మారుతి ఎర్టిగా CNG మునుపటి కంటే కూడా మరింత శుభ్రంగా ఉంది!
మారుతి ఎర్టిగా 2015-2022 కోసం rohit ద్వారా ఫిబ్రవరి 13, 2020 11:50 am ప్రచురించబడింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పవర్ మరియు టార్క్ గణాంకాలు అదే విధంగా ఉండగా, BS6 అప్‌గ్రేడ్ ఎర్టిగా CNG యొక్క ఫ్యుయల్ ఎఫిషియన్సీ 0.12km /kg కి తగ్గించింది
- మారుతి ఎర్టిగా CNG ని 2019 జూలై లో విడుదల చేసింది, తరువాత BS 6 ఎర్టిగా పెట్రోల్ ను విడుదల చేసింది.
- ఈ CNG కిట్ MPV యొక్క VXi వేరియంట్ లో అందించడం కొనసాగుతోంది.
- ఇది 92Ps పవర్ మరియు 122Nm టార్క్ ను అందిస్తుంది మరియు 5-స్పీడ్ MT కి జత చేయబడి ఉంది.
- ఇది మునుపటి మాదిరిగానే అదే లక్షణాలతో అందించబడుతోంది.
మారుతి ఎర్టిగా CNG ని జూలై 2019 లో VXi వేరియంట్ లో విడుదల చేసింది. ఇప్పుడు, కార్ల తయారీసంస్థ ఎర్టిగా CNG యొక్క BS 6-కంప్లైంట్ వెర్షన్ ను రూ .8.95 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. CNG కిట్ మునుపటి VXi వేరియంట్ లో అందించబడుతోంది.
ఇంజిన్ కూడా మునుపటిలాగే ఉంది - 1.5-లీటర్ K15 మోటారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. BS6 నిబంధనలకు అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, దాని అవుట్పుట్ గణాంకాలు ప్రభావితం కావు. అంటే ఇది 92 Ps పవర్ ని మరియు 122Nm టార్క్ ని అందిస్తూనే ఉంది. అయితే, దాని ఫ్యుయల్ ఎఫిషియన్సీ 26.20 కి.మీ / కిలో నుండి 26.08 కి.మీ / కిలోకు పడిపోయింది.
ఇవి కూడా చూడండి: ఆటో ఎక్స్‌పో 2020 వద్ద మారుతి సుజుకి జిమ్నీ : చిత్రాలలో వివరంగా
లక్షణాలకు సంబంధించినంతవరకు, ఇది మునుపటి మాదిరిగానే అదే పరికరాల జాబితాతో వస్తూ ఉంటుంది. ఇందులో బహుళ సమాచార ప్రదర్శన (మోనోక్రోమటిక్ TFT), కీలెస్ ఎంట్రీ మరియు స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో మరియు కాలింగ్ నియంత్రణలతో కూడిన ఆడియో సిస్టమ్ ఉన్నాయి. భద్రత పరంగా, MPV యొక్క CNG వేరియంట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు, స్పీడ్ అలర్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్‌ను ప్రామాణికంగా పొందుతుంది.
ఇదిలా ఉండగా, మారుతి ఎస్-ప్రెస్సో యొక్క CNG వెర్షన్ ని త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది BS 6 యుగంలో డీజిల్ కార్లను అందించనందున దాని సమర్పణల యొక్క BS 6 వెర్షన్లను ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
మరింత చదవండి: మారుతి ఎర్టిగా డీజిల్
0 out of 0 found this helpful