ఇండియాలో రెండు ATVలను లాంచ్ చేసిన సుజుకి
డిసెంబర్ 08, 2015 06:16 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఈ శనివారం అన్నిభూభాగాలలో తిరిగే రెండు ATV మోడల్స్ ని సుజుకి దేశంలో ప్రవేశపెట్టింది. పూణేలో జరిగిన ఇండియన్ సూపర్ బైక్ ఫెస్టివల్ సంధర్బంగా వీటిని లాంచ్ చేయడం జరిగింది. ఈ 250cc మరియు 400cc బైక్ ల ధరలు వరసగా రూ.5.45లక్షలు మరియు 8.5లక్షలు(ఎక్స్-షోరుమ్,డిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
అయితే విశ్రాంతి మరియు ఆహ్లాదకరమైన రైడ్ కొరకు OZARK 250 ATVని, Quadsport Z400 వాహనం స్పోర్టీ లుక్ మరియు అధనపు టార్క్ ని అందిస్తుంది. అంతేకాకుండా ఆఫ్-రోడ్ల పై అధిక సామర్ధ్యం కొరకు బలమైన మరియు స్పోర్టీవ్ చ్యాసీస్ ని అమర్చారు.
ప్రస్తుతానికి ఈ ATVలను ముంబై, హైదరాబాద్, ఢిల్లీ,పూణే, బెంగళూరు,కోల్‌కత మరియు జోధ్‌పూర్ లలో గల సుజుకి డీలర్ల నుండి అమ్మకాలను ప్రారంభిస్తుంది. మార్కెట్ నుండి వచ్చే స్పందన ఆధారంగా ఇతర నగరాలలోని డీలర్లతో సేల్స్ ని పెంచే అవకాశం ఉంది. ధర విషయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ వాహనాల పరిమిత వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని అది నిర్ణయించబడింది. ATVల ఫన్ టూ రైడ్ లక్షణం వల్ల మార్కెట్ లో తమ స్థానాన్ని పొందాక మిగతా నగరాలలో కూడా అమ్మకాలను ప్రారంభిస్తారు.ఈ దేశ యువకులలో పెరుగుతున్న ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని పొలారిస్ కంపెనీ తమ మూడవ ఎక్స్పీరియన్స్ జోన్ ని హర్యానా లో ప్రారంభించారు. (ఇంకా చదవండి)
మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుజుకి మోటర్‌సైకల్ ఇండియా,మాసయోషీ ఇటో మాట్లాడుతూ," భారతదేశంలో మా ఉత్పత్తి లైన్ ని విస్తరించే లక్ష్యంతో వివిధ క్యాటగిరిలలో అంతటా మా నైపుణ్యం ప్రదర్శిస్తూ, మార్కెట్ లోకి మా ప్రసిద్ధ ATV మోడల్స్ ని లాంచ్ చేయడానికి నిర్ణయించాం. ఈ పెరుగుతున్న మార్కెట్ లో గట్టి పట్టు సాధించడానికి, భారతదేశం యొక్క భవిష్యత్తును సుగమం చేయడానికి ఈ వాహనాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు."
ఇవి కూడా చదవండి: