• English
    • Login / Register

    రెనాల్ట్ డస్టర్ vs హ్యుందాయ్ వెన్యూ: పెట్రోల్-AT రియల్-వరల్డ్ మైలేజ్ పోలిక

    హ్యుందాయ్ వేన్యూ 2019-2022 కోసం sonny ద్వారా నవంబర్ 11, 2019 03:51 pm ప్రచురించబడింది

    • 40 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    అదేవిధంగా వేర్వేరు పవర్‌ట్రెయిన్‌లతో కూడిన SUV లు, అయితే వాటిలో ఏది ఎక్కువ సమర్థవంతంగా ఉంటుంది?

    Renault Duster vs Hyundai Venue: Petrol-AT Real-world Mileage Comparison

     రెనాల్ట్ డస్టర్ రెండు 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది మరియు రెండూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కూడా పొందుతాయి. పెట్రోల్ ఇంజిన్‌ ను CVT తో కలిగి ఉండవచ్చు, ఇది RXS(O) వేరియంట్ లో రూ .10 లక్షల (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా) ధరతో అందించబడుతుంది. ఆ ధర వద్ద, ఇది  హ్యుందాయ్ వెన్యూ సబ్ -4m SUV యొక్క పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్‌ తో పోటీపడుతుంది, ఇది రూ .9.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది. 

    మేము పెట్రోల్-ఆటోమేటిక్ మోడళ్లను రెండింటినీ పరీక్షించాము, కాబట్టి నిజ జీవిత డ్రైవింగ్ పరిస్థితులలో వాటి ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని పోల్చి చూద్దాము.

     

    రెనాల్ట్ డస్టర్

    హ్యుందాయి వెన్యూ

    ఇంజిన్

    1498cc పెట్రోల్

    998cc టర్బో-పెట్రోల్

    పవర్

    106PS

    120PS

    టార్క్

    142Nm

    172Nm

    ట్రాన్స్మిషన్

    CVT

    7- స్పీడ్ DCT

    క్లెయిమ్ చేసిన ఫ్యుయల్ ఎఫిషియన్సీ

    15kmpl

    18.15kmpl

    పరీక్షించిన ఫ్యుయల్ ఎఫిషియన్సీ (సిటీ)

    11.68kmpl

    10.25kmpl

    పరీక్షించిన ఫ్యుయల్ ఎఫిషియన్సీ (హైవే)

    14.54kmpl

    16.72kmpl

    వెన్యూ లోని చిన్న, టర్బోచార్జ్డ్ యూనిట్‌ తో పోలిస్తే డస్టర్ పెద్ద, నెచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ ను ఉపయోగిస్తుంది. అయినప్పటికీ, రెనాల్ట్ పవర్ యూనిట్ తక్కువ పనితీరును అందిస్తుంది మరియు వెన్యూ కంటే చాలా భిన్నమైన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని ఉపయోగిస్తుంది.

    ఇవి కూడా చదవండి: రెనాల్ట్ డస్టర్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్: మీరు ఏది కొనాలి మరియు ఎందుకు?

    వీరిద్దరూ తమ క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్ గణాంకాలతో సరిపోలలేరు, కాని డస్టర్ సిటీ డ్రైవింగ్‌ లో మరింత సమర్థవంతంగా పనిచేస్తుండగా, హైవే పై వెన్యూ మరింత పొదుపుగా ఉంది.

     

    50% సిటీ లో & 50% హైవే మీద

    25% సిటీ లో & 75% హైవే మీద

    75% సిటీ లో & 25% హైవే మీద

    డస్టర్

    12.95kmpl

    13.7kmpl

    12.28kmpl

    వెన్యూ

    12.7kmpl

    14.43kmpl

    11.34kmpl

    సిటీ మరియు హైవే డ్రైవింగ్ మధ్య ఏవరేజ్ వినియోగ విషయానికొస్తే, తక్కువ పనితీరుతో రెనాల్ట్ డస్టర్ యొక్క పెట్రోల్-CVT పవర్‌ట్రైన్ ప్రధానంగా  సిటీ వినియోగానికి వచ్చినప్పుడు ఎక్కువ ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని కలిగి ఉంటుంది. వెన్యూ దాదాపు 1 కిలోమీటర్ తక్కువ అందిస్తుంది. కానీ ప్రధానంగా హైవే రాకపోకలు కోసం, డస్టర్‌ తో పోలిస్తే వెన్యూ యొక్క తగ్గిన ఇంజిన్ ఒక లీటరు ఫ్యుయల్ కి అధనంగా ఒక కిలోమీటర్ వరకూ అందిస్తుంది. సిటీ మరియు హైవే డ్రైవింగ్ ని బాలెన్స్ చేసుకొని గనుక చూస్తే, రెండు కార్లు ఒకేలాంటి మైలేజీని అందిస్తాయి, కాని డస్టర్ వెన్యూ కంటే అదనంగా 0.25kmpl తో అంచులను దాటుతుంది. 

    Renault Duster vs Hyundai Venue: Petrol-AT Real-world Mileage Comparison

    సంబంధిత వార్త: హ్యుందాయ్ వెన్యూ  vs ఫోర్డ్ ఎకోస్పోర్ట్: పెట్రోల్-ఆటోమేటిక్ పెర్ఫార్మెన్స్ & మైలేజ్  పోలిక

    మా రోడ్ టెస్ట్ బృందం కార్లను ఫ్యుయల్ ఎఫిషియన్సీ కోసం పరీక్షించేటప్పుడు వాటిని సున్నితమైన పాదంతో నడుపుతుంది, కాబట్టి ఫ్యుయల్ ఎఫిషియన్సీ గణాంకాలు డ్రైవింగ్ స్టైల్, కారు మరియు రోడ్డు పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీ గణాంకాలు మేము టెస్ట్ చేయగా వచ్చిన వాటి కంటే కొంచెం భిన్నంగా ఉండవచ్చని భావిస్తున్నాము. మీరు డస్టర్ పెట్రోల్-CVT లేదా వెన్యూ పెట్రోల్-DCT యజమానులలో ఒకరు అయితే, మీ ఫలితాలను దిగువ వ్యాఖ్యల విభాగంలో మాతో మరియు ఇతర యజమానులతో పంచుకోండి.

    మరింత చదవండి: వెన్యూ ఆన్ రోడ్ ప్రైజ్
     

    was this article helpful ?

    Write your Comment on Hyundai వేన్యూ 2019-2022

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience