టెస్లా మోడల్ ఎస్ ను చార్జింగ్ చేస్తున్న 'స్నేక్ బాట్' [అమేజింగ్ వీడియో]
ఆగష్టు 07, 2015 05:30 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టెస్లా మోటార్స్ ఇప్పుడు కొంచెం విరామంతో విశ్రాంతి తీసుకుంటుంది! ఇది మోడల్ ఎస్ ను ప్రారంభించినప్పటి నుండి దాని ఎలక్ట్రానిక్ వ్యవస్థలో ఏదో ఒక సమస్యను ఎదుర్కుంటూ, వాటిని పరిష్కరిస్తూ దీనిని అత్యుత్తమ వాహనంగా తయారు చేసింది. ఈ అత్యంత సైన్స్ ఫిక్షన్ వాహనాన్ని ఇప్పుడు మీరు నిరభ్యరంతంగా కొనుగోలు చేయవచ్చు.
జైపూర్: టెస్లా మోటర్స్ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో ఒక కొత్త వీడియోను అప్ లోడ్ చేసారు. అందులో తమ స్వాధికార చార్జర్ , మోడల్ ఎస్ ను చార్జింగ్ చేస్తున్నట్లు చూపిస్తుంది. టెస్లా యొక్క బాస్ ఏలోను మస్క్ దీనిని భవిష్యత్ చార్జర్ ' స్నేక్ బాట్ ' గా ట్వీట్ చేశారు.
రోబోటిక్ ఆటోమాటిక్ చార్జర్ వంటి ఈ మెటల్ స్నేక్, వీడియోలో స్వతంత్రంగా మోడల్ ఎస్ చార్జింగ్ సాకెట్ ను కనుగొని స్వయంచాలకంగా చార్జింగ్ చేస్తుంది. ఈ మెటల్ స్నేక్ చార్జర్ చూడడానికి స్పైడర్ మాన్ 2 మూవీలో డాక్టర్ ఆక్టోపస్ తో పోలికను కలిగి ఉంది( క్రింద చిత్రం).తయారీదారులు, ఇది కేవలం ఒక నమూనా మాత్రమే అని చెబుతున్నారు మరియు ఈ శైలి ఉత్పత్తి వెర్షన్ మా దగ్గర సిద్ధంగా ఉంది అని దీని చివరి ధర ఖరారు చేయడానికి చూస్తున్నామని చెబుతున్నారు.
టెస్లా మోడల్ ఎస్ ను ఛార్జింగ్ చేస్తున్న స్నేక్ బాట్ ను చూడండి!
ఇటీవల, టెస్లా ఈ మోడల్ లో నవీకరణలు చేసింది. దీని టాపింగ్ మోడల్ ఎస్ పి85డి కొత్త లుడిక్రస్ మోడ్ లో వస్తుంది. ఇది 762 హెచ్ పి శక్తిని అదించే విధంగా రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో రూపొందించబడింది. దీని ఇన్సెన్స్ మోడ్ 3+ సెకన్లలో 100 కి.మీ/ గం. వేగంతో గమ్యాన్ని చేరుకుంటుంది కానీ దీని లుడిక్రస్ మోడ్ 2.8 సెకన్లలో 100 కి.మీ/ గం. వేగంతో గమ్యాన్ని చేరుకోగలుగుతుంది.