• English
    • Login / Register

    రూ. 2.6 కోట్లు రూపాయల వద్ద ప్రారంభమయిన మెర్సిడీస్ మ్యేబాచ్ ఎస్600 సెడాన్

    సెప్టెంబర్ 25, 2015 02:22 pm manish ద్వారా సవరించబడింది

    • 21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:మెర్సిడీస్ బెంజ్ ఇండియా భారతదేశంలో నేడు మేబ్యాచ్ ప్రీమియం లగ్జరీ సబ్ బ్రాండ్ ప్రారంభించింది. సంస్థ భారతమార్కెట్ లో మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్600 ని రూ. 2.6 కోట్ల ధర వద్ద (ఎక్స్-షోరూమ్, పూనే) లో ప్రారంభించింది. సంస్థ నివేధిక ప్రకారం, మేబ్యాచ్ ఎస్600 గత ఏడాది అంతర్జాతీయంగా రంగ ప్రవేశం చేసి ప్రపంచంలోనే తక్కువ శబ్ధాన్ని విడుదల చేసే కారుగా చెప్పబడినది. ముందస్తు దరఖాస్తులు డిసెంబర్, 2014 లో తిరిగి ప్రారంభమయ్యింది మరియు కారు కోసం డెలివరీలు ఫిబ్రవరి 2015 లో ప్రారంభమయ్యింది.

    జర్మన్ వాహన తయారీసంస్థ మెర్సిడెస్ ఎస్63 ఎఎంజి యొక్క ఇటీవల ప్రారంభంతో 43% మార్కెట్ వృద్ధిని సాధించిందని ప్రకటించింది. మెర్సిడెస్ భారతదేశం లో దాని వినియోగదారులను పెంచుకోవాలని యోచిస్తుంది. ఎస్600 మెర్సిడీస్ భారతదేశపు పోర్ట్ ఫోలియోలో 15 ఇన్ 15 వ్యూహంలో ఒక భాగం మరియు సంస్థ యొక్క 12 వ ప్రారంభం. సంస్థ ఎస్-క్లాస్ ని భారతదేశంలో అసెంబ్లింగ్ చేసింది మరియు మేబ్యాచ్ ఎస్60 భారతదేశానికి సిబియు మార్గం ద్వారా వచ్చింది. 

    వెనుక సీట్ జోడించడం వలన ఎస్600 మేబ్యాచ్ సాధారణ ఎస్- క్లాస్ కంటే 200 మిల్లీమీటర్లు పొడవైనదిగా ఉంటుంది. ఈ సెడాన్ లో మర్దనా సీట్లు, చలి వెనుక సెంటర్ ఆర్మ్రెస్ట్ మరియు బర్మెస్టర్ 3డి ఆడియో సిస్టమ్ వంటి విశాల లక్షణాలు ఉన్నాయి. కారు ప్రమాణంగా వెనుక ఎగ్జిక్యూటివ్ సీటింగ్ ప్యాకేజీ కూడా అందిస్తుంది. 

    ఈ ఎస్ 600 మేబ్యాచ్ శక్తివంతమైన 6.0-లీటర్, వి12, ద్వి టర్బో పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి 523bhp శక్తిని మరియు 830Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా నియంత్రించబడి 249Km/h గరిష్ట వేగాన్ని అందిస్తుంది. 

    నిర్దేశాలు:

    • ఇంజిన్: 6.0-లీటర్ ద్వి టర్బో వి12

    • హార్స్పవర్: 523bhp

    • టార్క్: 830Nm

    • గేర్బాక్స్: 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్

    • ధర: రూపాయలు 2.6 కోట్లు(ఎక్స్-షోరూం, పూనే) 

    was this article helpful ?

    Write your Comment on Maybach S600

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience