వోక్స్వ్యాగన్ 2.0L డీజిల్ మిల్ ఉత్పత్తి స్థానికంగా చేయాలని యోచిస్తుంది
ఫిబ్రవరి 02, 2016 06:39 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వోక్స్వ్యాగన్, దాని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ యొక్క ఉత్పత్తి స్థానికంగా చేయాలని యోచిస్తుంది. ఈ ఇంజిన్ స్కోడా ఆక్టావియా మరియు ఆడీ A3 వంటి భారతదేశంలో అమ్ముడుపోయే పలు కార్లకు కూడా శక్తిని అందిస్తుంది. ఈ నిర్ణయం జర్మన్ కార్ల తయారీ సంస్థ గత సంవత్సరం వారి 1.5 లీటర్ డీజిల్ తయారు చేస్తున్న సమయంలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిని పూనే చకన్ ప్లాంట్ లో అసెంబుల్ చేస్తున్నారు. 2.0 లీటర్ మిల్లు, BS-VI నిబంధనలను పాటిస్తుంది మరియు ఇది ఇంకా భారతదేశంలో అమలు చేస్తారు, దీని అర్ధం ఈ కారు భారతదేశంలో ఎమిజన్ నార్మ్ విషయాలలో దిగులు చెందవలసిన అవసరం లేదు అని. ప్రభుత్వం BS-V ప్రమాణాలు దాటవేసి, నేరుగా 2020 ద్వారా BS-VI లోకి ప్రవేసించాలని యోచిస్తోంది.
ఈ యొక్క విభాగంలో పెరుగుతున్న కార్ల యొక్క అమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతటి పెద్ద మొత్తాన్ని దీనిలో పెట్టడం అనేది న్యాయమైన విషయమే. మన దేశంలో వాహనాలు తయారుచేయడం వలన వాహనాల స్పేర్ పార్ట్స్ ఉత్పత్తి మరియు తయారీ ప్రక్రియ వేగవంతం చేయవచ్చు. EA288 గా కూడా పిలవబడే ఈ మిల్ కొత్త తరం ఆడీ A4 మరియు కొత్త స్కోడా సూపర్బ్ వలే వోక్స్వ్యాగన్ సంస్థ యొక్క రాబోయే కార్లలో కూడా ఉండబోతోంది. MQB వేదిక ఎక్కువగా EA288 ఇంజన్లలో నడుస్తుంది మరియు భవిష్యత్తు నమూనాలు కూడా అదే ఉపయోగించే అవకాశం ఉంది.
వోక్స్వ్యాగన్ సంస్థ కొద్ది రోజుల్లో విడుదలవ్వబోయే ఏమియో యొక్క ట్రీజర్ తో అలజడి సృష్టిస్తుంది. కారు 2016 ఆటో ఎక్స్పో లో వచ్చే అవకాశం ఉంది. ఇది వెంటో మరియు పోలో లో అందించబడే రెండు 4-సిలిండర్ 1.5 లీటర్ మిల్లులు ద్వారా ఆధారితం చేయబడి వరుసగా 90PS శక్తిని మరియు 105PS శక్తిని అందిస్తుంది.