ఈ విభాగంలో 4-సీట్‌ల లౌంజ్ లేఅవుట్ؚను అందిస్తున్న మొదటి వాహనం టాటా సియర్రా
టాటా సియర్రా కోసం tarun ద్వారా జనవరి 27, 2023 10:55 am ప్రచురించబడింది
- 92 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆటో ఎక్స్ؚపోలో కాన్సెప్ట్ వాహనంగా ప్రదర్శించబడిన సియర్రా, ఎలక్ట్రిక్ మరియు ICE వర్షన్‌లు రెండిటిలో అందించబడుతుంది
-
హారియర్‌తో పోలిస్తే, సియర్రా సుమారు 4.4 మీటర్‌ల పొడవు, 200మిమీ తక్కువ ఎత్తు ఉంటుంది.
-
ఐదు-సీటర్ సెట్అప్ؚ, నాలుగు-సీటర్ లౌంజ్ ఎంపికలతో అందించబడుతుంది.
-
లౌంజ్ వర్షన్ؚలో కెప్టెన్ సీట్‌లు ఉంటాయి, వీటిని వెనకకు వాల్చవచ్చు అలాగే వెనకకు/ముందుకు లాగవచ్చు.
-
యాంబియంట్ లైటింగ్, పొడిగించిన లెగ్ రెస్ట్, రేర్ ఎంటర్ؚటైన్ؚమెంట్ స్క్రీన్‌లు ఉంటాయని ఆశించవచ్చు.
-
సియర్రా EV 500కిమీ కంటే ఎక్కువ పరిధితో అందించవచ్చు; ICEలో 1.5 లీటర్‌ల టర్బో-పెట్రోల్ ఉంటుంది.
ఈ ఆటో ఎక్స్ؚపోలో సియారా పునరాగమనం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ SUV ఉత్పత్తి ప్రారంభమైందని, ఎక్స్ؚపోలో చూసిన విధంగా కారు ఉంటుందని దీని తయారీదారు టాటా ధృవీకరించింది.
హారియర్‌తో పోలిస్తే, సియర్రా సుమారు 4.4 మీటర్‌ల పొడవు, 200మిమీ తక్కువ ఎత్తు ఉంటుంది. ఐదు-సీటర్ సెట్అప్ؚ, నాలుగు-సీటర్ లౌంజ్ వర్షన్ؚతో వస్తుంది. ఇది రెండు కెప్టెన్ సీట్లను కలిగి ఉంటుంది, వీటిని వెనకకు వాల్చవచ్చు, వెనకకు/ముందుకు లాగవచ్చు.
ఇవి కూడా చదవండి: ఎట్టకేలకు! టాటా హారియర్, సరికొత్త ఆకర్షణతో ఆల్-వీల్ డ్రైవ్ؚను పొందింది!
అంతేకాకుండా యాంబియంట్ లైటింగ్, బహుళ USB చార్జర్‌లు, కప్ హోల్డర్ؚలతో సెంటర్ ఆర్మ్ؚరెస్ట్, మరింత స్టోరేజీ స్థలం, పొడిగించిన లెగ్ రెస్ట్ؚతో వెనుక సీట్ అనుభవం మరింత మెరుగా ఉండవచ్చు. ఫోల్డింగ్ ట్రేలు, వెనుక భాగంలో ఎంటర్ؚటైన్ؚమెంట్ స్క్రీన్‌లు, వైర్ؚలెస్ చార్జర్ؚలను యాక్సెసరీలుగా అందించవచ్చు. నాలుగు-సీటర్ లౌంజ్ వర్షన్ؚను టాప్ వేరియెంట్ؚగా వస్తుంది అని ఆశించవచ్చు.
సియర్రా EV స్పెసిఫికేషన్ؚలను టాటా ఇంకా వెల్లడించలేదు, కానీ 40.5Wh యూనిట్గల నెక్సాన్ EV మాక్స్‌తో పోలిస్తే సియర్రా పెద్ద బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుందని మా అభిప్రాయం. అంతేకాకుండా, దీని పరిధి 500 కిలోమీటర్‌ల కంటే ఎక్కువగా ఉండవచ్చు అని అంచనా. హారియర్ EV ఆల్-వీల్ డ్రైవ్ؚ కలిగి ఉన్నందున, సియర్రా EV కూడా ఇదే తరహాలో ఉండవచ్చు.
సియర్రా ఎలక్ట్రిక్ వర్షన్‌ను ఎక్స్ؚపోలో ప్రదర్శించిన్నపటికి దీని ICE వర్షన్, చూడటానికి కొన్ని తేడాలతో వస్తుంది. ఇది కొత్తగా ప్రదర్శించిన 170PS, 1.5 లీటర్ TGDi టర్బో-పెట్రోల్ ఇంజన్ؚ మాన్యువల్, ఆటోమ్యాటిక్ గేర్ؚబాక్స్ ఎంపికలతో వస్తుంది.
ఫీచర్‌ల విషయానికి వస్తే, సియర్రా కనెక్టెడ్ కార్ టెక్ؚతో 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, పనోరమిక్ సన్ؚరూఫ్, పెద్ద డిజిటల్ డ్రైవర్ డిస్ؚప్లే మరియు ADAS (ఎడ్వాన్స్ؚడ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్)ؚలతో వస్తుంది.
ఇది కూడా చదవండి: 2020 నుంచి టాటా సియర్రా ఎంత అభివృద్ధి చెందిందో తనిఖీ చేయండి
టాటా, సియర్రా ICE-వర్షన్ ధరను సుమారు రూ.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించవచ్చు, EV వర్షన్ సుమారు రూ.25 లక్షల నుండి ఉండవచ్చు.
0 out of 0 found this helpful