• English
  • Login / Register

రూ.1.29కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన కొత్త టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 200

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 200 కోసం అభిజీత్ ద్వారా నవంబర్ 02, 2015 11:31 am ప్రచురించబడింది

  • 17 Views
  • 5 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఎస్యువి ల మధ్య బ్రూసియర్ టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 200 నవీకరణలతో రూ. 1.29 కోట్ల ధర ట్యాగ్ వద్ద ప్రారంభించబడినది. ఈ మార్పులు బయట, అలాగే లోపల కూడా చేయబడ్డాయి.

ప్రారంభం గురించి టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రెవేట్ లిమిటెడ్. సీనియర్ వైస్ ప్రెసిడెంట్. మిస్టర్. అకితోషి టకేమురా మాట్లాడుతూ " క్రమానుగతంగా మన ఆఫరింగ్ పెంచుకునే ప్రయత్నంలో మేము మా అగ్ర శ్రేణి గ్లోబల్ ఎస్యూవీ కొత్త ఎల్‌సి200 8 వ జనరేషన్ ని కొత్త డిజైన్ మరియు పరికరాలతో పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది. ఎల్‌సి 200 ఆన్ మరియు ఆఫ్ రోడ్ రెండిటిలో భూభాగాల పరిష్కారంలో దాని సరిపోలని సామర్థ్యంతో ప్రపంచ వ్యాప్తంగా 4డబ్లు డి ఎస్యువి లకు చెందిన కింగ్ టైటిల్ ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా గత 60 సంవత్సరాలకు పైగా 7.5 మిలియన్ల వినియోగదారులు ల్యాండ్ క్రూజర్ సిరీస్ ని సొంతం చేసుకునందుకు ఆనందిస్తున్నారు. మా వినియోగదారులకు మారుతున్న జీవనశైలి ప్రాధాన్యతలలో మేము మా కొత్త ఎల్‌సి200 ని పరిచయం చేస్తున్నాము." అని తెలిపారు.

నవీకరణలలో భాగంగా ఇప్పుడు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్ యూనిట్ ద్వారా కట్ చేయబడియున్న పునఃరూపకల్పన ఫ్రంట్ గ్రిల్ ని మరియు ఎ / టి రబ్బరు తో చుట్టబడియున్న కొత్త చక్రాల సమూహాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా సూపర్ వైట్, వైట్ పెరల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, గ్రే మెటాలిక్, బ్లాక్, ఆటిట్యూడ్ బ్లాక్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్ & బీజ్ మెటాలిక్ రంగులు కాకుండా కాపర్ బ్రౌన్ మరియు డార్క్ బ్లూ వంటి రెండు క్రొత్త రంగులను అందిస్తుంది.

లోపలివైపు, ఇప్పటికే విలాసవంతమైన కాక్పిట్ ఒక కొత్త స్టీరింగ్ వీల్ ని, ఎల్ఇడి ప్రకాశంవంతమైన ఎంట్రీ వ్యవస్థ, టైర్ ప్రెజర్ మోనిటరింగ్, మెరుగైన మల్టీ టెరైన్ మానిటర్ కెమెరాలు మరియు రెండు కొత్త అంతర్గత రంగులు బ్రౌన్ మరియు ఫ్లాక్సెన్ ని కలిగి ఉంది. ఇది కాక, ఈ 4డబ్లుడి ఆఫ్-రోడ్ టాక్లర్ 3 సంవత్సరాలు / 1 లక్ష కిలో మీటర్ల వారంటీని పొంది ఉంది.

was this article helpful ?

Write your Comment on Toyota ల్యాండ్ క్రూయిజర్ 200

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience