• English
  • Login / Register

విడుదలైన కొత్త మెర్సిడెస్-బెంజ్ G క్లాస్ 400d, ధర రూ.2.55 కోట్ల నుండి ప్రారంభం

మెర్సిడెస్ జి జిఎల్ఈ కోసం shreyash ద్వారా జూన్ 09, 2023 06:57 pm ప్రచురించబడింది

  • 85 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఒకే డీజిల్ పవర్‌ట్రెయిన్‌ కలిగిన రెండు విస్తృత వేరియంట్‌లలో పరిచయం చేస్తున్నారు: అడ్వెంచర్ మరియు AMG లైన్

Mercedes-Benz G400d Adventure And AMG Line

  • G-క్లాస్ భారతదేశంలో సరికొత్త, మరింత శక్తివంతమైన డీజిల్ వేరియంట్‌లో వస్తుంది.

  • G400d అడ్వెంచర్ అనేది భారతదేశం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన జీవనశైలి ఆధారిత వెర్షన్.

  • మరోకవైపు, G400d AMG లైన్ స్పోర్టియర్ లుక్ కలిగిన SUV ఆధారిత వెర్షన్.

  • రెండూ వేరియంట్‌లు ప్రస్తుతం 330PS పవర్ మరియు 700Nm టార్క్‌ను అందించగల ఆరు సిలిండర్ల డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి.

  • కొత్త G-క్లాస్‌ను రూ.1.5 లక్షల ముందస్తు ధరను చెల్లించి బుక్ చేసుకోవచ్చు, అక్టోబర్ 2023 నుండి డెలివరీలు ప్రారంభం కావచ్చు.

భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ G క్లాస్ ప్రస్తుతం కొత్త శక్తివంతమైన డీజిల్ వేరియంట్లో G400dగా వస్తుంది. ఇది రెండు కొత్త మోడల్‌లలో అందిస్తున్నారు– G400d అడ్వెంచర్ మరియు G400d AMG లైన్, ఇవి ఇంతకు ముందు విక్రయించిన G350d వేరియంట్ను భర్తీ చేస్తాయి. రెండు G క్లాస్ కొత్త వేరియంట్లు రూ.2.55 కోట్ల సమాన ధరను కలిగి ఉన్నాయి (ఎక్స్ షోరూమ్ పాన్ ఇండియా), 1.5 లక్షల రూపాయల ముందస్తు ధరను చెల్లించి కస్టమర్‌లు ఈ SUVలను బుక్ చేసుకోవచ్చు. వీటి వివరాలను ఇక్కడ చూద్దాం.

ఇవి ఒకదానికి ఒకటి ఎలా భిన్నంగా ఉంటాయి?

G400d అడ్వెంచర్ ఎడిషన్ 

New Mercedes-Benz G Class 400d Launched, Prices Start At Rs 2.55 Crore

G400d అడ్వెంచర్ ఎడిషన్ భారతదేశం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ SUV ప్రత్యేక ఎడిషన్‌లో రూఫ్ ర్యాక్, వెనుక భాగంలో తొలగించగల ల్యాడర్, 5-స్పోక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు టెయిల్ గెట్ వద్ద అమర్చిన పూర్తి పరిమాణం గల అదనపు వీల్ వంటి అనేక అడ్వెంచర్ ఆధారిత యాడ్-ఆన్‌లను పొందుతుంది.

G400d అడ్వెంచర్ ఎడిషన్ మొత్తం 25 రంగుల ఎంపికలలో అందిస్తున్నారు, వీటిలో నాలుగు కొత్త ప్రత్యేకమైన రంగులు ఉన్నాయి - సాండ్ నాన్-మెటాలిక్, వింటేజ్ బ్లూ నాన్-మెటాలిక్, ట్రావెర్టైన్ బీజ్ మెటాలిక్ మరియు సౌత్ సీస్ బ్లూ మెటాలిక్.

ఇవి కూడా చదవండి: మెర్సిడెస్-బెంజ్ నవీకరించబడిన A-క్లాస్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది, ధరలు రూ.45.8 లక్షల నుండి ప్రారంభమవుతాయి

G400d AMG లైన్ 

New Mercedes-Benz G Class 400d Launched, Prices Start At Rs 2.55 Crore

G400d AMG లైన్ G-వ్యాగన్ AMG పర్ఫార్మన్స్ SUVతో పొరపాటు పడకూడదు, కానీ ఇది G క్లాస్ స్పోర్టియార్ లుక్‌లో కనిపించే వెర్షన్. ఈ మోడల్‌లో నప్పా లెదర్ అప్‌హోల్స్టరీ, స్పోర్టి మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ అదనపు వీల్ కవర్ ముఖ్యాంశాలుగా ఉన్నాయి.

ఈ విలాసవంతమైన మెర్సిడెస్ ఆఫ్-రోడర్‌తో అందిస్తున్న ఇతర ఫీచర్లలో మల్టీబీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ మరియు స్లైడింగ్ సన్‌రూఫ్ ఉన్నాయి.

రెండూ సమానమైన ఆఫ్-రోడ్ సామర్ధ్యాలను కలిగి ఉన్నాయి

New Mercedes-Benz G Class 400d Launched, Prices Start At Rs 2.55 Crore

ఎప్పటిలాగే G క్లాస్ దాని హార్డ్‌కోర్ ఆఫ్‌రోడింగ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి మరియు ఈ కొత్త వేరియంట్లలో కూడా ఇదే కొనసాగింది. ఇది స్టీల్ ల్యాడర్ ఫ్రేమ్ చట్రంపై ఆధారపడింది మరియు 241 mm గ్రౌండ్ క్లియరెన్స్, 700 mm నీటి-లోతులో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ మోడల్లో ప్రత్యేకంగా ఆఫ్‌రోడ్ డ్రైవింగ్ కోసం “G మోడ్'ను కూడా కలిగి ఉంటుంది, తద్వారా ఎంచుకున్న డ్రైవింగ్ మోడ్‌తో సంబంధం లేకుండా మూడు డిఫరెన్షియల్ లాక్లతో (లేదా తక్కువ పరిధి) ఒకదాన్ని ఎంపిక చేస్తుంది. ఈ మోడ్‌లో, అవాంఛిత గేర్ షిఫ్టులను నివారించడానికి చాసిస్ డ్యాంపింగ్, స్టీరింగ్ ఇన్పుట్లు మరియు యాక్సిలరేటర్ స్పందనను తగిన విధంగా సర్దుబాటు చేస్తుంది.

ఇవి కూడా చూడండి: మెర్సిడెస్-బెంజ్ E- క్లాస్ సంవత్సరాలుగా ఏ విధంగా మార్పు చెందిందో చూడండి

పవర్‌ట్రెయిన్ వివరాలు

కొత్త G400d అదే OM656 ఇన్‌లైన్ ఆరు సిలిండర్ల డీజిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది ప్రస్తుతం 330 PS పవర్ మరియు 700 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది G క్లాస్ వేరియంట్‌లను కేవలం 6.4 సెకన్‌లలో సున్నా నుండి 100kmph వేగాన్ని అందుకొని మరియు గరిష్టoగా 210kmph అందుకునేలా చేస్తుంది.

డీజిల్ SUV గ్రీన్ వివరాలు

New Mercedes-Benz G Class 400d Launched, Prices Start At Rs 2.55 Crore

మెర్సిడెస్-బెంజ్ అందించిన వివరాల ప్రకారం, G400dలో 35.9kgల బరువున్న 41 భాగాలు అధిక నాణ్యత గల రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడినవి. అంతేకాకుండా, లోపలి భాగంలో ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్స్ బ్యాక్ రెస్ట్ క్యూషనింగ్ కోసం లాటెక్స్ ఎమల్షన్ కలిగిన కొబ్బరి ఫైబర్ మరియు లోపలి డోర్స్ ప్యానెల్ నిర్మాణానికి కలప ఫైబర్ను ఉపయోగించారు.

డెలివరీలు & ప్రత్యర్థులు

కేటాయింపుల ఆధారంగా, కొత్త G క్లాస్ వాహన డెలివరీలు అక్టోబర్ 2023 నుండి అవుతాయని అంచనా. మెర్సిడెస్-బెంజ్, తమ ప్రస్తుత వినియోగదారులు G400dని బుక్ చేసుకోవడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని పొందగలరని పేర్కొంది. భారతదేశంలో, G క్లాస్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లకు పోటీగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: G -క్లాస్ డీజిల్

was this article helpful ?

Write your Comment on Mercedes-Benz జి జిఎల్ఈ

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • టాటా సియర్రా
    టాటా సియర్రా
    Rs.10.50 లక్షలుఅంచనా ధర
    సెపటెంబర్, 2025: అంచనా ప్రారంభం
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • బివైడి sealion 7
    బివైడి sealion 7
    Rs.45 - 49 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • నిస్సాన్ పెట్రోల్
    నిస్సాన్ పెట్రోల్
    Rs.2 సి ఆర్అంచనా ధర
    అక్ోబర్, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience