• English
  • Login / Register

2015 ఆగష్టు 20 న బహిర్గతం కాబోతున్న అప్డేటెడ్ మారుతీ సుజుకీ ఎర్టిగా

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం sameer ద్వారా జూలై 15, 2015 04:28 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: గతంలో, మేము మారుతి, మధ్య శ్రేణి వేరియంట్ అయిన ఎం యు వి ఎర్టిగా పై పనిచేస్తుందని తెలిపాము. ఇది భారతీయ మరియు ఇండోనేషియా మార్కెట్ లో బాగా రాణిస్తోంది. స్విఫ్ట్ యొక్క ప్లాట్ఫారమ్ ఆధారంగా, ఎర్టిగా వాణిజ్య వినియోగదారులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కాని ఇది ఎక్కువగా ఒక సి-సెగ్మెంట్ సెడాన్ ధర వద్ద ఎం పివి అన్ని లక్షణాలు ఎవరికీ అవసరమవుతాయో అలాంటి సాధారణ భారతీయ కుటుంబాల కొరకు ఆశక్తి చూపిస్తుంది. మార్కెట్లో బాగా పోటీ లక్ష్యంతో కంపెనీ ,ఇండోనేషియన్ అంతర్జాతీయ మోటార్ షో లో ఆగస్టు 20, 2015 న ఈ ప్రసిద్ధ ఎం యు వినవీకరించబడిన వెర్షన్ ని బహిర్గతం చేయబోతున్నది. త్వరలోనే ఇది భారతదేశంలో అత్యుత్తమమైన స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నాము. 

బాహ్య స్టైలింగ్ ట్వీక్స్ పక్కన పెడితే, ఫేస్లిఫ్ట్ ఎర్టిగా కూడా అంతర్గత మార్పులతో వస్తోంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లో కాబిన్ కొత్త అపోలిస్ట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పుష్ స్టార్ట్ బటన్ తో అందించబడుతుంది. అంతేకాకుండా నవీకరించబడిన సమాచార వ్యవస్థతో పాటూ పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్ తో అందించబడుతుందని ఆశిస్తున్నాము. దీని బాహ్య భాగానికి వస్తే, ఇది క్రోమ్ ఇన్సర్ట్స్ కలిగి ఒక అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్ తో పాటు, క్రోమ్ స్లాట్స్ తో ఆకర్షణీయంగా రాబోతున్నది. దీని ఎగువ శ్రేణి వేరియంట్లలో కొత్త అల్లాయ్ వీల్ నమూనా వస్తోంది మరియు దిగువ శ్రేణి వేరియంట్లలో ప్రత్యేకమైన వీల్ కాప్ డిజైన్ తో రాబోతున్నది. అయితే, ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్లో అతి పెద్ద మార్పు ఆటో గేర్ షిఫ్ట్ ని చేర్చడం. సంస్థ చాలా సార్లు ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్) ని ప్రతీ విభాగానికీ కావాలనుకున్నట్లు తెలిపారు. ఈ ఫేస్లిఫ్ట్ ఎర్టిగా చివరికి ఆటో గేర్ షిఫ్ట్ ని పొందింది.

ఇంజిన్ గురించి చెప్పలంటే, సంస్థ దీనిలో మునుపటి ఇంజిన్ నే ఉపయోగిస్తుంది కానీ దానికంటే ఇది మంచి ఇంధన సామర్థ్యంతో వస్తుంది. ఎర్టిగా లో ఈ నవీకరణలు ఆధారంగా మారుతీ సంస్థ ,హోండా మొబిలియో మరియు ఇటీవలే విడుదల రెనాల్ట్ లాడ్జీ ఎం పి వి లతో పొటీ పడుతుందని ఊహించవచ్చు. 

was this article helpful ?

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience