S-క్రాస్ - మారుతి యొక్క ఇంతకంటే అద్భుతమైన వాహనం ఏది?
మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం nabeel ద్వారా డిసెంబర్ 17, 2015 05:03 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఈ వాహనం ఆగస్టు 05, 2015 న ప్రారంభించబడింది మరియు క్రెటా వాహనానికి పోటీ అని భావించబడింది. ఈ కారు ప్రారంభమయ్యే వరకూ. అంతేకాకుండా కారు ఇప్పటికే హైప్ ఉత్పత్తిని మరింత పేరుని పొందేలా నెక్సా డీలర్‌షిప్ ద్వారా అమ్మకాలకు వెళ్ళింది. అందరు మారుతి ప్రేమికులు ఈ కారు ని ఎంతగానో ఆదర్శిస్తున్నారు మరియు ఆఫ్ రోడింగ్ కావాలనుకునేవారికి ఇది సమర్ధవంతమైన వాహనం. ఈ వాహనన్ని కావలనుకోడానికి ముఖ్య కారణం ఇది బలమైన కస్టమర్ బేస్ ని కలిగి ఉండడం మరియు శక్తివంతమైన ఇంజిన్ ని కలిగి ఉండడం. అయితే, ఈ కారుతో మారుతి కి ప్రీమియం అనే పేరు రాకపోవడానికి గల కారణాలు ఏమిటి?
1. పోటీ
S-క్రాస్ వాహనం హ్యుందాయి క్రెటా కి పోటీగా ఉండబోతోంది, అదే విధంగా నవీకరణలతో ఎకోస్పోర్ట్ మరియు డస్టర్ ని కూడా అధిగమిస్తుంది. హ్యుందాయి తెలివిగా S-క్రాస్ కంటే ముందు క్రెటా ని ప్రారంభించింది మరియు రూ.8 నుండి 12 లక్షల పరిధిలో ఉన్న ఈ ఆఫ్ రోడర్ వాహనం చాలా బుకింగ్స్ ని నమోదు చేసుకుంది. లక్షణాల గురించి మాట్లాడుకుంటే, దీనిలో అనేక లక్షణాల జాబితా ఉన్నప్పటికీ పోటీ కి సంబంధించి మరీ అంత అద్భుతమైన టెక్నాలజీ లు అయితే లేవు.
2. పరిమాణం
ఇది పూర్తి ఆఫ్-రోడింగ్ వాహనం కాకపోయినప్పటికీ దీని పెద్ద పరిమాణం వలన ఇది కొంచెం ఆఫ్-రోడింగ్ లుక్ ని కలిగి ఉంటుంది. S-క్రాస్ వాహనం డస్టర్ తరువాత ఆ విభాగంలో బాగా అభివృద్ధి చెందబడిన రెండవ అతిపెద్ద కారు. క్రెటా తో పోలిస్తే ఈ కారు 30mm పొడవైనది. ఇది చిన్న తేడా అయినప్పటికీ పొడవు కోసం పరితపించే వారికి ఇది సంతృప్తిని ఇస్తుంది.
3. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేకపోవడం
ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యొక్క ట్రెండ్ ఏమిటంటే వాహనతయారీదారులు వారి నమూనాలలో 2 పెడల్ వేరియంట్స్ పరిచయం చేయడం. అయితే క్రెటా వాహనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉంది, S-క్రాస్ ఈ ఎంపికను కలిగి లేకపోయిన కారణంగా కొంత మంది వినియోగదారులను దూరం చేసుకుంది. అయితే, మారుతి ఇప్పుడు వారి మూడవ పెడల్ తొలగించి మరియు త్వరలో మళ్లీ వినియోగదారులు ఆకర్షించడానికి S- క్రాస్ యొక్క ఒక ఆటోమేటిక్ వేరియంట్ ప్రవేశపెడతానని ప్రకటించింది.
4.DDiS 200 మరియు DDiS 320 మధ్య ధర వ్యత్యాసం
డెల్టా DDiS 200 ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.4 లక్షలు మరియు డెల్టా DDiS 320 ధర రూ. 12.3 లక్షలు. అవును, ఒక భారీ సుమారు 3 లక్షల ధర వ్యత్యాశం కేవలం శక్తివంతమైన ఇంజిన్ కోసం అందించబడుతుంది. DDiS 200 కారు ఒక తక్కువ ధర ఉన్న కారు కానీ మరింత శక్తివంతమైన ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది తక్కువ బడ్జెట్ ఉన్న వినియోగదారులకు సాధ్యం కాని పని. క్రెటా వాహనం 1.4 లీటర్ CRDI ఇంజిన్ ని కలిగియుండి అదే శక్తిని అందిస్తుంది. కానీ టార్క్ మాత్రం S-క్రాస్ అందించే 200Nm కాకుండా 220Nm ఉత్తమంగా అందిస్తుంది. ఇది చాలా చిన్న వ్యత్యాశమే అయినప్పటికీ సిటీ డ్రైవింగ్లో మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. ఇప్పటికీ మారుతికి దీని విషయంలో ధర నిర్ధారణ పొందే అవకాశం ఉంది.
5. "SUV" ఫాక్టర్
భారతదేశంలో, SUVలకి ఒక భారీ అభిమానులు ఉన్నారు. ఈ వాహనం సెడాన్ లేదా హ్యాచ్ కంటే మరింత భద్రతను కలిగి ఉండి దృఢంగా ఉన్న కారణంగా ప్రజలు దీనిని కొనుగోలు చేసుకొనేందుకు ఇష్టపడతారు. అలాగే, వారు సెలవుల్లో అప్పుడప్పుడూ ఆఫ్ రోడింగ్ కి కూడా ఈ వాహనాన్ని ఆనందంగా తీసుకెళ్ళవచ్చు. ఇది భారత రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మరియు మస్క్యులైన్ శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన లక్షణాలు కలిగి ఉండడం వలన SUV పైన అందరూ మొగ్గు చూపుతారు. ఈ నిర్ణయం ప్రత్యేకంగా ఒక క్రాసోవర్ మరియు SUV ల మధ్య ఉన్నప్పుడు చాలా మంది క్రెటా ను ఎంచుకుంటారు.