2019 డిసెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు
జనవరి 18, 2020 01:37 pm rohit ద్వారా ప్రచురించబడింది
- 31 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ జాబితాలో మారుతి సుజుకి నుండి 8 మరియు హ్యుందాయ్ నుండి 2 మోడళ్లు ఉన్నాయి
2019 భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గణనీయమైన తగ్గుదల నమోదు చేసిన సంవత్సరం అయినప్పటికీ, కొన్ని కార్లు చివరి నెలలో కొన్ని అద్భుతమైన సంఖ్యలను నమోదు చేయగలిగాయి. 2019 డిసెంబర్‌లో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన 10 కార్లు ఇక్కడ ఉన్నాయి:
Rank |
మోడల్ |
డిసెంబర్ 2019 అమ్మకాలు |
1 |
మారుతి బాలెనో |
18,464 యూనిట్స్ |
2 |
మారుతి ఆల్టో k10 |
15,489 యూనిట్స్ |
3 |
మారుతి డిజైర్ |
15,286 యూనిట్స్ |
4 |
మారుతి స్విఫ్ట్ |
14,749 యూనిట్స్ |
5 |
మారుతి విటారా బ్రెజ్జా |
13,658 యూనిట్స్ |
6 |
మారుతి వాగన్ఆర్ |
10,781 యూనిట్స్ |
7 |
హ్యుందాయ్ వెన్యూ |
9,521 యూనిట్స్ |
8 |
మారుతి ఎస్-ప్రెస్సో |
8,394 యూనిట్స్ |
9 |
హ్యుందాయ్ ఎలైట్ i 20 |
7,740 యూనిట్స్ |
10 |
మారుతి ఈకో |
7,634 యూనిట్స్ |
ముఖ్యమైన అంశాలు
- బాలెనో 2019 డిసెంబర్ లో దాదాపు 18,500 యూనిట్లు అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో మొత్తం 11,135 యూనిట్ల అమ్మకాలతో 6 వ స్థానంలో నిలిచింది.
- జాబితాలో ఉన్న 8 మారుతి కార్లలో, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ మరియు విటారా బ్రెజ్జా ఇప్పటికీ డీజిల్ ఇంజన్లతో అందించబడుతున్నాయి. ఏదేమైనా, ఏప్రిల్ 1, 2020 తర్వాత డీజిల్ ఇంజిన్లను తొలగించాలని మారుతి నిర్ణయించినందున వారి డీజిల్ వెర్షన్లు BS6 యుగంలో అందించబడవు.
- మారుతి విటారా బ్రెజ్జా యొక్క BS 6-కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ వెర్షన్ ను Auto Expo 2020 ఆటో ఎక్స్పో 2020 లో విడుదల చేయనుంది.
- గత సంవత్సరం అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్టో K10 డిసెంబర్ 2019 లో రెండవ స్థానానికి చేరుకుంది. దీని అమ్మకాలు ఏడాది వ్యవధిలో దాదాపు 10,000 యూనిట్ల వరకు తగ్గాయి.
- ఈ ఏడాది కూడా వరుసగా 4 వ స్థానంలో నిలిచిన స్విఫ్ట్ గత ఏడాదితో పోలిస్తే 25 శాతానికి పైగా వృద్ధిని సాధించింది.
- వాగన్ఆర్, వెన్యూ మరియు ఎస్-ప్రెస్సో మూడు మోడళ్లను 2019 లో లాంచ్ చేసినందున ఈ జాబితాలో కొత్తగా ప్రవేశించాయి.
- హ్యుందాయ్ త్వరలో BS 6-కంప్లైంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లను వెన్యూ లో ప్రవేశపెట్టనుంది మరియు ఇవి ప్రస్తుత 1.4-లీటర్ డీజిల్ స్థానంలో సెల్టోస్ నుండి 1.5-లీటర్ యూనిట్ ని భర్తీ చేస్తుంది.
- మొత్తం గా చూస్తే గనుక, టాప్ 10 కార్లు మొత్తం 1,21,716 యూనిట్లను విక్రయించాయి, తద్వారా 2019 డిసెంబర్‌లో విక్రయించిన మొత్తం కార్ల సంఖ్యలో 52 శాతం వాటా ఉంది.
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?
0 out of 0 found this helpful