టయోటా ఇన్నోవా క్రిస్టా CNG మొదటిసారిగా మా కంటపడింది
టయోటా ఇనోవా క్రిస్టా 2016-2020 కోసం dhruv attri ద్వారా జనవరి 23, 2020 04:51 pm ప్రచురించబడింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇన్నోవా క్రిస్టా మాత్రమే ఎర్టిగా తర్వాత CNG వెర్షన్‌ను అందించే ఏకైక MPV అవుతుంది
- టయోటా ఇన్నోవా క్రిస్టా CNG 5-స్పీడ్ MT తో 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆధారంగా ఉంటుంది.
- ఇది ప్రస్తుత మొడల్స్ లానే ఉంటూ వెనుక విండ్‌షీల్డ్‌లోని CNG స్టిక్కర్ ని కలిగి ఉంటుంది.
- రెగ్యులర్ మోడల్ కంటే సుమారు రూ .80,000 నుండి లక్ష రూపాయల ప్రీమియం ధర నిర్ణయించబడుతుంది.
- దీని లాంచ్ రాబోయే రెండు నెలల్లో ఉంటుందని ఊహిస్తున్నాము.
టయోటా ఇన్నోవా క్రిస్టా BS 6 కంప్లైంట్ ఇంజన్లను ప్రవేశపెట్టడంతో రూ .1.32 లక్షల వరకు ధరల పెరుగుదలను చూసింది. పెట్రోల్ వేరియంట్ ధరలు 63,000 రూపాయల వరకు పెరగడంతో, ఇన్నోవా అమ్మకాలు పెద్దగా పెరగలేదు. అందువల్ల, దాని ఆకర్షణను విస్తృతం చేయడానికి, టయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క CNG వెర్షన్‌ను అందించనుంది, ఇది మొదటిసారిగా టెస్టింగ్ అవుతూ మా కంటపడింది.
ఈ రెండు ఫ్యుయల్ వేరియంట్ ఇన్నోవా క్రిస్టా యొక్క 2.7-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆధారంగా ఉంటుంది. దాని సాధారణ స్థితిలో, ఇది 166PS పవర్ మరియు 245Nm టార్క్ ను అందిస్తుంది, కాని CNG వెర్షన్ నుండి కొంచెం తక్కువ సంఖ్యలను మనం ఆశించవచ్చు.
కన్వెన్షనల్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో జత చేయబడింది, అయితే CNG వెర్షన్ మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ మాత్రమే పొందుతుంది. ఇన్నోవా క్రిస్టా యొక్క ఈ వెర్షన్ వెనుక విండ్‌షీల్డ్‌లోని CNG మినహాయిస్తే బేసిక్ వెర్షన్ లానే కనిపిస్తుంది.
ఇది ఏప్రిల్ 2020 నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి, మీరు కొనుగోలు చేయగల 7 సీట్ల CNG ఆఫర్ మారుతి ఎర్టిగా మాత్రమే. ఇన్నోవా క్రిస్టా CNG కి టయోటా వసూలు చేసే దానిలో సగం ఖర్చు అవుతుంది. ఇన్నోవా క్రిస్టా CNG బేస్ G వేరియంట్ పై ఆధారపడి ఉంటుందని, పెట్రోల్ వేరియంట్‌పై 80,000 నుంచి 1 లక్షల ప్రీమియంను ఆదేశించవచ్చని మేము ఆశిస్తున్నాము.
ఇన్నోవా క్రిస్టా యొక్క లైనప్ లో CNG ఎంపికను చేర్చడం వల్ల దాని ప్రత్యర్థులైన మహీంద్రా మరాజో, టాటా హెక్సా, టాటా గ్రావిటాస్ మరియు రాబోయే 7-సీట్ల MG హెక్టర్లకు ఇది మరింత ఉత్సాహం కలిగించే ప్రత్యామ్నాయంగా మారుతుంది.
టయోటా ఇన్నోవా క్రిస్టా BS6 మోడల్స్ ప్రారంభించబడ్డాయి. ధర 1.32 లక్షల వరకు ఉంటుంది
మరింత చదవండి: ఇన్నోవా క్రిస్టా డీజిల్