున్నప్పుడు బాడీ రోల్ అవుతుంది, కానీ మరీ అంత ఇబ్బందికరంగా ఏమీ ఉండదు.
స్టీరింగ్ అనేది తేలికగా ఉంటుంది మరియు నగరం లోపల ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. U-టర్న్స్ తీసుకోవడం చాలా సులభంగా ఉంటుంది, కానీ టైర్లు నుండి దీనికి అంత సాన్నిహిత్యం అయితే ఉండదు. స్పష్టంగా, సస్పెన్షన్ మరియు స్టీరింగ్ సెటప్ తో, క్విడ్ నగరం లోపల బాగానే నడుస్తుంది, కానీ అధిక వేగంతో వెళుతూ ఉన్నప్పుడు మీకు అంత నమ్మకం అయితే అందించదు.
భద్రత
NCAP క్రాష్ పరీక్షల తరువాత, క్విడ్ భద్రతకు చెడ్డపేరును తెచ్చిపెట్టింది. ఈ యొక్క ఇమేజ్ ని మెరుగుపరచుకోడానికి క్విడ్ పెద్దగా ఏమీ చేయలేదని చెప్పాలి. ఇది వెనుక ఏళృ (ఎమర్జెన్సీ లాకింగ్ రెట్రాక్టర్) సీటుబెల్ట్స్ ని అందించింది, ఇది ఒక ఏవరేజ్ రిక్ట్రాక్టబుల్ సీటుబెల్ట్స్ కి మారు పేరు అని చెప్పవచ్చు. అలాగే, RXTమరియు క్లైంబర్ వైవిధ్యాలు ఇప్పుడు డ్రైవర్ యొక్క ఎయిర్బ్యాగ్ ని ప్రమాణంగా పొందుతాయి. అయినప్పటికీ, మిగిలిన మూడు వేరియంట్లలో ఇప్పటికీ అవి లేవు. మరోవైపు, ఆల్టో K10 అన్ని వేరియంట్లపై ఆప్ష్నల్ డ్రైవర్-సైడ్ ఎయిర్బాగ్ ని కలిగి ఉంది. ఇంకా దీనిలో ABS వంటి కీలకమైన భద్రతా లక్షణాలు కూడా రెండు కార్లలో అందించడం జరగదు.
తీర్పు
రెనాల్ట్ క్విడ్ ఈ సెగ్మెంట్ లో అత్యంత కుర్ర కారుని ఊరించే సమర్పణలలో ఒకటిగా ఉంది. ఇది ఇది రెండు విభాగాల పైన ఉండే లక్షణాలను కలిగి ఉంది, విశాలమైన క్యాబిన్ ని కలిగి ఉంటుంది మరియు మంచి ఇంధన సమర్ధవంతమైనది కూడా. 2018 నవీకరణ తో, రెనాల్ట్ ఒక రివర్స్ కెమెరా, క్రీప్ ఫంక్షన్ తో AMT, రివర్స్ కెమెరా మరియు రిక్ట్రాక్టబుల్ సీట్‌బెల్ట్స్ వంటి లక్షణాలను అందిస్తూ మీ డబ్బు కి విలువని అందించే ఉత్తమమైన సిటీ కారుగా తయారుచేస్తుంది. డబ్బు కి విలువని అందించే ప్రతిపాదనను పెంచుకోడానికి ధరలను అదే విధంగా ఉంచింది. మీరు గనుక రెనాల్ట్ క్విడ్ ని మైండ్ లో ఉంచుకోగలిగినట్లయితే ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఒకటి తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ డీల్ అనేది ఇంకా తియ్యగా మారిందని చెప్పవచ్చు.