• English
  • Login / Register

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారీత మారుతి MPV ఆవిష్కరణ తేదీ

మారుతి ఇన్విక్టో కోసం rohit ద్వారా జూన్ 09, 2023 11:49 am ప్రచురించబడింది

  • 76 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి నుండి వస్తున్న ఈ కొత్త MPV జులై 5వ తేదీన ఆవిష్కరించబడుతుంది

Maruti MPV teaser

  • ఇది మారుతి అందిస్తున్న కొత్త టాప్ ఎండ్ మోడల్, గ్రాండ్ విటారా కంటే ఎగువ స్థానంలో నిలుస్తుంది.

  • రూ.20 లక్షల కంటే ఎక్కువ (ఎక్స్-షోరూమ్) ధరతో MPVని మొదటిసారిగా అందించనున్న మారుతి.

  • ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్ నుండి అవే ప్రామాణిక మరియు హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚలను పొందుతుంది.

  • 10-అంగుళాల టచ్ؚస్క్రీన్, పనోరమిక్ సన్ؚరూఫ్ మరియు ADAS వంటి ఫీచర్‌లతో వస్తుంది.

  • ఇది ఆగస్ట్ 2023లో విడుదల అవుతుందని అంచనా.

డిసెంబర్ 2022లో టయోటా ఇన్నోవా హైక్రాస్ విడుదల అయ్యింది. విడుదల తరువాత, ఈ టయోటా MPVకి స్వరూపంగా ఉండే మరొక వాహనం మారుతి నుండి వస్తుంది అని వెల్లడించారు, ట్రేడ్ؚమార్క్ؚల ప్రకారం ఇది “ఎంగేజ్” పేరుతో ఆవిష్కరించవచ్చు. మొదటిసారిగా మారుతి ఈ MPV గురించి నిర్దారించింది, జులై 5వ తేదీన ఆవిష్కరించబడుతుందని కారు తయారీదారు తెలియజేశారు.

ఇప్పటివరకు తెలిసింది ఏమిటి

Toyota Innova Hycross-based Maruti MPV

టయోటా మరియు మారుతి మధ్య ఇటీవల పంచుకున్న మోడల్‌ల విధంగానే, ఇన్నోవా హైక్రాస్-ఆధారిత ప్రయాణీకుల వాహనంలో కూడా ముందు మరియు వెనుక భాగాలలో లుక్ పరంగా కొన్ని తేడాలు మరియు ప్రత్యేకమైన అప్హోల్ؚస్ట్రీ ఉండవచ్చు. మారుతి లైనప్ؚలో ఇది కొత్త ఫ్లాగ్ؚషిప్ వాహనంగా, గ్రాండ్ విటారా కంటే ఎగువన, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మారుతి వాహనాలలో ఖరీదైన మోడల్‌గా నిలుస్తుంది. ఇది ఎర్టిగా మరియు XL6 తరువాత ఈ కారు తయారీదారు అందిస్తున్న మూడవ MPV.

రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే అధిక ధరను కలిగి ఉన్న అన్నీ వేరియెంట్‌ల MPVని మారుతి మొదటిసారిగా అందించే ప్రయత్నం చేస్తుంది. మారుతి బ్రాండ్‌ను ఇష్టపడే వారు ప్రీమియం MPV కొనుగోలు చేయడానికి మరే ఇతర బ్రాండ్‌ల వైపు చూడవలసిన అవసరం లేదు.

సంబంధించినది: CD మటాలలో: మారుతి MPV కోసం రూ.30 లక్షల కంటే ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి

పరీక్షించిన పవర్ؚట్రెయిన్ؚలు

మారుతి వెర్షన్ గల టయోటా ఇన్నోవా హైక్రాస్ అవే పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది. ప్రామాణికంగా, ఈ MPV CVTతో జోడించిన 2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో (174PS/205Nm) వస్తుంది. టయోటా MPV 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ؚను ఉపయోగించి 186PS పవర్‌ను (కంబైన్డ్) అందించే బలమైన-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚను కూడా కలిగి ఉంది. ఇది e-CVTతో జోడించబడుతుంది, 21kmpl క్లెయిమ్ చేసిన మైలేజ్ؚను అందిస్తుంది.

అనేక ఫీచర్‌లతో వస్తుంది 

Toyota Innova Hycross cabin

టయోటాలో అందించిన విధంగానే, మారుతి MPV ఫీచర్‌ల జాబితాలో 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్ؚరూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు మరియు పవర్డ్ ముందు మరియు రెండవ వరుస సీట్‌లు ఉన్నాయి, రెండవ వరుస సీట్‌లు ఒటోమాన్ ఫంక్షనాలిటీతో వస్తాయి. 

దీని భద్రత కిట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ మరియు డిసెంట్ అసిస్ట్ؚలు, అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉంటాయి.

ఇది కూడా చదవండి: కార్ؚప్లే మరియు మ్యాప్స్ అప్లికేషన్‌ల కోసం ఆకర్షణీయమైన కొత్త ఫీచర్‌లతో రానున్న యాపిల్ iOS 17

అంచనా విడుదల మరియు ధర 

Toyota Innova Hycross rear

కొత్త ఫ్లాగ్‌షిప్ MPVని మారుతి ఆగస్ట్ 2023 నాటికి విడుదల చేస్తుందని అంచనా. దీని ధర రూ.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. మారుతి MPV నేరుగా తన డోనర్, టయోటా ఇన్నోవా హైక్రాస్ؚతో పోటీ పడనుంది, కియా క్యారెన్స్ؚకు మరింత ప్రీమియంగా మరియు కియా కార్నివాల్ కంటే చవకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti ఇన్విక్టో

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience