#OddEvenFormula - ఢిల్లీ ప్రభుత్వం 4000 బస్సులను తమ 'కారు బాన్ 'సమయంలో అందుబాటులో ఉంచనున్నది
డిసెంబర్ 11, 2015 10:19 am sumit ద్వారా సవరించబడింది
- 21 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఢిల్లీ ప్రభుత్వం, సరైన అవగాహన లేకుండా చేసిన బేసి / సరి సంఖ్యల కారు నిషేధం వలన ఎదుర్కొన్న భారీ విమర్శల తరువాత ప్రజా రవాణా పదిలపరచడానికి 4,000 బస్సులను నియమించింది. ఇది డిల్లీ కాంట్రాక్ట్ బస్ అసోసియేషన్ (DCBA) తో జత కలసి ఇప్పుడు ప్రజా వినియోగం కోసం 4,000 బస్సులు అందిస్తుంది.
"మేము ఢిల్లీ కాంట్రాక్ట్ బస్ అసోసియేషన్ (DCBA) సభ్యులతో సమావేశమయ్యి ప్రణాళికను సిద్ధం, చేసుకున్నాము. దాదాపు 4,000 బస్సులు జనవరి 1-15 మధ్య రోడ్లపై ఉంటాయి మరియు అవన్నీ కూడా CNG బస్సులు. ప్రతిపాదనల వివరాల అధారంగా ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది." అని ఢిల్లీ ప్రభుత్వ రవాణా మంత్రి చెప్పారు. గవర్నమెంట్ ప్రైవేటు పాఠశాలలు తో కూడా మాట్లాడింది, వారి బస్సులు ప్రజా వినియోగం కోసం ఉపయోగించుకోవచ్చు. బస్సులు ఢిల్లీ రవాణా కమ్యూనికేషన్ (డిటిసి) కింద అమలు చేయబడడతాయి. అని కూడా ఆయన జోడించారు.
ఢిల్లీ ప్రభుత్వం, 6 రోజులు క్రితం ఢిల్లీలో కార్లపై ఒక అపూర్వమైన నిషేధం ప్రకటించింది. బేసి సంఖ్యలతో రిజిస్ట్రేషన్ చేయబడిన కార్లు మాత్రమే సోమవారం, బుధవారం మరియు శుక్రవారం నడుస్తాయి. అయితే కొత్త పథకం కింద మంగళవారం, గురువారం మరియు శుక్రవారం సరి సంఖ్యల గల కార్లు నడుస్తాయి. ఆదివారాలు మాత్రం నియమానికి మినహాయింపు ఉంది. మిగిలిన రోజులల్లో 8AM నుండి 8PM వరకూ కార్లు బాన్ చేయబడతాయి. అంతేకాకుండా , ఉహాగానాల ప్రకారం ఒంటరిగా ప్రయాణించే మహిళలకి దీనిలో ప్రత్యేకమైన మినహాయింపులు ఉండవచ్చు. ఢిల్లీ హైకోర్ట్ రూలింగ్ వచ్చిన తదుపరి వెనువెంటనే ఈ నిర్దేశాలు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే హైకోర్ట్ మాటల్లో డిల్లీ లో నివశించడం ఒక గ్యాస్ చాంబర్ లో నివశించడం లాంటిది అన్న విమర్శలు వచ్చాయి. తొలుత 15 రోజుల అవలంబన తరువాత ఈ బాన్ తీరుతెన్నుల కొనసాగింపు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు డిల్లీ ప్రభుత్వం ప్రకటనలో తెలియజేసింది.
ఇంకా చదవండి