టాటా H2X ఆటో ఎక్స్పో 2020 రివీల్ కి ముందే టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది
టాటా హెచ్2ఏక్స కోసం sonny ద్వారా జనవరి 18, 2020 04:42 pm ప్రచురించబడింది
- 50 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రాబోయే మైక్రో-SUV ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్ వైపు కదులుతోంది
- టాటా H2X ను మొదట కాన్సెప్ట్ రూపంలో 2019 జెనీవా మోటార్ షోలో చూపించడం జరిగింది.
- ప్రొడక్షన్-స్పెక్ మోడల్ మొదటిసారిగా ఆటో ఎక్స్‌పో 2020 లో అడుగుపెట్టనున్నదని ఆశిస్తున్నాము.
- 2020 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- టాటా సంస్థ H2X ని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పెట్రోల్ తో మాత్రమే అందించబడే మైక్రో SUV గా అందించే అవకాశం ఉంది.
- ఇది మారుతి ఇగ్నిస్, మహీంద్రా KUV 100 NXT మరియు రాబోయే వాగన్ఆర్ ఆధారిత XL 5 వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.
టాటా యొక్క కొత్త మైక్రో-SUV H2X కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకుంది, ఇది మొదటిసారిగా టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది. అయితే ఈ కారు భారీగా కవర్ చేయబడి ఉన్న కూడా దాని వెనుక డిజైన్ అంశాలు మరియు నిష్పత్తులు H2X కు సమానంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇది 2019 జెనీవా మోటార్ షోలో ప్రారంభమైనప్పుడు, టాటా సంస్థ H2X యొక్క ప్రొడక్షన్ కి దగ్గరగా ఉన్న మోడల్ ను రాబోయే ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శిస్తామని హామీ ఇచ్చింది. ఈ H2X సబ్ -4m నెక్సాన్ SUV కింద స్థానంలో ఉంచబడుతుంది. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆధారపడి ఉన్న అదే ఆల్ఫా ARC ప్లాట్‌ఫాంపై ఇది కూడా ఆధారపడి ఉంటుంది.
జెనీవా షో కారు యొక్క నిష్పత్తులు ఇక్కడ ఉన్నాయి:
పొడవు |
3840mm |
వెడల్పు |
1822mm |
ఎత్తు |
1635mm |
వీల్బేస్ |
2450mm |
స్టైలింగ్ పరంగా, అది కాన్సెప్ట్ యొక్క స్టైలింగ్ లో ఎక్కువ భాగాన్ని ప్రొడక్షన్-స్పెక్ H2X లోకి తీసుకువెళుతుందని టాటా సంస్థ పేర్కొంది. ప్రొడక్షన్-స్పెక్ మోడల్ పెద్ద బంపర్స్ మరియు కాన్సెప్ట్ నుండి హెడ్‌ల్యాంప్స్ పైన ఉన్న స్ప్లిట్ టైప్ LED DRL లను కలిగి ఉంటుంది.
H2X కారు ఆల్ట్రోజ్ మాదిరిగానే BS 6 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుందని భావిస్తున్నాము. టాటా తన 1.05-లీటర్ డీజిల్ ఇంజన్ ను ఏప్రిల్ 2020 తరువాత అందించడం లేదు కాబట్టి, H2X మారుతి మరియు రెనాల్ట్ మోడల్స్ లాగా పెట్రోల్ తో మాత్రమే అందించబడవచ్చు. ఆల్ఫా ARC ప్లాట్‌ఫాం ఎలక్ట్రిఫికేషన్ కి సిద్ధంగా ఉన్నందున H2X ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా పొందవచ్చు. టాటా 2021 చివరలో H2X ఎలక్ట్రిక్ మైక్రో-SUV ని పరిచయం చేయగలదు.
టాటా H2X ను రూ .5.5 లక్షల నుంచి రూ .8 లక్షల ధర పరిధిలో అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కారు మహీంద్రా KUV 100 మరియు ఫోర్డ్ ఫ్రీస్టైల్ వంటి వాటికి ఆ ధరల శ్రేణి లోని మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్‌లతో పోటీపడుతుంది.
0 out of 0 found this helpful