వోల్వో ఇండియా వారు ఎక్స్ సీ90 ఎస్యూవీ కోసమై 266 ప్రీ-ఆర్డర్లను పొందారు
వోల్వో ఎక్స్ 90 కోసం raunak ద్వారా సెప్టెంబర్ 07, 2015 10:14 am ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: రెండవ తరం వోల్వో ఎక్స్ సీ90 భారతదేశం లో మే లో విడుదల అయ్యి 266 ప్రీ-ఆర్డర్లను అందుకుంది. ఈ స్వీడిష్ తయారీదారి దీనిని రూ.64.9 లక్షల (ఎక్స్-షోరూం, ముంబై, ప్రీ-ఆక్ట్రాయ్) ధరకి విడుదల చేసి అప్పటి నుండే బుకింగ్స్ ని తెరిచింది, కాకపోతే డెలివరీలు ఈ నెల నుండి ప్రారంభం అవుతాయి. ఈ ఎస్యూవీ కేవలం రెండు ట్రింలలో మాత్రమే లభిస్తుంది. అది కూడా కేవలం డీజిల్ ఇంజునుతోనే అందించబడుతోంది. మొమెంటం ట్రిం రూ.64.9 లక్షలు ఉండగా, ఉన్నత శ్రేని ట్రిం అయిన ఇన్స్క్రిప్షన్ రూ.77.9 లక్షల ధర వద్ద ఆకర్షిస్తోంది.
ఈ ఎక్స్ సీ90 ని ఎస్పీఏ (స్కేలబుల్ ప్లాట్ఫార్మ్ ఆర్కిటెక్చర్) అనే వోల్వో యొక్క బ్రాండ్ టెక్నాలజీ ఆధారితంగా నిర్మించబడింది. ఇది అంతకు పూర్వం వాహనాల కంటే తేలికైన బరువు కలవు. ఇందులో 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల ట్విన్-టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిను కలదు. ఇది 4,250ఆర్పీఎం వద్ద 225బీహెచ్పీ శక్తి ని మరియూ 1750-2500ఆర్పీఎం వద్ద 470ఎనెం యొక్క గరిష్ట టార్క్ ని విడుదల చేస్తుంది. ట్రాన్స్మిషన్ బాద్యత విషయానికి వస్తే 8-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా అన్ని నాలుగు వీల్స్ కి ఏడబ్ల్యూడీ సిస్టము ద్వారా అందించబడుతుంది.
ఈమధ్య, 2015 వోల్వో ఎక్స్ సీ90 కి పూర్తి 5 స్టార్లు 2015 యూరో ఎన్సీఏపీ క్రాష్ అస్సెస్మెంట్ పరీక్ష్లో పొందింది. పైగా, యూరో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కార్ టు కార్ రేర్-ఎండ్ పరీక్ష లో (ఏఈబీ సిటీ & ఏఈబీ ఇంటరుర్బన్) లో పూర్తి మార్కులు సాధించిన మొట్టమొదటి వాహనం ప్రపంచంలో. ఈ సురక్షణ ఎక్స్ సీ90 లో ప్రామాణికంగా అందిస్తున్నారు.
0 out of 0 found this helpful